వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జగన్ మోహన్ రెడ్డికి అన్నిట్లో తోడుగా ఉండే, విజయసాయి రెడ్డి, నిన్న ఎన్డీటీవీ వెబ్సైటులో ఒక ఆర్టికల్ రాసారు... ఆ ఆర్టికల్ ఎందుకు రాసారో, ఎవరి కోసం రాసారో తరువాత మాట్లాడుకుందాం... ఈ ఆర్టికల్ చూసిన బీజేపీ ఢిల్లీ పెద్దలకు మాత్రం, ఆనంద భాష్పాలతో కళ్ళు చేమర్చాయని చెప్తున్నారు... విజయసాయి రెడ్డిలో ఈ యాంగిల్ ఎప్పుడూ చూడలేదని, మా మీద ఇంత విశ్వాసం, సొంత పార్టీ నేతలకు కూడా లేదని, మా బంగారం విజయసాయి రెడ్డి అని, ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్తున్నారు అంట... ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులకి ఈ ఆర్టికల్ పంపించి, చూడండి మీరు ఉన్నారు, విజయసాయి రెడ్డి, మమ్మల్ని ఎలా ఎత్తేసారో అంటూ, చెప్పారంట...

vijayasai 26032018 1

ఇక ఆ ఎన్డీటీవీ వెబ్సైటులో రాసిన ఆర్టికల్ విషయానికి వద్దాం.. ఒక, పక్క అవిశ్వాసం అంటూ రోజు వైసిపీ ఆడుతున్న డ్రామాలు చూస్తున్నాం... అలాగే విజయసాయి రెడ్డి, ప్రతి రోజు ప్రధాన మంత్రి ఆఫీస్ లో ప్రత్యక్షం అవ్వటం చూస్తున్నాం... ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి, ఎన్డీటీవీ వెబ్సైటులో, మోడీని ఆకాశానికి ఎత్తే ఆర్టికల్ రాసాడు విజయసాయి రెడ్డి... ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉండటానికి కారణం, కేంద్రం కాదు, చంద్రబాబు అంటూ, హెడ్డింగ్ పెట్టి భజన మొదలు పెట్టాడు...

vijayasai 26032018 1

చంద్రబాబు అకారణంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారంట... స్పెషల్ స్టేటస్, ప్యాకీజీ అన్నీ చంద్రబాబు ఇష్ట ప్రకారమే జరిగాయి అంట... పోలవరం కూడా చంద్రబాబు వల్లే లేట్ అవుతుంది అంట... అసలు కేంద్రానిది ఏమి తప్పు లేదు అంట... చంద్రబాబు అసలు పోరాటం చెయ్యటం లేదు అంట... అసలైన పోరాటం తమదే అని రాసుకుని, ఆర్టికల్ మొత్తం, అసలు విభజన హామీలు అమలులో కేంద్రం తప్పు ఏమి లేదని, మొత్తం చంద్రబాబే చేసాడు అని రాసారు... ఇలాంటివి నేషనల్ మీడియాలో రాసి, దేశంలో చంద్రబాబు ఇమేజ్ ని దెబ్బతియ్యటం, అలాగే మోడీని మంచి చేసుకోవటం లాంటివి తప్ప, ప్రజల మనోభావాలు అనేవి ఈ మహానుభావుడికి తెలియవు అనుకుంటా... ఎంత సేపు మోడీ భజనే...

ఎంత మంది అమరావతిని వెనక్కు లాగటానికి ప్రయత్నిస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం, అమరావతిని ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు... ఢిల్లీ వాళ్ళు, సొంత మనుషులు అమరావతి పై ఏడుస్తూ, కుట్రలు చేస్తున్నా, అవే దీవెనలు అనుకుని, ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు చంద్రబాబు... వీరు అమరావతి పై విషం చిమ్ముతూ బ్రాండ్ ఇమేజ్ చెడగోడుతుంటే, చంద్రబాబు అమరావతి బ్రాండ్ ఇమేజ్ నిర్మించుకుంటూ వెళ్తున్నారు... అమరావతికి ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు, చంద్రబాబు చేసిన మరో ప్రయత్నం ఫలించింది... ఫార్ములా1 పవర్‌బోట్‌ రేసింగ్‌లో ప్రసిద్ధి చెందిన ఎఫ్‌1హెచ్‌2వో ప్రపంచ చాంపియన్‌షి్‌పనకు ఆతిథ్యమిచ్చే గొప్ప అవకాశం భారత్‌లోని అనేక నగరాలను కాదని అమరావతికి దక్కింది... వాయువేగంతో దూసుకుపోయే పవర్‌బోట్లు..కళ్లు గగుర్పొడిచేస్థాయిలో నీటిలో విన్యాసాలు..రెప్పపాటులో కిలోమీటర్ల మేర దూసుకువెళ్లే బోట్లు..అబ్బురపరుస్తూ ఔరా అనిపించేలా ఉండే పవర్‌బోటింగ్‌... ఇదంతా, అమరావతిలో మన కళ్ళ ముందు జరగనుంది.

