21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు... వారి పేర్లు బయటపెట్టిన గంటలో చంద్రబాబు ప్రభుత్వం పడిపోతుంది... ఇది, గత సంవత్సరం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అన్న మాటలు... ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా ఇవే మాటలు చెప్తున్నారు... మ్యాటర్ జగన్ దగ్గర పెండింగ్ లో ఉంది... జాగ్రత్తా అంటూ, విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు... తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. వీరి విషయంలో జగన్ నిర్ణయం తీసుకోవలసి ఉందన్నారు... అంతే కాదు, ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్ల అంతు కూడా చూస్తారు అంట... విశాఖ పాతగాజువాకలో వైసీపీ దీక్షాశిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
ఎర్రచందనం విక్రయిస్తే వచ్చే డబ్బుతో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. చైనాకు అటవీ కార్యదర్శిని పంపి రూ.10 వేల కోట్ల చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా గుర్తుకురాని ప్రత్యేక హోదా ఇప్పటికిప్పుడు గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, లోకేశ్ అవినీతిపైనా, వారికి సహకరించిన అధికారులపైనా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, మీకు హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేంద్రమంత్రి పదవులకే కాకుండా... ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామాలు చేయించాలని.. అందుకు తాము సిద్ధమేనని..మీరు సిద్ధమా అంటూ విజయసాయి చంద్రబాబుకు సవాల్ విసిరారు....
అయినా ముందు, మీరు వెళ్లి, మీ రాజనీమాలు ఆమోదించుకోండి, అప్పుడు సవాల్ విసరండి అని, తెలుగుదేశం నేతలు ఎదురు అంటే, విజయసాయి రెడ్డి, వెళ్లి పియంఓ లో దాక్కోవాలి అంటూ, తెలుగుదేశం నేతలు అంటున్నారు.... అయినా, ఇలా బెదిరించటం ఎందుకు... మ్యాటర్ జగన్ దగ్గర ఉంచుకోవటం ఎందుకు... జగన్ ఆవేశంలో ‘‘21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వస్తే గంటలో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొడతా’’ అంటూ చేసిన వ్యాఖ్యలు, రివర్స్ అయ్యి, జగన్ నుంచి 21 మంది వెళ్ళిపోయిన విషయం మర్చిపోయినట్టు ఉన్నారు... రాజకీయాల్లో ప్రగల్భాలుండకూడదు.. పడగొట్టాలనుకుంటే పడగొట్టేయడమే.. గంటలో పడగొడతా.. రోజులో పడగొడతానని ఎదుటి వాడిని రెచ్చగొట్టడం, మైండ్ గేమ్ మాత్రమే కాగలదు. మైండ్ గేమ్ అధికారంలో ఉన్న వారికే బాగా ఉపకరిస్తుందనేది నిష్టుర సత్యం, 21 మంది ఎమ్మెల్యేల చేరికితో రుజువైనా బుద్ధి రాలేదు. అయనా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి అంటే కావాల్సింది ప్రజల సపోర్ట్, ఎమ్మెల్యేల సపోర్ట్ కాదు అని జగన్ తెలుసుకోవాలి.