భారతీయ జనతాపార్టీని సిద్ధాంతపరంగా నియంత్రించే అత్యంత కీలకమైన విశ్వహిందూ పరిషత్ సీన్ ఇప్పుడు రివర్స్ అయ్యింది... ఒకప్పుడు ఆరెస్సెస్ .. బీజేపీని నియంత్రించేంది. ఇప్పుడు సంఘ్ ను తానే నియంత్రించడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. దానికి వీహెచ్ పీలో ప్రవీణ్ భాయ్ తొగాడియాను శాశ్వతంగా సాగనంపటమే సాక్ష్యమని సంఘ్ లోని కొంత మంది పెద్దలు బహిరంగంగానే చెబుతున్నారు... వచ్చే ఎన్నికల్లో బిజెపికి 150 నుంచి 200 స్థానాలు మించి బిజెపికి రావు అనేది సంఘ్ కి స్పష్టత వచ్చింది... బీజేపీ పై కంటే, మోడి పై ప్రజల్లో ఎక్కువ కోపం ఉందని, అందుకే ప్రధాని అభ్యర్ధిని మార్చే కసరత్తు సంఘ్ ప్రారంభించింది అని తెలియటంతో, సంఘ్ ని తన కనుసన్నల్లో పెట్టుకోవాలని భావించారు మోడీ.. మోడీ పిలుపునిచ్చిన కాంగ్రెస్ ముక్త్ భారత్ ను ఆయన వ్యతిరేకించారు.. తన పై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్న, విహెచ్‌పి అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియాను బయటకు పంపే ప్లాన్ వేసి సక్సెస్ అయ్యారు..

modi vhp 1504218

గత మూడు దశాబ్దాలుగా విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ)లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ప్రవీణ్‌ తొగాడియా ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. అంతర్జాతీయ స్థాయిలో వీహెచ్పీకి అధ్యక్ష ఎన్నికలు జరుగగా, రాఘవరెడ్డి అనే వ్యక్తిని తొగాడియా నామినేట్ చేశారు. ఎన్నికల్లో రాఘవరెడ్డి ఓటమిపాలు కావడంతోనే తొగాడియా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2011 నుంచి ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీహెచ్పీ పనిచేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక కొత్త అధ్యక్షుడిగా హిమాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ వీఎస్ కోక్జె ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రాఘవరెడ్డికి 60 ఓట్లు లభించగా, కోక్జెకు 131 ఓట్లు లభించాయి.

modi vhp 1504218

సుమారు 50 ఏళ్ల తర్వాత వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగగా, ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తొగాడియా ఆరోపించారు. మరోవైపు హిందువుల హక్కుల కోసం జీవితాంతం పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు తొగాడియా… హిందూత్వ అంశానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 17వ తేదీ నుంచి ఆమరణ నిరహారదీక్ష చేయనున్నట్టు ప్రకటించారు... ఇక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ విష్ణు సదాశివ కోక్జే తన టీమ్‌ను ప్రకటించారు. ఇందులో తొగాడియా మద్దతుదారులు ఎవరికీ చోటు కల్పించ లేదు. వీహెచ్‌పీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అలోక్‌ కుమార్‌ను, అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అశోక్‌ చౌగులే, ప్రధాన కార్యదర్శిగా మిలింద్‌ పరాండే, సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా వినాయకరావు దేశ్‌పాండే, వేంకట కోటేశ్వరరావులను నియమించారు.దీనిబట్టి చూస్తే మోడీ హిందుత్వ సంస్థలపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి శైలి గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు.. ఎవర్ని అయిన మొహమాటం అనేది లేకుండా కడిగేస్తూ ఉంటారు.. ఉన్నది ఉన్నట్టు మొఖం మీద చెప్పేసి వస్తారు... ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు,నిరసనలు పూర్తయిన తరువాత, జేసీ దివాకర్‌రెడ్డి నేరుగా రాజధాని అమరావతికి వచ్చారు. చంద్రబాబును కలుసుకున్నారు. ఆయనతో దాదాపు అరగంటసేపు ఏకాంతంగా భేటి అయ్యారు. బస్సు యాత్ర పేరుతో జిల్లా కేంద్రాలకు ఎంపీలను తీసుకువెళితే బాగోదని...మనం దృష్టి కేంద్రీకరించిన అంశం ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదని నిర్మోహమాటంగా చెప్పారు. అలా కాకుండా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాలకు వెళితే బాగుంటుందని సూచించారు. ఇంటింటికీ తెలుగుదేశం మాదిరిగా గ్రామాలలోకి వెళ్లాలనే సలహా ఇచ్చారు జేసీ . ఒకవేళ బస్సు యాత్రను నిర్వహించినా.. ఈ కార్యక్రమాన్ని కూడా చేపడితే బాగుంటుందేమో ఆలోచించాలని ముఖ్యమంత్రికి జేసీ వివరించారు.

