ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి నోట విన్నా, "ఆపరేషన్ గరుడ" అనే టాపిక్ మాత్రమే వినిపిస్తుంది... ఢిల్లీ పెద్దలు, ఇక్కడ చంద్రబాబుని ఇబ్బంది పెట్టటం కోసం, మన వాళ్ళతోనే, ఎలా ఆయన్ని ఇబ్బంది పెట్టి, రాష్ట్రంలో అనిశ్చితి తేవటం ఈ ఆపరేషన్ ఉద్దేశం... అయితే, ఇప్పుడు మీరు వినేది కూడా ఆపరేషన్ గరుడే, కాని ఇది రాష్ట్రాన్ని కాపాడే ఆపరేషన్... నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ వద్ద ‘‘గరుడ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌’’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు.

gaurda 23032018 2

దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏర్పాటు చేయని విధంగా ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, సభాపతి, ముఖ్యమంత్రి వరకు తమ ఇళ్ల వద్ద నుంచి శాసనసభ ప్రాంగణానికి చేరుకునే వరకు కంటికి రెప్పలా ఈ కంట్రోల్ రూమ్ కాపాడుతుంది. గరుడ పక్షికి అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఆకాశంలో తిరుగుతూ కిలోమీటర్ల కొద్ది తన డేగకళ్లతో నిఘాపెట్టేలా దానిని తీర్చిదిద్దారు. రూరల్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు స్వీయ పర్యవేక్షణలో డీఎస్పీలు సుధాకర్‌, రాజశ్రీ, ఐటీకోర్‌ సీఐ రాజశేఖర్‌ల నేతృత్వంలో 50 మంది నిష్టాతులైన సిబ్బంది 24 గంటలు గరుడ విభాగం భద్రతను పర్యవేక్షిణ చేస్తుంది... ఈ విభాగం ప్రధానంగా ఉపయోగించేది, యాప్‌, జీపీఎస్‌, సోషల్ మీడియా ఎనాలిసిస్, రేడియో ఓవర్‌ ఇంటర్నెట్‌ కాల్‌ , ఎంటర్‌ప్రైజెస్‌ సెర్చు 24/7, డ్రోన్‌ కెమెరాలు, 200 దాకా సిసి కెమెరాలు.. బాడీ కెమెరాలు, న్యూస్‌వాచ్‌, అసెంబ్లీసెల్‌, ఇంటెలిజెన్స్‌ టీమ్స్‌, క్రమశిక్షణ బృందాలు ఇలా అనేక కొత్త విభాగాలను రూపొందించి వాటిని సాంకేతికతతో గరుడకు అనుసంధానం చేశారు...

gaurda 23032018 3

నిన్న ఈ కంట్రోల్ రూమ్ ని, స్పీకర్ కోడెల సందర్శించారు... ఈ సందర్భంగా అసెంబ్లీ డ్యూటీలో భాగంగా ఉత్తమ సేవలందించిన పోలీసులకు స్పీకర్ కోడెల అభినందన పత్రాలు అందించారు. అనంతరం గరుడ కంట్రోల్ రూమ్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి cc కెమెరా వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండదన్నారు. డోన్ కెమెరాల పనితీరు బాగుందని అయితే శాటిలైట్ ఉపయోగించుకోంటే మరింత నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకోని త్వరలోనే ఏపీలో పోలీస్ కనబడని పోలీసింగ్ వస్తుందన్నారు.

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పోరాడండి రా అంటే, వెళ్లి ప్రధాని కార్యాలయంలో కూర్చుంటాడు ఒకడు... ఇంకొకడు, నేను నిజాయతీ పరుడుని అని కటింగ్ ఇస్తూ, మోడీ అంటే ఇష్టం అంటాడు, ప్రేమ అంటాడు.. వీరిద్దరూ కలిసి, ఇక్కడ మోడీ పై పోరాడుతున్న చంద్రబాబుని తిడతారు.. మోడీని ఒక్క మాట అనాలంటే భయం... రాష్ట్రం కోసం, మోడీతో పోరాడాలి అంటే భాయం... ఢిల్లీలో మోడీ చుట్టూ తిరుగుతారు, ఇక్కడకు వచ్చి పోరాడుతున్నట్టు బిల్డ్ అప్ ఇస్తారు... తెలుగు చానల్స్ లో రెచ్చిపోతారు, నేషనల్ మీడియాలో మోడీ అంటే ఎంతో ఇష్టం అంటారు... అయితే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి, మోడీని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు అంటున్నారు...

