ఒక పక్క ఎన్ని రాజకీయ విమర్శలు ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని మాత్రం గుర్తించకుండా ఉండలేని పరిస్థితి కేంద్రానిది... స్వయంగా ప్రధాని మోడీనే, మన రాష్ట్రానికి అవార్డు ఇవ్వాల్సిన పరిస్థితి.. ఇది చంద్రబాబు ముందు చూపుకు, కష్టానికి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు... గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతకు నైపుణ్యాభివృద్ధిలో (స్కిల్ డెవలప్మెంట్) శిక్షణను ఇస్తూ, ఉపాధి కల్పనకు తోడ్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు, జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వచ్చింది... మొదటిస్థానంలో ఒడిసా ఉండగా, రెండో స్థానంలో కేరళ నిలచింది... మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాల లాబీయింగ్‌ను అధిగమించి మరీ, ఆంధ్రప్రదేశ్ ఈ ర్యాంకు సాధించడం విశేషం.
నిజానికి ఈ అంశంలో కేరళ రాష్ట్రం కంటే, ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది.. కాని కేరళలో మెట్రోరైలులో గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు, ఎక్కువగా చూపడంతో ఆ రాష్ట్రం రెండో స్థానం సాధించింది... ఈ ఏడాది వచ్చిన ర్యాంకు స్ఫూర్తితో, వచ్చే సంవత్సరం నెంబర్ వన్ స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో కోగంటి సాంబశివరావు చెప్పారు... ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఈ అవార్డు, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి దినోత్సవం సందర్భంగా మే 5న రాంచీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డులను అందజేస్తారని తెలిపారు. యువతలో దాగిఉన్న విజ్ఞానాన్ని, నైపుణ్యాలను వెలికి తీసి ఉపాధి అవకాశాలను కల్పించేలా దిశగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీఈవో కె. సాంబశివరావును సీఎం ఆదేశించారు.
రాష్ట్రంలోని గ్రామీణ యువతకు సోసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఏపీ(సీడ్‌ఏపీ) నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది 5980 మందికి శిక్షణ ఇచ్చి, 10,923 మందికి ఉపాధి కల్పించింది. ఈ ఏడాది 17,977 మందికి శిక్షణ కల్పించింది. ఒక్కో విద్యార్థిపె రూ.60 వేల వరకు ఖర్చు చేస్తోంది. కాగా, నైపుణ్యాభివృద్ధిపై ఆసక్తిగల యువత జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయాలను సంప్రదించాలని సీఈవో కోగంటి సాంబశివరావు సూచిస్తున్నారు.