నవ్యాంధ్రకు, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంటు వేదికగా, దేశంలోని అన్ని పార్టీలకు వినిపించారు... మంగళవారం పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో చంద్రబాబు ‘సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌’గా మారారు... బీజేపీ, కాంగ్రెస్ తప్ప, అన్ని పార్టీల నేతలు చంద్రబాబును వచ్చి కలిసారు... ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే, బీజేపీలోని కొంత మంది నేతలు కూడా వచ్చి కలిసారు... దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పాత్ర క్రమంగా క్షీణిస్తుండటం... ప్రధాని మోదీని ఎదుర్కోగల దీటైన నేత కనిపించకపోవడంతో తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబువైపు ప్రతిపక్షాలు చూస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి... కాని, చంద్రబాబు మాత్రం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం విషయంలో, అన్ని పార్టీలు సహకరించి, కేంద్రం పై ఒత్తిడి తేవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు...

modi 04042018 1

మోదీ సర్కార్‌పై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన బీజేపీయేతర పార్టీల ఫ్లోర్‌లీడర్లను పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. అలాగే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లను కోరారు. శరద్ పవార్, ఫరూక్‌ అబ్దుల్లా, సుప్రియా సూలే, జ్యోతిరాదిత్య సింధియా, జితేందర్‌రెడ్డి, వీరప్పమొయిలీ, రాజీవ్‌ సాతీవ్‌‌తో పాటు టీఎంసీ ఎంపీ సౌగత్‌ రాయ్‌, అన్నాడీఎంకే నేత వేణుగోపాల్‌ను చంద్రబాబు కలుసుకున్నారు. అయితే ఈ సందర్భంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది...

modi 04042018 1

చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో, అందరి నేతలతో కలుస్తున్న టైంలో, ప్రధాని మదో రాజ్యసభ లాబీ నుంచి బయటకు వచ్చి వెళ్తూ ఉండగా, సెంట్రల్ హాల్ మధ్యలో వివిధ పార్టీల నేతలతో చర్చిస్తున్న చంద్రబాబుని చూసారు... అయితే, ఒక్కసారి అలా చూసిన మోడీ, వెంటనే తల తిప్పుకుని, తన కార్యలయానికి వెళ్ళిపోయారు... ఇప్పటికే చంద్రబాబు, మోడీ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న తరుణంలో, ఈ పరిణామం చోటు చేసుకుంది... 29 సార్లు ఢిల్లీ వచ్చి, రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని ప్రధానిని కోరిన చంద్రబాబు, 30వ సారి మాత్రం, ప్రధాని మోడీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై పోరాడటానికి వచ్చారు...

నిన్న కొంత మంది బీజేపీ, వైసిపీ నాయకులు చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై మాట్లాడుతూ, చంద్రబాబు అందరి దగ్గరకు వెళ్లి అడుక్కుంటున్నాడు అని ఒకడు, ఫోటోలుకి ఫోజ్ లు ఇవ్వటం తప్ప, అక్కడ జరిగేది ఏమి ఉండదు అని మరొకరు, ఇలా హేళన చేస్తూ మాట్లాడారు... మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయం, జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు వివరిస్తుంటే, వీరు ఇలా మన తెలుగు నేతనే హేళన చేస్తూ, ఢిల్లీ నాయకులకు భజన చేస్తున్నారు... అయితే, అక్కడ జరిగింది మాత్రం అందరూ చూసారు... ఎంత మంది జాతీయ స్థాయి నేతలు, చంద్రబాబు వద్దకు వచ్చారో చూసాం... అయితే, చంద్రబాబును కలిసిన నేతలు అందరూ, మరోసారి ట్వీట్ ల రూపంలో మద్దతు తెలిపారు... ఇది కూడా చంద్రబాబు అడుక్కుని, ట్వీట్ లు పెట్టించుకున్నారు అని అన్నా అంటారు, మన ఢిల్లీ బానిసలైన బీజేపీ, వైసిపీ నాయకులు...

cbn tweets 04042018 2

Dr Shrikant Eknath Shinde, Member of Parliament, ShivSena... "It was immense pleasure to meet one of the visionary leadership of India, the Chief Minister of #AndhraPradesh Hon. Shri. Chandrababu Naidu ji. Discussion on various topics held in the meeting. @ncbn"........ DR V MAITREYAN, MP AIADMK... "met the Hon'ble Chief Minister of Andhra Pradesh Thiru Nara Chandrababu Naidu in the central hall of the parliament. I know him from the days when his mother in law and Mrs NTR, Smt. Basavarama Tharagam was treated in Cancer Institute in1984. I had signed her death certificate ."

cbn tweets 04042018 3

SathyaBama, Member: BOG, NIFT, tanding Committee: Water Resources... "Today Met Hon’ble AndhraPradesh Thiru N Chandrababu Naidu Ji in the Central Hall of the @Parliament House".... Arvind Sawant, Member of Parliament , South Mumbai. Shiv Sena Deputy Leader "तेलुगु देशम पार्टी (TDP) चे अध्यक्ष, आंध्रप्रदेशचे मुख्यमंत्री श्री. चंद्रबाबू नायडू यांची सेन्ट्रल हॉल, दिल्ली येथे भेट... Met Telugu Desam Party president, Andhra Pradesh CM Shri. N. Chandrababu Naidu ji at Central Hall, Delhi..."

