నవ్యాంధ్ర జీవినాడి పోలవరం పై కేంద్రంలోని బీజేపీ పెద్దలు మొదటి నుంచి గేమ్ ఆడుతూనే ఉన్నారు... గత సెప్టెంబర్ లో, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, కేంద్రం పోలవరం పై చేస్తున్న నాటకాలు బయట పెట్టే దాక, వీరి నిజ స్వరూపం తెలియలేదు... పోలవరం అనేది ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అనేది అందరికీ తెలుసు.. అందుకే కేంద్రం తప్పించుకుని, సెప్టెంబర్ 8, 2016న రాష్ట్ర ప్రభుత్వానికి అప్ప చెప్పి, చేతులు దులుపుకున్నారు... వారు ఊహించింది, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళదు, నెపం చంద్రబాబు మీద నెట్టవచ్చు అని.. కాని చంద్రబాబు, ఈ అవకాశాన్ని వాడుకుని, ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నీ బయటకు తీసారు.. ప్రతి సోమవారం, పోలవరం పై రివ్యూ పెట్టుకున్నారు... పెద్ద పెద్ద మిషన్లు ఇంపోర్ట్ చేపించారు... కొన్ని క్లిష్టమైన పనులు విదేశీ కాంట్రాక్టుర్లకు అప్పచెప్పారు... దీంతో అనూహ్యంగా, పోలవరం ప్రాజెక్ట్ పరుగులు పెట్టింది...

polavaram 17042018

దీంతో కొంత మంది పెద్దలకు కన్ను కుడుతుంది.. అందుకే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ఎలాగైనా ఆపి, చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ తియ్యాలి అనే ప్లాన్ వేస్తున్నారు... దీంట్లో భాగంగా, ఈ రోజు ఒరిస్సా రాష్ట్రం, పోలవరం ఆపెయ్యాలి అంటూ సుప్రీం కోర్ట్ ని కోరింది. పోలవరంపై ఒడిశా దాఖలు చేసిన ఒరిజినల్‌ సూట్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. తీసుకున్న అనుమతులకు, చేపడుతున్న నిర్మాణాలకు పొంతన లేదని ఒడిశా వాదించింది. అనుమతులకు అనుగుణంగా అక్కడ నిర్మాణాలు జరగడం లేదని, బచావత్ ట్రిబ్యూనల్ తీర్పుకు కూడా విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాదించింది.

polavaram 17042018

పొరుగు రాష్ట్రాల అనుమతులు తీసుకోవాలన్న నిబంధనలు కూడా పాటించకుండా కేంద్ర ప్రభుత్వం పోలవరంకు అనుమతులు ఇచ్చిందిన ఒడిశా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పర్యావరణానికి సంబంధించి అనేక అనుమతులు కూడా పెండింగ్‌లో ఉన్నందున పోలవరం నిర్మాణంపై స్టే విధించాలని వాదనలు వినిపించారు. అయితే అనుమతులకు అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని ఏపీ వివరణ ఇచ్చింది. మూడు రోజుల్లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 2కు వాయిదా వేసింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు అనుగుణంగానే పోలవరం నిర్మాణం జరుగుతోందని సీడబ్ల్యూసీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరిగుతాయో, ఇంకా ఎన్ని కుట్రలు జరుగుతాయో చూడాలి...

రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్ష పై షడ్యుల్ విడుదల అయ్యింది... ఉదయం 9 గంటలకు దీక్ష మొదలవుతుంది. దీక్ష ముగిశాక అదే రోజు సాయంత్రం మున్సిపల్‌ స్టేడియంలోనే తెదేపా-దళితతేజం విజయోత్సవ సభను నిర్వహిస్తారు. తొలుత ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా దళితతేజం విజయోత్సవ సభ నిర్వహించాలన్నా... చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగిన పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా భాజపాతో పొత్తు పెట్టుకోవడం మొదలు తాజా రాజకీయ పరిణామాల వరకు ఆయన సుదీర్ఘంగా వివరించారు.

