అమరావతి పై విషం చిమ్మటానికి,హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక బ్యాచ్, రెడీ అయ్యింది... ఐవైఆర్ కృష్ణారావు అనే మహానుభావుడు, "ఎవరి రాజధాని అమరావతి ?" అనే పుస్తకం రాస్తే, ఈ పుస్తకాన్ని, పవన్ కళ్యాణ్ ఆవిష్కరిస్తారు... పవన్ కళ్యాణ్ ఒక్కరే ఆనుకునేరు... ఇంకా ఈ పుస్తకం ఆవిష్కరణకు, ఎవరు వస్తున్నారో తెలుసా ? బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు... ఉండవల్లి అరుణ్ కుమార్... సిపియం నేత మధు... సిపిఐ నేత రామకృష్ణ... చివరకు, ఈ పుస్తకం వడ్డే శోభనాద్రీస్వర రావుకు, అంకితం చేస్తారు అంట... 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల నోట్లో మట్టి కొట్టటానికి, ఈ బ్యాచ్ ఇక్కడ దిగబడింది...

iyr 05042018 1

అయితే, వీరికి వ్యతిరేకంగా, వీరు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టటానికి రాజధాని రైతులు కూడా రెడీ అయ్యారు... ఇదే సమయంలో, "ప్రజా రాజాధాని పై కుట్ర" అనే పుస్తక ఆవిష్కరణ చెయ్యనున్నారు.... జగన్, పవన్, ఐవైఆర్, ఉండవల్లి లాంటి రాష్ట్ర ద్రోహులు, అమరావతి పై ఎన్ని కుట్రలు పన్నారు, ఎన్ని ఈ మెయిల్స్ పంపించారు, ప్రపంచ బ్యాంకుకు లోన్ ఇవ్వద్దు అని ఎలా రాసింది, కులాల మధ్య ఎలా చిచ్చు పెడుతుంది, అన్నీ వివరిస్తూ ఈ పుస్తకం రాసారు... అమరావతి మా ప్రజా రాజధాని, మీ హైదరాబాద్ బ్యాచ్ కు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు రైతులు... దయ చేసి, మా నోట్లో మట్టి కొట్టొద్దు అని చెప్పనున్నారు...

iyr 05042018 1

అమరావతి నిర్మాణం కోసం, చంద్రబాబు ఒక అడుగు వేస్తుంటే, ఈ బ్యాచ్ వంద అడుగులు వెనక్కు ఎలా లాగుతుందో గమనిస్తున్నాం ... అమరావతి పై విషం చిమ్మే జాబితాలో తాజగా పవన్ కళ్యాణ్ చేరిన విషయం కూడా గమనిస్తున్నాం... పదే పదే, ఇది కొంత మందికి మాత్రమే రాజధాని అంటూ, ప్రజల్లో లేని పోనీ అపోహాలు సృస్తున్నారు... అక్కడ ఉన్న 29 గ్రామాల ప్రజలకే, తిరిగి భూమిని ఇస్తారు, 29 గ్రామాల్లో ఒక వర్గమే ఉంటుంది అని పవన్ ఎందుకు అనుకుంటున్నారో, దాని వెనుక ఉన్న అజెండా ఏంటో ఆయనకే తెలియాలి... ఈయనకి తోడు, ఇంకా కొంత మంది తయారయ్యారు... దరిద్రం ఏంటి అంటే, ఈ బ్యాచ్ అంతా హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలో రెచ్చిపోతుంది...

ఈ రోజు కూడా, పార్లమెంట్, రాజ్యసభలో అదే సీన్ రిపీట్ అయ్యింది... రేపటితో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి.. అయితే దేశంలోని అన్ని విపక్ష పార్టీలు, కేంద్రం పై నిరసనల హోరు పెంచాయి... అయినా కేంద్రం ఏ మాత్రం దిగి రావటం లేదు... ఈ రోజు కూడా అవిశ్వాసం పై చర్చ లేకుండా, సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోయారు... రాజ్యసభలో కూడా సభ వాయిదా పడింది.. అయితే, ఇక్కడ మాత్రం , వాయిదా పడినా టీడీపీ ఎంపీలు సభలోనే కూర్చుని విభజన హామీలు నెరవేర్చాలని ఫ్లకార్డులతో నినాదాలు చేశారు... సభ జరగాలని, విభజన హామీల పై చర్చ చేపట్టాలని, ఇలా వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం ఏంటి అని, టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు...

