వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుని మళ్ళీ అరెస్ట్ చేయటానికి ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోని రఘురామకృష్ణం రాజు ఇంటి దగ్గర ఏపి సిఐడి అధికారులను రఘురామకృష్ణం రాజు సెక్యూరిటీ గమనించారు. రఘురామరాజు ఇంటి ముందు నిఘా కోసం సిఐడి అధికారులు రావటంతో, వాళ్ళు ఎవరో తెలియక, ఇక్కడ ఎందుకు ఉన్నారు అని గట్టిగా అడగటంతో, తాము సిఐడి అధికారులమని చెప్పటంతో అసలు విషయం బయట పడింది. రఘురామ కృష్ణం రాజు ఆర్ఎస్ఎస్ నేత దత్తాత్రేయ హస్బోలే హైదరాబాద్ లో ఒక కార్యక్రమం చేస్తూ ఉండటంతో, ఆ కార్యక్రమంలో పాల్గునటానికి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకుని, రఘురామకృష్ణం రాజు ని హైదరాబాద్ లో మళ్ళీ అరెస్ట్ చేయటానికి ఏపి సిఐడి అధికారులు ఆయన పైన నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే రఘురామకృష్ణం రాజు గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. హైదరాబాద్ కూడా రావటం లేదు. సంక్రాంతి పండుగ ముందు, రఘురామకృష్ణం రాజు పైన మరో కేసుని సిఐడి అధికారులు బుక్ చేసారు. అయితే అప్పట్లోనే ఆయన ఇంటికి వెళ్లి, పండగ టైంలో, విచారణకు రావాల్సిందిగా కోరారు.
అయితే దానికి రఘురామకృష్ణం రాజు ఒప్పుకోలేదు. ఆయన వెంటనే ఢిల్లీ వెళ్ళిపోయారు. అక్కడ నుంచి సిఐడి అధికారులకు తాను రాలేను అని మెసేజ్ పెట్టారు. ఈ లోపు పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రారంభం కావటంతో, సిఐడి అధికారులు మళ్ళీ రావాలని, అయానను కోరలేదు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు రఘురామరాజు హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకుని, మళ్ళీ హైదరాబాద్ లో ఆయన ఇంటి ముందు నిఘా పెట్టారు. అయితే రఘురామరాజు సిబ్బంది, అతన్ని పట్టుకుని గట్టిగా అడగటంతో, తాము సిఐడి అధికరులమని, రఘురామకృష్ణం రాజుని అరెస్ట్ చేయటానికి వచ్చామని చెప్పారు. ఇదే విషయం రఘురామరాజు కూడా, కొద్ది సేపటి క్రితం ఒక వీడియో విడుదల చేసి, అసలు విషయం చెప్పారు. అయితే ఇక్కడ ఉంటే ఇబ్బంది అని గ్రహించిన రఘురామరాజు, సిఐడి అధికారుల కళ్ళు గప్పి, ఇంటి నుంచి బయటకు వచ్చి, ఎయిర్ పోర్ట్ కు వెళ్లి,అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. మరి రఘురామరాజుని సిఐడి ఎలాంటి వ్యూహంతో అరెస్ట్ చేస్తుందో చూడాలి.