cbn 1704208

విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధన కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా ఈ నెల 20న నిరాహార దీక్ష చేస్తున్నట్టు తెలిపారు. అదేరోజు నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మండల కేంద్రాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు నిర్వహిస్తారు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ‘నమ్మకద్రోహం-కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ పేరుతో ఏప్రిల్ 30న తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకు టిడిపి కార్యవర్గం అంతా హాజరు కావాలని నిర్ణయించారు.ప్రత్యేక హోదాపై నిరసన దీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 20న జరగాల్సిన ‘దళిత తేజం-తెలుగుదేశం’ కార్యక్రమం ముగింపు సభను వాయిదా వేశారు.దళిత తేజం తరహాలోనే మైనారిటీ సెల్ సదస్సులు కూడా విజయవంతంగా నిర్వహించాలని కోరారు.

cbn 1704208

అలాగే, ఈ నెల 21నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు... పదిహేను నుంచి ఇరవై రోజులపాటు అన్ని గ్రామాలలో టిడిపి సైకిల్ యాత్రలు, నియోజకవర్గ కేంద్రంలో భారీ బహిరంగ సభలు జరపాలని నిర్ణయించారు... మన సైకిల్ యాత్రలు ప్రజల్లో కదలిక తీసుకురావాలి, జనంలో ఒక ఊపు రావాలి... కేంద్రం చేస్తున్న అన్యాయమే కాదు, వారు సహకరించక పోయినా, ఈ నాలుగేళ్లలో మనమ చేసిన అభివృద్ధి చెప్పాలి, సాధించిన విజయాలు వివరించాలి, హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటూ చంద్రబాబు చెప్పారు... పనులు చేయడం ఎంత ముఖ్యమో, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం అంతే ముఖ్యం అని చంద్రబాబు అన్నారు... ఏపిలో అభివృద్ధి అద్భుతంగా ఉందని తమిళనాడులో ప్రచారం జరుగుతోందని, చరిత్రలో గతంలో జరగని అభివృద్ది ఈ నాలుగేళ్లలో చేశామని, ఆ మోతాదులో వాటిగురించి జనంలో నమోదు చేయలేక పోయామని, ఇప్పటికైనా సైకిల్ యాత్రలను సద్వినియోగం చేసుకుని, ప్రచారం చెయ్యాలని చంద్రబాబు చెప్పారు...

రాజకీయంగా ఆపరేషన్ గరుడ, ఇప్పటికే మొదలైపోయింది... అయితే, విధ్వంసం సృష్టించి, రాష్ట్రంలో అనిశ్చితికి ప్లాన్ చేసిన సంగతి కూడా తెలిసిందే... అయితే, నిన్న బంద్ సందర్భంగా భారీ విధ్వంసం ప్లాన్ చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి... సిసి టీవీ ఫుటేజీలను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు... ప్రశాంతంగా జరుగుతున్న ‘ప్రత్యేక హోదా’లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ నలుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘హోదా బంద్‌ హింసాత్మకం... బైక్‌ను తగలబెట్టిన ఆందోళనకారులు... ఉద్రిక్తత’ అనే కలరింగ్‌ ఇచ్చేందుకు తమంతట తామే ఒక డొక్కు బైక్‌ను తీసుకొచ్చి, దానికి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. తిరుపతి ఈస్ట్‌ డీఎస్పీ మునిరామయ్య తెలిపిన ప్రకారం... సోమవారం బంద్‌ సందర్భంగా తిరుపతి బస్టాండ్‌ సమీపంలో ఓ ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. ఇది పార్టీలు, లేదా సంఘాల ఆందోళనలో భాగంగా కాకుండా... అల్లర్లు, హింసను ప్రేరేపించేలా జరిగింది. బస్టాండు సమీపంలో బైక్‌ తగలబడటంతో జనం ఆందోళనకు గురయ్యారు.

yco 17042018

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఆ బైక్‌ను తోసుకుంటూ వచ్చి... అక్కడ నిలిపి తగలబెట్టినట్లు గుర్తించారు. వారిని వైసీపీ కార్యకర్తలుగా గుర్తించారు. అజయ్‌కుమార్‌, రాజు, మురళి, ఉదయ్‌ వంశీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇటీవల వైసీపీ నిర్వహించిన హైవేల దిగ్బంధం సందర్భంగానే బైక్‌ను తగలబెట్టాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. రూ.3500 చెల్లించి ఒక పనికిరాని బైక్‌ను మెకానిక్‌ నుంచి కొనుగోలు చేశారు. సోమవారం వ్యూహాత్మకంగా తగులబెట్టారు.