formula 1 26032018 2

అమరావతిలోని భవానీ ఐలాండ్‌లో ‘ఎఫ్‌1హెచ్‌2వో’ ప్రపంచ చాంపియన్‌షి్‌పను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. 2018 వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో భాగంగా ఎఫ్‌1 వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహణ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 8 మహానగరాల్లో వీటిని నిర్వహిస్తుంది. పోర్చుగల్‌, లండన్‌, ఫ్రాన్స్‌, చైనా, దుబాయ్‌తో పాటు ఈసారి భారత దేశంలోని, అమరావతి కూడా చోటు కల్పించారు. మే నెల 18న పోర్చుగల్‌లో మొదలయ్యే ఈ చాంపియన్‌షిప్‌ డిసెంబరు 15న షార్జాలో ముగుస్తుంది. నవంబరు 22 నుంచి 24 వరకూ అమరావతి వేదికగా నిలవనుంది. భారత్‌లో చివరిసారిగా పదేళ్ల కిందట ఒకసారి ఈ పోటీలు జరిగాయి. తర్వాత ఇప్పుడు అమరావతి వేదిక కానుంది.

formula 1 26032018 3

ఈ ‘ఎఫ్‌1హెచ్‌2వో’ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, మన రాష్ట్రానికి తీసుకురావటానికి చంద్రబాబు గత ఏడాది నుంచి, ఎంతో శ్రమించారు... ఎఫ్‌1హెచ్‌2వో ప్రతినిధులతో ఏడాది వ్యవధిలో నాలుగుసార్లు చర్చించారు. .. బ్యారేజీ నుంచి నది 23కి.మీ. మేర ఉండడం, 11 లంకలు(ఐలాండ్‌లు), అక్కడక్కడా నది వంపులు, నీటిలో అలలు లేకుండా నిర్మలంగా ఉండడం వంటి సాంకేతిక కారణాలను పరిశీలించి ఈ ప్రాంతాన్ని రేసింగ్‌కు అనువైనదిగా గుర్తించారు.... ‘ఎఫ్‌1హెచ్‌2వో’ ప్రతినిధి బృందంతో, ఈ రేస్‌లు అమరావతిలో నిర్వహిస్తే రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రపంచ స్థాయిలో మా కొత్త నగరానికి గుర్తింపు వస్తుందని చంద్రబాబు కోరారు. సాంకేతికంగా కూడా అనువుగా ఉండడంతో ఈ ఏడాది ఛాంపియన్‌షిప్‌ కేలెండర్‌లో అమరావతిని వేదికగా ఎంపిక చేశారు... ఇక నవంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా, అంతర్జాతీయ పర్యాటకులు, క్రీడాభిమానులు, పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు ఇలా అనేకమంది రాకతో నవంబరులో విజయవాడలో సందడి నెలకొననుంది.

నిన్న అమిత్ షా రాసిన లేఖ పై, ఈ రోజు కూడా చంద్రబాబు స్పందించారు.. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ, మీకు ఇచ్చిన డబ్బులు వేరే వాటికి ఉపయోగించుకుంటున్నారేమో, అంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి చేస్తున్నాం అంటూ లేఖ రాయటం పై, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు... తనను నిందించేముందు బీజేపీ నేతలు తమ అవినీతి చరిత్రను చదువుకోవాలని సూచించారు... ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు...

amitshah 25032018 2

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పాలనసాగుతున్నది అంటూ, రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిందని అమిత్ షా లాంటి వ్యక్తి అబాద్ధాలు చెప్తూ లేఖపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. "ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూ ఎన్డీఏ నుంచి బయటికొస్తే నా పై ఆరోపణలు చేస్తారా? మరి అమిత్‌ షా కుమారుడు జై షా అక్రమాల మాటేమిటి? కొడుకుపై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పరా? అన్నీ వ్యవస్ధలనూ కేంద్రప్రభుత్వం భ్రష్టుపట్టించంది. అందరికీ నీతులు చెప్పే బిజెపి యుపిలో ఒక రాజ్యసభ స్ధానం కోసం ఎందుకు దిగజారింది. గుజరాత్ లో రాజ్యసభ సీటు కోసం ఏం చేశారో తెలీదా ? రాజ్యసభ సీటు కోసం మనకు ఇద్దరు ఎంఎల్ఏలు మాత్రమే తక్కువన్నా, మూడో రాజ్యసభ సీటుకు పోటీ పెట్టలేదన్న విషయం అందరూ గ్రహించాలని" చంద్రబాబు అన్నారు...