tdp 05042018 2

తెదేపా సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్రకుమార్‌, సీతారామలక్ష్మిని సభ నుంచి బయటకు రావని, చర్చ చేపట్టే వరకు ఇక్కడే ఉంటామని, ఆందోళన కొనసాగిస్తున్నారు... అయితే వారిని బయటకు రమ్మని ఎంత చెప్పినా వినకపోవటంతో, రాజ్యసభ సిబ్బంది, మార్షల్స్‌ రంగంలోకి దిగారు... దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి... ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చేది లేదని తెదేపా ఎంపీలు స్పష్టం చేయడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది... అయితే, మరి కాసపెట్లో, వారిని బలవంతంగా, బయటకు తీసుకువస్తారా, లేక కేంద్ర ప్రభుత్వం ఏమన్నా చర్చలకు వస్తుందా అనేది చూడాలి...

tdp 05042018 3

మరో పక్క, రాజ్యసభ ఎంపీలకు సంఘీభావంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో టీడీపీ లోక్ సభ సభ్యులు కూడా ధర్నా చేపట్టనున్నారని సమాచారం... పార్లమెంట్ సమావేశాలకు మరో రోజు మాత్రమే మిగిలి ఉంది. అవిశ్వాసంపై చర్చ రాకుండానే లోక్‌సభ వాయిదాలు పడుతూ వచ్చింది. శుక్రవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, చర్చ జరగకపోవచ్చునని ఢిల్లీలో టాక్ నడుస్తుంది.. 21 రోజులగా ఉభయ సభలు, కనీసం రోజుకి ఒక 15 నిమషాలు కూడా జరగలేదు... అవిశ్వాసం పెట్టినా, ఎదుర్కునే దమ్ము లేక, మోడీ ప్రభుత్వం పారిపోతుంది...

కేంద్రం పార్లమెంట్ లో అనుసరిస్తున్న విధానం పై, దేశంలోని అన్ని విపక్షాలు ఏకం అయ్యాయి... అవిశ్వాసం పై చర్చ జరపకుండా, కేంద్రం గత నెల రోజులుగా ఎలా పారిపోతుందో చూస్తున్నాం... ఇలా సభ మొదలు అవ్వటం, ఒక్క నిమషం కూడా జరగకుండా వాయిదా పడటం, మళ్ళీ 12 గంటలకు ఇదే తీరు... ఒకే ఒక పార్టీ అడ్డు వస్తుంది అంటూ, నెల రోజులుగా పార్లమెంట్ వాయిదా వేస్తున్నారు... వారిని సుస్పండ్ చేసి, అవిశ్వాసం పై చర్చ చేపట్టండి అంటే మాత్రం, అది చెయ్యటం లేదు... ఎందుకంటే, బీజేపీ నే వారి చేత, ఆడిస్తుంది కాబట్టి... ఇలా ప్రతి రోజు జరుగుతుంది... ఇంకా రెండు రోజులే సమయం ఉంది...

manvaharam 05042018 2

దీంతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, పార్లమెంట్ ప్రాంగణంలో దేశంలోని అన్ని విపక్ష పార్టీల ఎంపీలు నిరసనగా మానవహారం నిర్వహించారు... రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం వరకు మానవహారం నిర్వహించారు .. కేంద్ర ప్రభుత్వం పనితీరుకు నిరసనగా మానవహారం కార్యక్రమం చేపట్టారు.. అయితే, ఈ మానవ హారంలో మన రాష్ట్రానికి చెందిన వైసీపీ పార్టీ మాత్రం ఇందులో పాల్గున లేదు... మరో పార్టీ అన్నాడీఎంకే కూడా రాలేదు... అన్నాడీఎంకే, వైసీపీ మినహా విపక్షాల అన్నీ ఈ మానవహారంలో పాల్గున్నాయి...