yco 17042018

తమ కార్యకర్తలను అరెస్టు చేయడంపై వైసీపీ శ్రేణులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. అరెస్ట్‌ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని వీరు డిమాండ్‌ చేశారు. ‘వ్యూహాత్మక విధ్వంసం’ సృష్టించేందుకే ఇలా చేశారని, సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారాలున్నాయని, ధర్నా విరమించకుంటే అందరిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో... వారంతా వెనక్కి తగ్గారు. తిరుపతిలో పనికట్టుకుని విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరిగిందని పోలీసు అధికారులు అమరావతిలో కేబినెట్‌ భేటీలో వెల్లడించారు. తునిలో రైలు నుంచి ఇప్పుడు మోటార్‌ సైకిల్‌ దహనం వరకూ అన్నీ వ్యూహాత్మకంగా జరిగినవేనని, ఉద్యమాల చాటున అశాంతి సృష్టించే ప్రయత్నం జరుగుతోందని సీఎం అన్నారు.

మీకు గుర్తుందా, రెండేళ్ళ క్రితం జగన్ పుట్టిన రోజు నాడు అసెంబ్లీ జరుగుతుంటే, చంద్రబాబు జగన్ సీట్ దగ్గరకు వెళ్లి మరీ, బర్త్ డే విషెస్ చెప్పారు... పోయిన ఏడు, ట్విట్టర్ లో జగన్ కు విషెస్ చెప్పారు... ఇది చంద్రబాబు సంస్కారం... అయితే, ఏప్రిల్ 20 వ తారీఖున చంద్రబాబు పుట్టిన రోజు... అదే రోజు ఆయిన, కేంద్రం పై వ్యతిరేకంగా దీక్ష కూడా చేస్తున్నారు... సరిగ్గా ఇదే అవకాశాన్ని జగన్, వేరే విధంగా వాడుకుంటున్నారు... చంద్రబాబు పై బురదజల్లేందుకు, నీఛమైన పనికి పూనుకున్నారు.. చంద్రబాబు పుట్టిన రోజునే వేదికగా చేసుకుని, చంద్రబాబుని దిగాజర్చే ప్రయత్నం చేస్తున్నారు... దీని కోసం, ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా సిద్ధం చేసారు... వారికి బాగా అలవాటు అయిన ఫేక్ పనులు చేసే బ్యాచ్ లను రంగంలోకి దించారు...

jagan 17042018

చంద్రబాబు పుట్టిన రోజు నాడు, అందరూ ఆయనకు విషెస్ చెప్తారు... ఈ సారి జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబుకి ఎక్కువ మంది విషెస్ చెప్పే అవకాసం ఉంది... అందుకే, ఆ పరిణామాన్ని ఎదుర్కోవటానికి, చంద్రబాబు పై విషం చిమ్మే ప్లాన్ వేసారు... #HappyBirthday420 అనే హ్యాష్ ట్యాగ్ తో, చంద్రబాబు పుట్టిన రోజు పై విషం చిమ్మే ప్లాన్ వేసారు... ఇప్పటికే దీనికి సంబంధించి, అందరికీ ఒక మెసేజ్ పంపిస్తున్నారు... దీని కోసం, పవన్ ఫాన్స్, బీజేపీ అభిమానులు హెల్ప్ కూడా తీసుకోవాలని నిర్ణయించి, వారిని కూడా కలుపుకు వెళ్తున్నారు... దీని కోసం, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ ఇప్పటికే వీడియోలు, ఇమేజ్ లు ప్రిపేర్ చేస్తున్నాయి... ఇవన్నీ ఉపయోగించి, పెద్ద స్థాయిలో, సోషల్ మీడియాలో చంద్రబాబు పై , ఆయన పుట్టిన రోజు నాడే, దిగాజార్చే, నీఛమైన ప్లాన్ వేసారు... ఆ మెసేజ్ కింద చూడవచ్చు....

jagan 17042018

Hey guys, need some help from all the folks on field. As you are all aware that in four days i.e., on 4/20/2018 Chandrababu is celebrating his birthday. So, we’re planning to flood the social media with loads of testimonials wishing him. We’d need crowd sourced testimonials, AS MANY AS POSSIBLE, with just one line ‘Happy Birthday 420’. We can create beautiful music montages with these, or many random cuts. You may also encourage men and women on field to make a small selfie video and upload to their personal profile. Please please, let’s make this heard. Many thanks for your cooperation! #HappyBirthday420

Advertisements

Latest Articles

Most Read