బీజేపీ అనుకూల ఛానల్ గా పేరు ఉన్న రిపబ్లిక్ టీవీ, దేశ రాజకీయలను ప్రభావితం చేసే ఒక సంచలన కధనం ప్రసారం చేసింది.. అయితే, ఇది కావాలని మోడీ పై సానుభూతి కోసం చేసిందా అనే అనుమానం కూడా కలుగుతుంది... ఎందుకంటే, రెండు రోజుల క్రిందట ఇదే రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూ లో, మా పార్టీ పుట్టుకే కాంగ్రెస్ కు వ్యతిరేకం అని చంద్రబాబు చెప్పినా, రిపబ్లిక్ టీవీ మాత్రం, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌, టీడీపీ నేత చంద్రబాబు, ఎన్సీపీ సారథి శరద్‌పవార్‌ కలిసి, మోడీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఒక కధనం ప్రసారం చేసింది.. అందులో భాగంగా, మోడీ వివిధ రాష్ట్రాలకి చేస్తున్న అన్యాయం పై, పలు పార్టీలకు చెందిన 100 మంది ఎంపీలు రాజీనామా చేస్తున్నారు అంటూ ఆ కధనం సారంశం...

modi 07042018 1

విశ్వసనీయ వర్గాల సమాచారం అంటు ఆ చానల్‌ ఈ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ ప్రణాళికకు కాంగ్రెస్‌, ఎన్సీపీ, టీడీపీ సహా పలు పార్టీలు రూపకర్తలుగా వ్యవహరించినట్లు అందులో పేర్కొంది. వంద మంది ఎంపీలతో రాజీనామాలు చేయించి ముందస్తు ఎన్నికలు పెట్టే పరిస్థితి తేవడం ద్వారా.. ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాల్లో మోదీ సర్కారుపై ఇప్పటికే కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తులను సొమ్ము చేసుకోవడమే విపక్షాల టార్గెట్‌ అని రిపబ్లిక్‌ చానల్‌ విశ్లేషించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన రెండు రోజుల హై-ప్రొఫైల్‌ ఢిల్లీ పర్యటనలో వివిధ పార్టీలతో సంప్రదింపులు జరిపిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

modi 07042018 1

అయితే ఈ కధనంలో వాస్తవం ఎంత వరకు ఉంది అనే ప్రశ్నలు వస్తున్నాయి... ఈ కధనం కేవలం మోడీకి దేశ వ్యాప్తంగా సానుభూతి కోసం ప్రసారం చేసింది అనే వాదనలు కూడా ఉన్నాయి... మోడీ ఒక్కరే దేశం కోసం పని చేస్తుంటే, మోడీని పడగొట్టటానికి విపక్షాలు అన్నీ కలిసి వస్తున్నాయి అనే ప్రచారం చేస్తున్నారు... దీనికి ఊతంగా నిన్న ప్రధాని మోడీ విడుదల చేసిన వీడియో సందేశం కూడా, అదే చెప్తుంది... నిన్న వీడియో మెసేజ్ లో మోడీ మాట్లాడుతూ, ఒక పేద తల్లి కొడుకు ప్రధాని అయితే, వీళ్ళు నన్ను పడగొట్టాలని చేస్తున్నారు అంటూ, మళ్ళీ సెంటిమెంట్ డ్రామా మొదలు పెట్టారు... ఇవన్నీ చూస్తుంటే, మళ్ళీ ఎదో ఎమోషన్ డ్రామా మొదలు పెట్టే పనిలో బీజేపీ ఉందని అర్ధమవుతుంది... హామీలు నెరవేర్చండి అంటే, పేద తల్లి కొడుకు అయితే ఏంటి, ధనిక తల్లి కొడుకు అయితే ఏంటి.. మా హామీలు నెరవేర్చండి ప్రధాని గారు...

సామాన్యంగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కాగ్ రిపోర్ట్ వస్తుంది అంటే, ప్రతిపక్షాలకి పండగే... ప్రభుత్వం పై వారు చేసే ఆరోపణలకి, కాగ్ రిపోర్ట్ తోడైతే, ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడుకుంటారు... పోయిన వారం తెలంగాణ కాగ్ రిపోర్ట్ చూసాం... అవినీతి జరుగుతుంది అని, నిధులు దుర్వినియోగం అని, తెలంగాణా ప్రభుత్వాన్ని ఏకి పడేసింది కాగ్... అయితే, మన రాష్ట్ర కాగ్ రిపోర్ట్ కూడా త్వరలో వస్తుంది, చంద్రబాబుని ఒక ఆట ఆడుకోవచ్చు అని జగన్, పవన్, బీజేపీ కాచుకుని కూర్చున్నారు... కాని వారి ఆశల పై కాగ్ నీళ్ళు చల్లింది... కొన్ని సహజమైన కామెంట్స్ మినిహా, అవినీతి పై కాని, నిధుల దుర్వినియోగం పై కాని ఒక్కటంటే ఒక్క మాట కూడా రిపోర్ట్ లో లేదు...

