ఎవడో హైదరాబాద్ లో కూర్చుంటాడు... అమరావతి పై, ఆంధ్రా పై విషం చిమ్ముతాడు, చంద్రబాబుని తిడతాడు, కెసిఆర్ ని ఆహా ఓహో అంటాడు, ఆడిని తీసుకువచ్చి, ప్రైమ్ టైంలో కూర్చోబెట్టి, మన హైదరాబాద్ మీడియా విషం చిమ్ముస్తుంది... కాని ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మంచి మాత్రం చూపించారు... చూపించినా, ఎదో ఒక చిన్న 30 సెకండ్స్ బిట్ వేసి, మమ అనిపిస్తారు... అయ్యా హైదరాబాద్ మీడియా, ఈ రోజు మా రాష్ట్రంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటార్స్, తన తయారీ ప్లాంట్ ను, మా రాష్ట్రంలో నెలకొల్పుతుంది... ఈ రోజు భూమి పూజ, కొంచెం, ఇలాంటివి కూడా, చూపించి, మా రాష్ట్ర ప్రగతిని చూపించండి...
ఈ రోజు జరగనున్న హీరో మోటార్స్ బూమి పూజ గురించి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వివరాలు చెప్పారు... గురువారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీసిటీకి సమీపంలో ఉన్న మాదన్నపాల్యెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీని హీరో మోటార్స్ ఏర్పాటు చేస్తోందన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.3200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ 2019 చివరి నాటికి 5లక్షల మోటార్ సైకిళ్లను తయారు చేయనుందన్నారు.
2020 నాటికి రెండోప్లాంట్‌ను రెండో దశతో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుందన్నారు. ఈ రెండు ప్లాంట్‌ల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల ద్విచక్రవాహనాలు తయారవుతాయన్నారు. 2025 నాటికి 18లక్షల మోటారు సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఇప్పటికే రూ. 22కోట్ల 83లక్షలతో కాంపౌండ్ వాల్ పనులు పూర్తయ్యాయన్నారు. జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపోలో టైర్ల పరిశ్రమకు శంకుస్థాపన చేశారని, వీటి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ ప్రారంభం కానుందన్నారు. ఈక్రమంలో రానున్న కాలంలో పరిశ్రమలకు, ఐటీ హబ్‌గా రాయలసీమ నిలువనుందన్నారు.