బీఎస్పీ చీఫ్ మాయావతి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు... నిన్న అమిత్ షా మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలని జంతువలతో పోల్చటం పై మాయావతి తప్పుబట్టారు... తెలుగుదేశం పార్టీ లాంటి మిత్ర పక్షం కొట్టిన దెబ్బకు, అమిత్ షా ఏవోవో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు... టీడీపీ సహా మిత్రపక్షాలన్నీ దూరం కావడంతో బీజేపీ నేతలు ఇప్పుడు ఏకాకిలా మారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు... బీజేపీ వ్యవస్థాపక దినం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ... మోదీ హవాకు ఎదురొడ్డేందుకు పాములు, ముంగిసలు, పిల్లులు, కుక్కలు జతకట్టాయంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ చీఫ్‌కు మాయావతి లేఖ రాశారు.

mayavati 07042018

మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతిపక్షాలపై నోరుపారేసుకుని భారీ మూల్యం చెల్లించుకున్నారని, బీజేపీకి గుణపాఠం చెప్పడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచడం లేదని, దీని కారణంగానే అవమానకర భాషతో దూషణకు దిగుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన శిష్యుడు అమిత్ షా నాయకత్వంలో ఆ పార్టీ విలువలు ఎంత దిగజారాయో తాజా వ్యాఖ్యలు రుజువుచేస్తున్నాయని బీఎస్పీ అధినేత తన లేఖలో పేర్కొన్నారు.

mayavati 07042018

‘‘బీజేపీ చెప్పిన నవ భారతం ఇలాగే ఉంటుందా? అసహ్యమైన మాటలు, చులకన చేసే వ్యాఖ్యలతో దేశాన్ని నిర్మిస్తారా? భారత అధికార పార్టీకి ఇది తగునా?’’ అని మాయవతి సూటిగా ప్రశ్నించారు. అతివిశ్వాసం, అహంకారం కారణంగా ఆ పార్టీకి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయనీ... దీంతో ఇప్పుడు బీజేపీ ఏకాకిగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చకపోవడం వల్ల... ఎప్పటినుంచో మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సైతం బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టిందన్నారు.

ప్రధాని మోడీ పై, విపక్ష పార్టీల ఎంపీలకే కాదు, సొంత పార్టీ ఎంపీలకు కూడా నమ్మకం పోతుంది... ఇప్పటికే బీజేపీలో మోడీ వ్యతిరేక వర్గం, టైం కోసం చూస్తుంది అని వార్తలు వస్తున్నాయి... అద్వానీకి జరిగిన అవమానానికి బదులు తీర్చుకోటానికి ఇప్పటికే కొంత ఎంపీలు రెడీగా ఉన్నారు.. అందుకే మోడీ, అవిశ్వాసం ఎదుర్కోకుండా పారిపోయారు అనే వార్తలు వస్తున్నాయి... మురళీ మనోహర్ జోషి, శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హా, బహిరంగంగానే మోడీ పై విమర్శలు చేస్తున్నారు... మొన్న ఒక దళిత ఎంపీ కూడా ప్రధాని పై లేఖ రాస్తూ విమర్శలు గుప్పించారు... తాజాగా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో దళిత ఎంపీ యశ్వంత్ సింగ్ ఊహించని షాక్ ఇచ్చారు.

modi 07042018 3

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో దళితుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపిందంటూ నిలదీశారు. నాగిన నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్న యశ్వంత్.. కేవలం రిజర్వేషన్ కారణంగానే తాను ఎంపీనయ్యానన్నారు. ‘‘ఒక దళితుడిగా నా సామర్ధ్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోవడం లేదు. నేను కేవలం రిజర్వేషన్ కారణంగానే పార్లమెంటు సభ్యుడిని కాగలిగాను. దేశంలోని 30 కోట్ల మంది దళితులకు గత నాలుగేళ్లలో కేంద్రప్రభుత్వం చేసింది శూన్యం...’’ అంటూ తన లేఖలో ధ్వజమెత్తారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు.

modi 07042018 3

కాగా ఇటీవల యూపీలోని రాబర్ట్స్‌గంజ్ ఎంపీ ఛోటే లాల్ ఖార్వార్ కూడా ప్రధాని మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం యోగి ఆదిత్యనాథ్ వద్దకు సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే తనను బలవంతంగా గెంటేశారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. చాందౌలీలోని అటవీ అధికారులు, జిల్లా అధికారులు ‘‘అవినీతి’’ పాల్పడుతున్న విషయాన్ని రెండుసార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోకుండా... తన పట్ల దారుణంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. దళిత ఎంపీ అయిన ఛోటేలాల్... ఇదే అంశంపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పాలన చెయ్యటం చేతకాదు అంటూ, ఎర్రచందనం స్మగ్గ్లింగ్ అరికట్టటంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారు అంటూ, పవన్ చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే... అదేమంటే, ఎవరో మాట్లడారు అందుకే నేను ఆరోపణలు చేసాను అని చెప్తున్నాడు పవన్... అయితే, పవన్ చేసిన ఆరోపణలకు, చెంపపెట్టు నిన్న లోక్‌సభలో అటవీశాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానం... రాష్ట్రంలో చంద్రబాబు వచ్చిన తరువాత ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఎలా అరికట్టింది అందరూ చూసారు.. కాని పవన్ మాత్రం, ఎందుకు, ఏమి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతూ, ప్రజలని పిచ్చోళ్ళను చేస్తున్నాడు..