manvaharam 05042018 3

అంటే, ఈ రెండు పార్టీలు బీజేపీ తో కలిసి పోయాయి అనే దానికి, మరో ప్రత్యేక్ష ఉదాహరణ... అన్ని పార్టీలు ఏకం అయ్యి, దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు పాల్గున్న నిరసనలో, వైసీపీ పార్టీ ఎందుకు పాల్గునలేదు అంటే, ఇక్కడే వారు ఎలా సరెండర్ అయ్యారో అర్ధమవుతుంది... మోడీ మీద అవిశ్వాసం అంటూ, మోడీ ఆఫీస్ లోనే విజయసాయి రెడ్డి 24 గంటలు ఉంటున్నారు... మోడీని ఒక్క మాట కూడా అననివ్వటం లేదు... ఎమన్నా అంటే, నోటీసులు పంపిస్తున్నారు... ఇది వీరి తీరు... రాష్ట్రం మొత్తమే కాదు, దేశం మొత్తం మోడీ వైఖరి పై యుద్ధం చేస్తుంటే, వీరు మాత్రం భయపడుతూ తిరుగుతున్నారు...

ఇన్నాళ్ళు అయ్యా !బాబూ!అంటూ విభజన హామీలు నెరవేర్చమంటే, ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు లోకువగా కనిపించాడు.... లోక్‌సభ లో సరిపడా మెజారిటీ ఉండనే ధీమాతో, లోపలా, బయట మిత్రపక్షాలని హీనంగా చూసారు... పార్టీ సీనియర్లు తో సహా నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు ని ఘోరంగా అవమానించారు... అవహేళన చేసారు... ఇంకా చేస్తున్నారు... కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయి, తమకు తిరుగేలేదనుకుని విర్రవీగారు...ఎంతకు దిగజారారంటే, A1,,A2 జతకట్టి, ఇంకొక అజ్ఞానవాసితో రహస్య ఒప్పందం చేసుకుని... చంద్రబాబు ని తొక్కుదామనుకున్నారు... కేంద్రం లో తమ అధికారం శాశ్వతమనుకున్నారు...

cbn delhi 05042018

కాని ఇక్కడ బీజేపీ చెయ్యల్సింది, ఇలాంటి వారిని నామ్ముకోవటం కాదు, ఆంధ్రాకి న్యాయం చెయ్యటం... అలా చేస్తే, ఇటు ప్రజలు, ఇటు చంద్రబాబు, ఇద్దరూ బీజేపీతోనే ఉండేవారు... కాని జరగలేదు... చంద్రబాబు లాంటి వాడు అలిగితే, ఏమవుతుందో, నిన్న ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ ఒక ఉదాహరణ... ఢిల్లీకి వెళ్లి మరీ, నరేంద్ర మోడీ అంటే ఇది అని, దేశానికి తెలిసేలా చేసారు చంద్రబాబు... బీజేపీ నాయకులు చేస్తున్న ఫేక్ ప్రాపగాండా ఎండగట్టారు... మోడీతో సహా అందరు చెప్పివి పచ్చి అబద్ధాలు అని చెప్పారు... చెప్పటం మాత్రమే కాదు, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా, మోడీ చేసిన మోసాన్ని దేశం ముందు ఉంచారు...

cbn delhi 05042018

అయితే, ఇక్కడ నిన్న చంద్రబాబు మోడీని ప్రెస్ మీట్ పెట్టి ఉతికి పడేస్తే, వెరైటీగా వైసిపీ స్పందించింది... రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్దగా చంద్రబాబుకి కౌంటర్ ఇవ్వలేదు... నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ అయిన వెంటనే, అదేదో తమ పార్టీని, తమ నాయకుడిని అన్నట్టు, విజయసాయి రెడ్డి, ఇతర ఎంపీలు వెంటనే ప్రెస్ తో మాట్లాడి, చంద్రబాబు ఢిల్లీ వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అని, కేసులు మాఫీ కోసం వచ్చారని, ఇలా మాట్లాడుతూ, చంద్రబాబు ప్రెస్ మీట్ హైలైట్ అవ్వకుండా చేసే ప్రయత్నం చేసారు... ఇక సాక్షి మీడియా అయితే చెప్పే పనే లేదు.. అయినా కేసులు మాఫీ కోసం అయితే, మోడీని తిడతారా, పోగుడుతారా ? వీళ్ళకి చంద్రబాబు ప్రెస్ మీట్ విన్న తరువాత, ఉన్న కొంచెం మైండ్ కూడా పోయినట్టు ఉంది... అయితే, మోడీని చంద్రబాబు ఎదో అంటే, వైసిపీ నాయకులకి ఎందుకు నొప్పి ?

Advertisements

Latest Articles

Most Read