cag 07042018 1

ఈ రిపోర్ట్ తో మరో సారి చంద్రబాబు ఎంత పారదర్సాకంగా పని చేస్తున్నారో అర్ధమవుతుంది... రియల్ టైం గవర్నెన్స్ ద్వారా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు... ఈ రిపోర్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరికి, మరో దెబ్బ కూడా వేసింది కాగ్.. ఆంధ్రప్రదేశ్‌కు సాయం విషయంలో కేంద్రం చెబుతోంది అబద్ధాలేనని కాగ్‌ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు పూర్తిస్థాయిలో రావడం లేదని తన నివేదికలో పేర్కొంది... మరి ఈ రిపోర్ట్ పట్టుకుని, కేంద్రాన్ని నిలదేసే దమ్ము పవన్, జగన్ కు ఉందా ? ఇంతకీ కాగ్, కేంద్ర సాయం పై ఏమి చెప్పిందో చూడండి..

cag 07042018 1

2016-17లో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.26,264 కోట్లు వచ్చాయి. బడ్జెట్‌ అంచనాల కంటే ఇవి రూ.1,627 కోట్లు తక్కువ. ఫలితంగా రాష్ట్రం తన అవసరాల కోసం రుణాలపై ఆధారపడుతోందని.. ఇటువంటి ధోరణి వల్ల కొంత కాలానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్రమేణా బలహీనమయ్యే ప్రమాదం ఉందని కాగ్‌ హెచ్చరించింది. రాష్ట్ర విభజన తర్వాత పట్టణ స్థానిక సంస్థలకు 13వ ఆర్థిక సంఘం గ్రాంట్లలో 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు రూ.818.36 కోట్లను కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. సదరు గ్రాంట్లు కేంద్రం నుంచి వస్తాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం నిధులను పట్టణ, స్థానిక సంస్థలకు ముందుగానే విడుదల చేసింది. అయితే, కేంద్ర సర్కారు నుంచి ఆశించిన దానికంటే రూ.185.21 కోట్ల మేర నిధులు తక్కువ విడుదలయ్యాయి. 14వ ఆర్థిక సంఘం కేటాయింపుల ప్రకారం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 2016-17లో రూ.2,089.18 కోట్ల నిధులు రావాలి. కానీ రూ.2065.53 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా రూ.23.65 కోట్లు రావాల్సి ఉంది. ఇలా నిధుల్లో కేంద్రం కోత విధించడంవల్ల ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై పడుతోందని కాగ్‌ పేర్కొంది.

వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్న చిత్తూరు పశ్చిమ ప్రాంతాన్ని కొద్ది రోజుల్లో కృష్ణమ్మ పలకరించనుంది. ప్రాజెక్టు భూసేకరణ నుంచి టన్నెల్‌ తవ్వకాల వరకు అడ్డంకులు అధిగమించి.. చిత్తూరు జిల్లాకు బిరబిరా పరుగులిడేందుకు సిద్ధమైంది. న్యాయస్థానంలో ఉన్న చిక్కుల కారణంగా నిలిచిపోయిన పనులు పూర్తికావొచ్చాయి. హంద్రీ నీవా నీటిని జిల్లాకు తీసుకొచ్చేందుకు ఉన్న అవరోధాలు తొలగిపోయాయి. పుటపర్తి, మదనపల్లెలోనూ పనులు పూర్తికానున్నాయి. పుంగనూరు బ్రాంచి కెనాల్‌ ద్వారా పలమనేరు వరకు నీటిని ప్రధాన కాలువల్లో తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

chittor 06042018

అనంతపురం జిల్లా నుంచి చిత్తూరుకు నీరు చేరుకోవాలంటే మరో 12 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ స్వయంగా ప్రకటించారు. సమస్యలన్నింటినీ అధిగమించి ట్రయన్‌ రన్‌ ద్వారా జిల్లాకు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటికే లేపాక్షి ప్రాంతానికి హంద్రీనీవా నీరు చేరుకుంది. పుటపర్తికి మరో రెండు రోజుల్లో నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్కడి నుంచి చిత్తూరు జిల్లాకు సుమారు 150 కి.మీల పొడవున కాలువ ఉంది. అక్కడికి నీరు చేరుకునేందుకు మరో 12 రోజుల సమయం పడుతుంది. నీరొచ్చేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

