Sidebar

07
Wed, May

ఇన్నాళ్ళు అయ్యా !బాబూ!అంటూ విభజన హామీలు నెరవేర్చమంటే, ఢిల్లీ పెద్దలకు చంద్రబాబు లోకువగా కనిపించాడు.... లోక్‌సభ లో సరిపడా మెజారిటీ ఉండనే ధీమాతో, లోపలా, బయట మిత్రపక్షాలని హీనంగా చూసారు... పార్టీ సీనియర్లు తో సహా నమ్మకమైన మిత్రుడు చంద్రబాబు ని ఘోరంగా అవమానించారు... అవహేళన చేసారు... ఇంకా చేస్తున్నారు... కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోయి, తమకు తిరుగేలేదనుకుని విర్రవీగారు...ఎంతకు దిగజారారంటే, A1,,A2 జతకట్టి, ఇంకొక అజ్ఞానవాసితో రహస్య ఒప్పందం చేసుకుని... చంద్రబాబు ని తొక్కుదామనుకున్నారు... కేంద్రం లో తమ అధికారం శాశ్వతమనుకున్నారు...

cbn delhi 05042018

కాని ఇక్కడ బీజేపీ చెయ్యల్సింది, ఇలాంటి వారిని నామ్ముకోవటం కాదు, ఆంధ్రాకి న్యాయం చెయ్యటం... అలా చేస్తే, ఇటు ప్రజలు, ఇటు చంద్రబాబు, ఇద్దరూ బీజేపీతోనే ఉండేవారు... కాని జరగలేదు... చంద్రబాబు లాంటి వాడు అలిగితే, ఏమవుతుందో, నిన్న ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ ఒక ఉదాహరణ... ఢిల్లీకి వెళ్లి మరీ, నరేంద్ర మోడీ అంటే ఇది అని, దేశానికి తెలిసేలా చేసారు చంద్రబాబు... బీజేపీ నాయకులు చేస్తున్న ఫేక్ ప్రాపగాండా ఎండగట్టారు... మోడీతో సహా అందరు చెప్పివి పచ్చి అబద్ధాలు అని చెప్పారు... చెప్పటం మాత్రమే కాదు, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా, మోడీ చేసిన మోసాన్ని దేశం ముందు ఉంచారు...

cbn delhi 05042018

అయితే, ఇక్కడ నిన్న చంద్రబాబు మోడీని ప్రెస్ మీట్ పెట్టి ఉతికి పడేస్తే, వెరైటీగా వైసిపీ స్పందించింది... రాష్ట్ర బీజేపీ నాయకులు పెద్దగా చంద్రబాబుకి కౌంటర్ ఇవ్వలేదు... నిన్న చంద్రబాబు ప్రెస్ మీట్ అయిన వెంటనే, అదేదో తమ పార్టీని, తమ నాయకుడిని అన్నట్టు, విజయసాయి రెడ్డి, ఇతర ఎంపీలు వెంటనే ప్రెస్ తో మాట్లాడి, చంద్రబాబు ఢిల్లీ వచ్చి డ్రామాలు ఆడుతున్నారు అని, కేసులు మాఫీ కోసం వచ్చారని, ఇలా మాట్లాడుతూ, చంద్రబాబు ప్రెస్ మీట్ హైలైట్ అవ్వకుండా చేసే ప్రయత్నం చేసారు... ఇక సాక్షి మీడియా అయితే చెప్పే పనే లేదు.. అయినా కేసులు మాఫీ కోసం అయితే, మోడీని తిడతారా, పోగుడుతారా ? వీళ్ళకి చంద్రబాబు ప్రెస్ మీట్ విన్న తరువాత, ఉన్న కొంచెం మైండ్ కూడా పోయినట్టు ఉంది... అయితే, మోడీని చంద్రబాబు ఎదో అంటే, వైసిపీ నాయకులకి ఎందుకు నొప్పి ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read