jc chandrababu 15042018

మెజారిటీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని.. ప్రతిరోజూ ఏదో ఒక పని చేయమని అనడం.. బయోమెట్రిక్‌ అడెండెన్స్‌.. ఇలాంటివి వారికి కంటగింపుగా మారాయని సీఎంకు దివాకర్‌రెడ్డి చెప్పారట! 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ వారు సంతృప్తి చెందకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎంపీ విశ్లేషించారట! దీంతో పాటు రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లోనూ.. వివిధ శాఖల్లోనూ అవినీతి ఎక్కువగా ఉందని .. ఎమ్మార్వో కార్యాలయాలలో డబ్బు ఇవ్వందే పనులు జరగడం లేదని...జనం కాళ్లు అరిగేలా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా రాజకీయ పరిణామాలను కూడా విశ్లేషించారు జేసీ.. పవన్‌కల్యాణ్‌.. జగన్మోహన్‌రెడ్డిలను కలిపేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదన్నారు. ఇద్దరిని కలిపి ఎన్నికలలో పోటీ చేయిస్తే టీడీపీ ఓడిపోతుందనేది నరేంద్రమోదీ వ్యూహం కావచ్చని అన్నారు. జగన్‌, పవన్‌లు చెరో సగం సీట్లకు పోటీ చేసే అవకాశం ఉందని.. ఒకవేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని కూడా చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని చూస్తున్నారని జేసీ వివరించారు.

jc chandrababu 15042018

ఇవన్నీ చంద్రబాబుకు చెబుతూనే.. ఇకనుంచి పార్టీపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు. ఎన్నికల వరకు ఇదే టెంపోను కొనసాగించాలని జేసీ కోరారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, జనసేన, కాంగ్రెస్‌, బీజేపీలు విడివిడిగా పోటీ చేస్తే తమకు కలిసివస్తుందని జేసీ విశ్లేషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి అధికారపక్షానికి అడ్వాంటేజ్‌ అవుతుందన్నారు. ఇక శాఖాపరమైన సమీక్షలతో కాలం గడపకుండా పార్టీ కోసం సమయం కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సలహా ఇచ్చారు. నియోజకవర్గాలలో ఉన్న చిన్న చిన్న విబేధాలను పరిష్కరించడంతో పాటు, అభ్యర్థుల గుణగణాలను, ఎంపికపై కసరత్తు నిర్వహించాలన్నారు. కార్యకర్తలను ఎన్నికల దిశగా నడిపించాలని సలహా ఇచ్చారు. అధినేతలకు క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించడం తన ధర్మమని.. ఆయన చెప్పినవి చక్కగా వింటారని జేసీ వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీలో తాను చేరుతానని చెప్పలేదని కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జనసేనలో తానేమీ చేరబోవడం లేదన్నారు.. పవన్ రాజకీయాల్లో నెగ్గాలంటే రెండు పడవల మీద కాలు పెట్టారాదు. సినిమావాళ్ళు రాజకీయాల్లో నెగ్గరు. అది ఒక్క ఎన్.టీ. ఆర్ కు మాత్రమే దక్కింది. ఆయన తొమ్మిది మాసాల పాటు ప్రజల్లోనే జీవించడం వలన ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన మాదిరి నెగ్గాలంటే పవన్ ప్రజల్లో తిరిగి విశ్వాసం కలిగించాలి అంటూ పవన్ పై ముద్రగడ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి... అంతే కాదు, అందరూ చెప్తున్నట్టే, ముద్రగడ కూడా, పవన్ బీజేపీతో కలిసిపోయారు అనే ఆరోపణలు చేసారు...

mudra 150142018

ముద్రగడ మాట్లాడుతూ, "పవన్ మహా వృక్షము నీడలో ఉన్నారు. ఆయన బి.జె.పి.ని వదిలి బయటకు వస్తే గాని ఎదగ రు. తాను ఏపార్టీ లో గాని ఎవరికి గాని మద్దతు ఇవ్వను." అంటూ ముద్రగడ పవన్ పై వ్యాఖ్యలు చేసారు... తన అభిప్రాయాలను జనసేన నేత రాఘవయ్యతో చర్చించానని ఆయన స్పష్టం చేశారు. అంత మాత్రానా తాను జనసేన పార్టీలో చేరుతున్నట్టు కాదని ఆయన గుర్తు చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పక్కగా కమిటి వేసి, కాపులకి రిజర్వేషన్ కోసం, కేంద్రానికి పంపింది...