amitshah 25032018 3

ఇది అమిత్ షా కొడుకు పై ఉన్న ఆరోపణలు... 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతోనే జయ్‌ షాకు చెందిన రెండు కంపెనీల టర్నోవర్‌ అమాంతం పెరిగిపోయిందని, అంతేకాకుండా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆయన కంపెనీలకు భారీ రుణాలు అందాయని 'దవైర్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌ ఓ కథనంలో పేర్కొంది... జయ్‌ షాకు చెందిన టెంపుల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా నష్టాల్లో కొనసాగుతోందని, కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కంపెనీకి రూ. 15 కోట్ల రుణం అందిందని, దీంతో 2015లో ఆ కంపెనీ టర్నోవర్‌ రూ. 80 కోట్లకు పెరిగిందని వెబ్‌సైట్‌ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వాత నష్టాలతో ఆ కంపెనీని మూసినట్టు తెలుస్తోందని తెలిపింది. .. జయ్‌ షాకు చెందిన మరో కంపెనీ.. గుజరాత్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ నుంచి రూ. 25 కోట్ల రుణం తీసుకున్నదని, అంతేకాకుండా అదే కంపెనీని పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థగా మార్చి.. కేంద్ర విద్యుత్‌ శాఖ నుంచి రూ. 10.35 కోట్లు రుణం తీసుకున్నదని ఆ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

మా రాష్టానికి మీరు హామీ ఇచ్చినవి ఇవ్వండి, చట్టంలో ఉన్నవి అమలు చెయ్యండి అంటే, ఢిల్లీ పార్టీ ఎలా ఎదురుదాడి చేస్తుందో చూసాం... అన్నీ ఇచ్చేసామని, కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, చేసిన పనులకు యూసీలు, ఇవ్వలేదు అంటూ, బీజేపీ బుకాయిస్తూ వస్తుంది.. చంద్రబాబు అసెంబ్లీ వేదికగా, మేము యూసీలు ఇచ్చాం అంటూ, డేట్ వైజ్ చెప్పినా, బీజేపీ మాత్రం, అవే అసత్యాలు చెప్తూ, ప్రజలను కన్ఫ్యుస్ చేస్తుంది... అయితే వీటన్నటికీ చెక్ పెడుతూ, ఈ రోజు చంద్రబాబు చివరకు ప్రభుత్వ యంత్రాంగంలో భాగమైన, యూసీలు కూడా పారదర్శకంగా ప్రజల ముందు పెట్టారు...

uc 25032018 1

uc 25032018 1

వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.1050 కోట్లలో 940 కోట్లకు యూసీలు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. గుంటూరు, విజయవాడకు ఇచ్చిన నిధుల్లో రూ.350 కోట్లకు యూసీలు ఇచ్చామని, అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఇచ్చిన రూ.1000కోట్లకు కూడా యూసీలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు...

uc 25032018 1

uc 25032018 1

అయితే, ఎంత చెప్పినా బీజేపీ అవే అబద్ధాలు చెప్తూ, చంద్రబాబు వైపు తప్పు చూపించటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ యూసీలు అన్నీ బయట పెట్టింది... ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు రూ.150కోట్ల చొప్పున ఇచ్చారని... శ్రీకాకుళంలో రూ.135.15కోట్లు, విజయనగరంలో రూ.134.74కోట్లు, విశాఖపట్నంలో రూ.135.46 కోట్లు, చిత్తూరులో రూ.134.90కోట్లు, కడపలో రూ.137.08కోట్లు, అనంతపురంలో రూ.124.59కోట్లు, కర్నూలులో రూ.144.55 కోట్లు ఖర్చు చేసినట్లు, కేంద్రానికి పంపించిన యూసీలు విడుదల చేసారు..

uc 25032018 6

అలాగే, ఈ సంవత్సరం, 350 కోట్లు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చి, వెంటనే పియంఓ పర్మిషన్ లేదు అని, డబ్బులు మళ్ళీ వెనక్కు తీసుకున్న వివరాలు కూడా బయట పెట్టారు... అలాగే అమరావతికి, అండర్ గ్రౌండ్ డ్రైనేజికి ఇచ్చిన యూసీలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది...

uc 25032018 7

మరి ప్రభుత్వం యూసీలు సమర్పించకపోతే ఇన్నాళ్ళు అసలు నిధులు ఎలా విడుదల చేశారు ? ఇప్పుడు ఈ వివరాలు చుసిన తరువాత, ఎవరు అన్యాయం చేసారో ప్రజలకు తెలుస్తుంది.. నిన్న ఉత్తరం రాసి, చంద్రబాబు ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు అంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇవి చూసి, మన ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ మేధావులతో చర్చించండి... ఎవరిది తప్పో చెప్తారు... మీరు ఎలాగు మోడీని ఏమి అనలేరు కాదా, ఆ మేధావులు అయినా స్పందిస్తారు... ఇక జగన్ గురించి, మాట్లాడటం కూడా అనవసరం... ఈ వాస్తవాలు చూసి, ఇక ప్రజలే నిర్ణయించాలి...

uc 25032018 1

uc 25032018 1

Advertisements

Latest Articles

Most Read