pk 06042018 2

అయితే, ఇలాంటి గాల్లో మాటలు మాట్లాడేవారికి, సమాధానమా అన్నట్టు, లోక్‌సభలో అటవీశాఖ సహాయ మంత్రి సమాధానం ఇచ్చారు... ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసుల్లో 8,674 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి మహేష్‌శర్మ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో రాష్ట్ర ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, కొత్తపల్లి గీతలు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ అంశంపై మూడేళ్లలో 2,540 కేసులు నమోదయ్యాయని, 1,203.62 మె.టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 1,865 వాహనాలను కూడా సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. సరకు విలువ రూ.47.53 కోట్లు ఉంటుందన్నారు.

pk 06042018 3

ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న అన్ని వాహనాలను ఏపీ అటవీ చట్టం-1967లోని నిబంధనల ప్రకారం స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు. 2015-16లో 753 కేసులు నమోదు కాగా, 2,587 మందిని అరెస్ట్ చేసారు... అలాగే 480 వాహనాలు సీజ్ చేసారు.. 355.658 మె.టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2016-17లో 911 కేసులు నమోదు కాగా, 3,344 మందిని అరెస్ట్ చేసారు... అలాగే 705 వాహనాలు సీజ్ చేసారు.. 487.632 మె.టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2017-18లో 876 కేసులు నమోదు కాగా, 2,743 మందిని అరెస్ట్ చేసారు... అలాగే 680 వాహనాలు సీజ్ చేసారు.. 360.338 మె.టన్నుల సరుకు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు... ఈ సమాధానం చుసైనా చెప్పండి పవన్ గారు...

ఈ రోజు ఉదయం ఢిల్లీలో ఉన్న ఎంపీలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. ఎంపీలు ఎవరూ ఇప్పుడే రాష్ట్రానికి రావద్దు అని, మరి కొన్ని రోజులు దిల్లీలోనే ఉండాలని ఆదేశించారు... తదుపరి కార్యాచరణను మధ్యాహ్నం తర్వాత ఖరారు చేయనున్నట్లు చెప్పారు... ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డప్పటికీ ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉండాలని చంద్రబాబు ఆదేశించటం పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.. ఏమన్నా నిరసనలు కోసమే అక్కడ ఉండమని చెప్పరా ? లేక ఢిల్లీలో ప్రచారం జరుగుతున్నట్టు, అన్ని విపక్ష పార్టీలు ఏమన్నా ప్లాన్ చేస్తున్నాయా అనేది తెలియాల్సి ఉంది...

tdp mps 07042018

మరో పక్క, రాష్ట్రపతిని కలిసి, జరుగుతున్న పరిణామాలు వివరించాలి అని ప్రయత్నిస్తున్నా, ఆయన అప్పాయింట్మెంట్ దొరకటం లేదని తెలుస్తుంది... రాష్ట్రపతి అప్పాయింట్మెంట్ కోసం కూడా, తెలుగుదేశం ఎంపీలు ప్రయత్నిస్తున్నారు.. కేంద్రంపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాసంపై ఎటువంటి చర్చ లేకుండా పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిన్న టీడీపీ ఎంపీలు పార్లమెంటు నుంచి బయటకు రాకుండా లోపలే ఉండి ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉండగా ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉండాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు...

tdp mps 07042018

మరో పక్క, అమరావతిలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరగనుంది... ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు శనివారం మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే వివిధ పార్టీలు, ప్రజాసంఘాలతో మార్చి 27వ తేదీన ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అధికార టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఆమ్‌ఆద్మీ పార్టీలతో పాటు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సారి వామపక్షాలు కూడా అఖిలపక్షానికి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. సమావేశానికి రావాలని సీఎంవో పార్టీలను ఆహ్వానించగా... తమ పార్టీ రావడం లేదని బీజేపీనేత విష్ణుకుమార్‌ రాజు చెప్పారు. వైసీపీ కూడా హాజరు కావడం లేదని ఆ పార్టీ అధినేత జగన్‌ ప్రకటించారు. ఇక జనసేన అధినేత పవన్‌దీ అదే దారి. తాము భేటీకి రావడం లేదని లెఫ్ట్‌ నేతలు సీఎంకు లేఖ రాశారు.

Advertisements

Latest Articles

Most Read