ప్రధాని మోడీ గురించి ఎవరో విమర్శలు చెయ్యకూడదు అంట... ఎవరన్నా విమర్శలు చేస్తే, వారి అంతు చూస్తారు అంట... వాళ్ళు ఎవరైనా సరే, వారిని వదిలే ప్రసక్తే లేదంట... సామాన్య ప్రజలు అయినా సరే, మోడీకి జీ హుజూర్ అనాల్సిందే అంట... లేకపోతే అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు బీజేపీ గూండాలు... రెండు రోజుల క్రిందట, వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి.నరసింహారావు గారు, మోడీ పై ఒక విశ్లేషణ చేసారు... మోడీ ఎలాంటి వాడు, ఎలాంటి పనులు చేసి, ఇంత వరకు వచ్చాడు, మోడీ చేసిన ఫేక్ ప్రచారం, ఆయన ఎలా పెద్దలను అణగదొక్కి మరీ ఇక్కడ వరకు వచ్చింది ఇలా అన్ని విషయాల పై ఒక కధనం రాసారు...

bjp 03042018

అది, ఆంధ్రజ్యోతి పత్రిక, ABN ఛానల్ లో వచ్చింది.. అయితే, ఇది తట్టుకోలేని బీజేపీ వాళ్ళు రెచ్చిపోయారు... హైదరాబాద్ లోని, ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి చేసి, సర్వ నాశనం చేస్తామంటూ హంగామా చేసారు.. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రధాన కార్యాలయాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు.. రికేడ్లు ఏర్పాటు చేసి నిలువరించారు. బీజేపీ కార్యకర్తలు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోదీపై కథనాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్లను నెట్టుకుంటూ కార్యాలయం వైపు దూసుకొచ్చేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు.

bjp 03042018

దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు... ఇదే విషయం తెలుసుకున్న తెలంగాణా ప్రభుత్వం కూడా స్పందించింది.. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఆంధ్రజ్యోతి కార్యాలయం దగ్గర బీజేపీ ఆందోళన చేయడాన్ని ఖండించారు. ఇది ముమ్మాటికి మీడియా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ ఉందని, దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు... మరో పక్క సి.నరసింహారావు గారు రాసింది రాజకీయ విశ్లేషణ కాదుఅని, అది పక్కాగా మానసిక విశ్లేషణ అని, దీని కోసం ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారో అని, రాజకీయ పరిశీలకలు అంటున్నారు..

గత కొన్ని రోజులుగా, విజయసాయి రెడ్డి ఎలా రంకెలు వేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం.... మోడీ మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మోడీని వెనకేసుకుని వస్తూ, చివరకు మోడీని ఏమన్నా అంటే నోటీసులు కూడా ఇస్తున్నాడు... మొన్న చంద్రబాబు పై విమర్శలు చేస్తూ, విజయ్ మాల్యకు చంద్రబాబుకు లింక్ ఉంది అంటూ, ఒక స్టొరీ వినిపించాడు... విజయ్ మాల్యని, చంద్రబాబు లండన్ లో కలిసారని, అక్కడ నుంచి 150 కోట్లు పార్టీ ఫండ్ తెచ్చుకున్నారు అని, ఎదో హరికధ అల్లాడు... ఈ విషయం అన్ని చానల్స్ లో రావటంతో, ప్రజల్లో కూడా చర్చనీయంసం అయ్యింది...

malya 03042018

ఇవి ఎంత పనికిమాలిన ఆరోపణలు అనేది, చిన్న పిల్లాడు కూడా చెప్తాడు... అయితే, సహజంగా ఇలాంటివి ప్రోత్సహించే జగన్, విజయ్ మాల్య విషయంలో మాత్రం, వెంటనే స్పందించారు... ఈ విషయం పెద్దది అవ్వక ముందే, జగన్ అలెర్ట్ అయ్యారు... విజయసాయి రెడ్డికి ఫోన్ చేసి, ఇంకోసారి విజయ్ మాల్య పేరు ఎత్తద్దు అంటూ ఆదేశాలు ఇచ్చారు... అంతే కాదు, పార్టీ నేతలకు, సాక్షి టీంకు కూడా, ఇక ఎవరూ విజయ్ మాల్య గురించి ప్రస్తావన చెయ్యవద్దు అంటూ, ఆదేశాలు ఇచ్చారు..

malya 03042018

అయితే, పార్టీ నేతలు ఈ ఆదేశాల విని షాక్ తిన్నారు.. విజయ్ మాల్యని ఇందులోకి లాగుతుంటే, జగన్ ఎందుకు వద్దు అంటున్నారో అంటూ గుసగుసలాడుతున్నారు... వారికి, వారికి ఏమున్నాయో, మనకు ఎందుకు, వచ్చిన ఆదేశాలు ప్రకారం నడుకుచుందాం అంటూ మాట్లాడుకుంటున్నారు... అయితే, ఈ విషయం పై, కొంత మంది కూపీ లాగటం మొదలు పెట్టారు... విజయ్ మాల్యకి, ఆయనకు ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అని విషయం పై ఆరాలు తీస్తున్నారు... అలాగే, జగన్ తన కూతుర్ని లండన్ లో చదివిస్తున్న విషయం, లండన్ లో జగన్ ఒక పెద్ద విల్లా కొనటం, ఇలాంటి విషయాల్లో, జగన్ కు ఏమన్నా ఇబ్బంది ఉందేమో అని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి...

Advertisements

Latest Articles

Most Read