mudra 150142018

కేంద్రం మాత్రం, ఇప్పటికీ ఏమి స్పందించలేదు... ముద్రగడ, కేంద్రం పై పోరాడకుండా, చంద్రబాబు పైనే విమర్శలు గుప్పిస్తూ ఉంటారు... మరో పక్క, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చెయ్యటం, ఇప్పుడు ఆసక్తిగా మారింది... పవన్ కి కూడా కాపు సామాజికవర్గ సపోర్ట్ ఉండటంతో, ముద్రగడ లాంటి వారి మాటలు, ఆసక్తిగా మారాయి.. మరో పక్క,ముద్రగడని జగన్ నడిపిస్తున్నారు అనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి... ముద్రగడ పనులు కూడా అలాగే ఉంటాయి... ఎప్పుడూ జగన్ మనుషులని కలుస్తూ, జగన్ ను పైకి ఎత్తుతూ ఉంటారు... ట్రైన్ తగలుబెట్టిన విషయంలో కూడా, జగన్ పార్టీ నేతల సపోర్ట్ తోనే చేసారు అని, సిఐడి కేసు కూడా బుక్ చేసిన సంగతి తెలిసిందే...

అగ్రిగోల్డ్ వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చిన సంగతి తెలిసిందే... చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, వీరికి ఎలా అయినా న్యాయం చెయ్యాలని, అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మి, నష్టపోయిన వారికి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు... ప్రభుత్వం తరుపున చేస్తే లేని పోనీ తలనొప్పులు అని, కోర్ట్ ద్వారా ఈ ప్రక్రియ చెయ్యటానికి రెడీ అయ్యారు.. ఇదే తరుణంలో, అగ్రి గోల్డ్ ను టేకోవర్ చేసేందుకు జీఎస్సెల్ గ్రూపు ముందుకొచ్చింది. జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర అమరావతి వచ్చి ఆ మధ్య చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు. అంతా స్వయంగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో, అగ్రిగోల్డ్‌ సంస్థను టేకోవర్‌ చేయడానికి ముందుకొచ్చిన ఎస్సెల్‌-జీ గ్రూపు చేతులేత్తేసింది... ఇదే విషయం నిన్న కోర్ట్ కి చెప్పింది.. అయితే, ఈ తతంగం మొత్తం వెనుక మోడీ, బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి...

botsa 15042018

ఇది కనుక ఒక కొలిక్కి వస్తే, 19 లక్షల మందికి చంద్రబాబు దేవుడు అవుతాడు... అల చేస్తే, రాజకీయంగా చంద్రబాబుకి లాభం... అందుకే, ఇది ముందుకు వెళ్ళకుండా ఆపారు అంటున్నారు... జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర, 2016లో బీజేపీ సపోర్ట్ తో రాజ్యసభకు ఎన్నికయ్యారు... మోడీ, సూచనలు మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చంద్రబాబుకి ఏ మేలు చెయ్యకూడదు అనే ఆదేశాలు మేరకు, ఇలా జరిగి ఉండవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.. అగ్రిగోల్డ్ వ్యవహరం మళ్లీ మొదటికి రావడానికి వైసీపీనే కారణమని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… అగ్రిగోల్డ్ వ్యవహరంలో వైసీపీపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టేకప్ చేయడానికి ముందుకొచ్చిన జీ-ఎస్సెల్ గ్రూప్.. వైసీపీ వల్లే వెనక్కు వెళ్లిందన్నారు. కేంద్రం మా చేతిలో ఉంది అంటూ సీబీఐ కేసుల పేరుతో జీఎస్సెల్ గ్రూప్‌ను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ విషయాన్ని జీ-ఎస్సెల్ కంపెనీ ప్రతినిధులే స్వయంగా వెల్లడించారని తెలిపారు.

botsa 15042018

అయితే, ఈ విషయం పై వైసిపీ తరుపున బొత్సా ఒక్కరే మాట్లాడుతున్నారు... ఆయన దీని పై సిబిఐ విచారణ అడుగుతున్నారు... సిబిఐ విచారణ జరిపితే, ఇక కేసు ఎప్పటికీ తేలదు... అదే వీళ్ళ ప్లాన్... అయితే, ఈ విషయం పై అగ్రిగోల్డ్ బాధితులు మండిపడుతున్నారు.. అగ్రిగోల్డ్ వ్యవహారంపై సీబీఐ విచారణకు మేం వ్యతిరేకమని అగ్రిగోల్డ్ బాధితులు తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడును కలిసిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వమే అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేయాలని కోరామన్నారు. వేలం ప్రక్రియ కోసం కోర్టు అనుమతి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. మిగిలిన రాష్ట్రాల కంటే సీఎం చొరవ తీసుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్ పై రాజకీయాలు చేయొద్దని అన్ని పార్టీలను కోరుతున్నామన్నారు. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం వేసే అఫిడవిట్‌ను పరిశీలించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎస్సెల్ గ్రూపును బీజేపీ పెద్దలు బెదిరించి ఉంటారని తాము భావిస్తున్నట్లు తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read