vijayasi 23032018 2

విజయసాయి రెడ్డి, ప్రతి రోజు ప్రధాని మంత్రి కార్యాలయంలో కనిపిస్తూ ఉంటారు... ఎందుకో ఎవరికీ తెలియదు... ఈయన ప్రొఫైల్ ఏమన్నా మంచిదా అంటే, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A2.. ఇలాంటి వాడికి ప్రతి రోజు ప్రధాని కార్యాలయంలో ఏమి పని ? మోడీ పై అవిశ్వాసం పెడతాం అంటూ, వెళ్లి మోడీ ఆఫీస్ లోనే కూర్చుంటారు... ఇదే విషయం చంద్రబాబు పదే పదే అడుగుతున్నారు.. ప్రధాని కార్యాలయం, ఏమన్నా ఆర్ధిక నేరస్థుల అడ్డా నా అంటూ, ప్రశ్నించారు...

vijayasi 23032018 3

అయితే, మొన్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు మాటల పై స్పందిస్తూ, నేను రోజు వెళ్లి ప్రధానిని కలుస్తా, నా ఇష్టం అంటూ రెచ్చిపోయారు... దానికి చంద్రబాబు మాట్లాడుతూ, మీరు వెళ్లి కాపురాలు చేసుకోండి, నేను అడిగేది ప్రధాని కార్యాలయం, ఇలాంటి నేరస్థులని ప్రోత్సహిస్తుందా అంటూ ప్రశ్నించారు... దీని పై విజయసాయి రెడ్డి ఈ రోజు స్పందిస్తూ, మోడీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న చంద్రబాబు పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని చెప్పాడు... ప్రధాని కార్యాలయాన్ని కించపరుస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానన్నారు.... ఇక్కడ వింత ఏంటి అంటే, ఇప్పటి వరకు ఏ బీజేపీ నాయకుడు చంద్రబాబు మాటలకు అభ్యంతరం చెప్పలేదు.. కాని, వైసిపీకి చెందిన విజయసాయి మాత్రం, మోడీని అంటే, నేను ఊరుకోను అంటూ నోటీసు ఇస్తాను అంటున్నాడు.. అలాగే, రాష్ట్రానికి చేసిన అన్యాయం పై ప్రధానితో మాట్లాడు అంటే మాత్రం, పరార్... ఇంట ఓపెన్ గా కుమ్మక్కు అయిపోయి, రాష్ట్రాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్న వీరికి, ప్రజలే బుద్ధి చెప్పాలి...

గత కొన్ని రోజులుగా పోలవరం పై, ఒక పధకం ప్రకారం ఎలాంటి కుట్ర పన్నారో చూస్తూనే ఉన్నాం... ఎలా అయినా పోలవరం ఆపాలని, ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్, ఢిల్లీలోనూ, మన రాష్ట్రంలోనూ (హైదరాబాద్ బ్యాచ్ అనుకోండి), ఎలాంటి మాటలు మాట్లాడారో చూసాం..... అయితే, పాపం ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్ కి, కేంద్రం వేసిన కమిటీనే దిమ్మ తిరిగే రిపోర్ట్ ఇచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం ఒక కమిటి నియమించింది.. అదే మసూద్ కమిటీ ... పోలవరం పనులు, పునరావాసం, ఇలా అన్ని విషయాల పై ఈ కమిటీ చూసి రిపోర్ట్ ఇవ్వాలి...

polavaram 23032018 1

అయితే ఈ కమిటి ఎదో ఒక రిపోర్ట్ ఇస్తుందని, పోలవరం ఆపేసి, చంద్రబాబు పై సిబిఐ కేసు వేస్తారని హడావిడి చేసారు... అందుకే రెండు రోజుల నుంచి, ఈ ఆపరేషన్ గరుడ టీం మెంబెర్స్ అందరూ, దీని చుట్టూతా కామెంట్స్ చేసారు... అయితే, చంద్రబాబు నిజాయితీ, చిత్తసుద్ధి ముందు వీరి నాటకాలు పాటాపంచలు అయ్యాయి... ఈ రోజు, ఈ కమిటి రిపోర్ట్ ఇచ్చింది... నవయుగ కంపెనీ రంగంలోకి వచ్చాక పోలవరం పనులు వేగవంతమయ్యాయని, రోజుకు 4,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయని మసూద్ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. అంతేగాక నవయుగ కంపెనీ లక్ష్యాన్ని చేరుకుంటుందని కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది.