chittor 06042018

అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలో 16 పంపింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే వీటి పనితీరును అధికారులు పరిశీలించి ఎక్కడా సమస్యలు లేవని గుర్తించడంతో పలమనేరు వరకు నీరు విడుదలకు మార్గం సుగమమైంది. చిత్తూరు జిల్లాకు నీరు రానుండటంతో అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు. డ్రోన్‌ ద్వారా సర్వే చేపట్టారు. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనే అంశాన్ని గుర్తించి వెంటనే పనులు పూర్తి చేస్తున్నారు. మొత్తంగా చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి సాగు, తాగునీటి సమస్యలు తొలగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఆశించింది దక్కనప్పుడు..... ఆడపిల్లల మీద ఆసిడ్ దాడి చెయ్యటం.... కత్తులు పెట్టి పొడవటం... తల్లితండ్రులని కొట్టటం.... స్నేహితుల మీద దాడులు చెయ్యటం..... పెద్దా చిన్నా లేకుండా నోటికొచ్చినట్టు వాగడం... ఇవన్నీ సైకో లక్షణాలు.... రాజుల్ని చంపి రాజ్యాలు ఆక్రమించుకోవటానికి మనమింకా రాచరికంలో లేము...ఎవరైనా ప్రత్యర్ధులను ఓడించమని పిలుపు ఇస్తారు, కేవలం వ్యక్తిగత పగ, ద్వేషం ఉన్నవారే ప్రత్యర్ధులను చంపమంటారు. ఎంత క్రూరమైన మనస్తత్వం ఉంటే ఇలాంటి మాటలు వస్తాయి ?? మనది ప్రజాస్వామ్యం , ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికలు యుద్దంలా జరగవచ్చు, కానీ అది సైద్దాంతికంగానే తప్ప ఒకరినొకరు చంపుకోవటానికి కాదు, ప్రత్యర్ధిని చంపమని బహిరంగంగా పిలుపు ఇచ్చేవారిది ఎలాంటి మనస్తత్వం అయ్యుండాలి ??

jagan 06042018 4

ఇది కేవలం ఫాక్షన్ మనస్తత్వాలు, మనిషి ప్రాణమంటే లెక్కలేని రాక్షస మనస్తత్వాలకు మాత్రమే సాధ్యం, మాములు రాజకీయనాయకుల వల్ల కాని పని. ఇలాంటి దుర్మార్గులు మన పాలకులు అయితే ప్రజల పరిస్థితి ఏంటి ?? అలాంటి వాడే మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు... జగన్ మోహన్ రెడ్డి మరో సారి, తన ఫాక్షన్ మెంటాలిటీ బయట పెట్టాడు... కాల్చి పారేస్తా... నరుకుతా.. ఉరి వేస్తా... అంటూ చంద్రబాబు పై వ్యాఖ్యలు చేసిన జగన్, ఈ రోజు చంద్రబాబు ఏదన్నా బావిలో దూకి చస్తే, రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది అంటూ, వ్యాఖ్యలు చేసి, మరోసారి తాను ఎంతటి రక్త పిపాసిని అనేది నిరుపించుకున్నాడు...

jagan 06042018 4

తన ఫాక్షన్ మెంటాలిటీతో, తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని మంగళి కృష్ణా, సూరి, భాను లాంటి వారి చేత, ఎలాంటి మారణ హోమం చేపించాడో చూసాం.. ఇలాంటి రక్త పిపాసి, ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోవాలి అంటూ వ్యాఖ్యలు చేసి, తన అసలు నైజం, రంగు బయట పెట్టాడు... ప్రజల అభిమానం పొంది, ఎన్నికల్లో గెలవాలి అనుకోవాలి కాని, ఒక మనిషి చచ్చిపోతే కాని, తాను ముఖ్యమంత్రి అవ్వలేను అని, అనుకుంటున్నాడు... అందుకే, ఇలాంటి సైకో మాటలు... హోదా ఇవ్వాల్సిన ప్రధాని మోడీ అనే పేరు కూడా తలవకుండా, పోరాడుతున్న చంద్రబాబుని చచ్చిపోవాలి అంటున్న ఈ సైకో గురించి ప్రజలే తెలుసుకోవాలి...

Advertisements

Latest Articles

Most Read