polavaram 23032018 1

అలాగే పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌పై మసూద్‌ కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. పైడిపాక గ్రామంలో లబ్ధిదారులతో మసూద్‌ కమిటీ సభ్యులు మాట్లాడారు. కాగా... పునరావాసంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారని కమిటీ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుపై మసూద్ కమిటీ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. పోలవరంపై మసూద్‌ కమిటీ నివేదికతో పరిహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు పటాపంచలయ్యాయి. అలాగే ఇప్పటికైనా పోలవరంపై విమర్శలు మానుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో అసెంబ్లీలో మసూద్‌ కమిటీ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

రాష్ట్ర నాశనం, చంద్రబాబు పతనం చేస్తున్న సన్నాసుల్లారా, ఒక కంపెనీ మన రాష్ట్రానికి రావాలి అంటే ఎంత కష్టపడాలో చూడండి... ఒక పధ్ధతి ప్రకారం చంద్రబాబు ఒక్కోఒక్కటి నిర్మించుకుంటూ వస్తుంటే, మీరు హైదరాబాద్ నుంచి వచ్చి, రాళ్ళు, బురద జల్లి, మా రాష్ట్రాన్ని నాశనం చేసి, మా రాష్ట్రంలో అనిశ్చితి నెలకొల్పి వెళ్ళిపొండి... మీరు వేసిన బురద కడుగుతూ మా టైం వేస్ట్ చేస్తుకుంటూ కూర్చుంటాం... కొంచెం అన్నా సిగ్గు తెచ్చుకోండి... అభివృద్ధి అంతా అమరావతిలోనే అని ఏడ్చిన వారికి కూడా, ఈ రోజు హీరో మోటార్స్ శంకుస్థాపన ఒక చెంప పెట్టు... రాయలసీమలో ఈ కంపెనీ వస్తుంది అంటే, అభివృద్ధి అమరావతిలో జరగటం కాదు... కియా, ఐసుజు వచ్చింది కూడా రాయలసీమలోనే...

hero 23032018 1

హీరో మోటార్స్ లాంటి ఒక పెద్ద కంపెనీ మన రాష్ట్రంలో రావాలి అంటే, ఎంత కృషి ఉంటుందో తెలుసుకోండి... ఎన్ని రాష్ట్రాలు పోటీ పడతాయో.. గుజరాత్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల పోటీ, వారికి సహకరించే ఢిల్లీ పెద్దలు, వీరందరినీ తట్టుకుని, హీరో మోటార్స్ లాంటి ఒక పెద్ద సంస్థ మన రాష్ట్రానికి వచ్చింది.. ఇదే విషయం చంద్రబాబు కాదు, హీరో మోటార్స్ చైర్మన్, పవన్ ముంజాల్ చెప్పారు.. ఈ రోజు హీరో మోటార్స్ శంకుస్థాపనకు వచ్చిన ఆయన, చంద్రబాబు వల్ల వేరే రాష్ట్రానికి వెళ్ళాల్సిన ప్లాంట్, ఆంధ్రప్రదేశ్ కు ఎలా వచ్చిందో చెప్పారు...

hero 23032018 1

"ఒక రోజు, చంద్రబాబు మా ఇంటికి డిన్నర్ కు వచ్చారు... అప్పటికే మేము వేరే రాష్ట్రంలో ప్లాంట్ నెలకొల్పటానికి నిర్ణయించుకున్నాం...అప్పటికే అన్ని నిర్ణయాలు అయిపోయి... ఒక రాష్ట్రంలో ప్లాంట్ నెలకొల్పటానికి కమిట్ అయ్యాం... కాని చంద్రబాబు అన్ని విషయాలు చెప్పారు.. హీరో ప్లాంట్ మా రాష్ట్రంలో పెట్టండి, అంటూ ఒక ప్రెజంటేషన్ ఇచ్చారు.. అంతే ఒక్క గంటలో, మా నిర్ణయం మార్చుకున్నాం... చంద్రబాబు లీడ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా కొత్త ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకున్నాం... చంద్రబాబు సహకారం లేనిదే, ఈ రోజు ఈ ప్లాంట్ ఇక్కడ వచ్చేది కాదు" అంటూ హీరో మోటార్స్ చైర్మన్, పవన్ ముంజాల్ చెప్పారు.. ఇప్పటికైనా మీ కుళ్ళు రాజకీయం ఆపి, చంద్రబాబుకి సహకరించండి... రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో ఆయన చూసుకుంటాడు...

Advertisements

Latest Articles

Most Read