ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చెయ్యండి అని మనం పోరాడుతుంటే, రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి తన పై ముప్పేట దాడి చేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పార్లమెంట్‌, అసెంబ్లీ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతలతో గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు... నా పై, మంత్రుల పై, ఎదో ఒక విధంగా కక్ష సాధిస్తారనే సమాచారం ఉందని, కక్ష సాధింపు చర్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయని, అన్నింటికీ అందరూ సిధ్ధంగా ఉండాలని, ప్రజలకు వీళ్ళ కుట్రల పై చైతన్యపరచాలని నేతలను ఆదేశించారు...

cbn 22032018 2

బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు తీవ్ర కుట్రలు చేస్తున్నాయని , తన ఇమేజ్ ని దెబ్బతీయడమే వారి ప్రధాన అజెండా అని, ఈ మూడు పార్టీలూ కలసి మహాకుట్ర పన్నాయని ఆరోపించారు. భారతదేశ చరిత్రలో ఒక్క తెలుగుదేశం మాత్రమే ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించిందని, ఇదే బీజేపీకి కంటగింపు అయిందని, అందువల్లే తనను బలహీనపరచాలని బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవర్తన గత కొంతకాలంగా భిన్నంగా ఉందని, ఏపీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని చంద్రబాబు అన్నారు.

cbn 22032018 3

గతంలో ప్రత్యేక ఆర్థిక సాయానికి ఎందుకు ఒప్పుకున్నది... ఇప్పుడెందుకు హోదాయే కావాలంటున్నామన్నదానిపై ప్రజలకు వివరించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఏ రాష్ట్రాలకు హోదా ఇవ్వడం లేదని అంటేనే అప్పుడు ప్రత్యేక ఆర్థికసహాయానికి ఒప్పుకున్నామని సీఎం పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన మాట తప్పిందని, హోదా ఉన్న రాష్ట్రాలకు 90:10 కింద... నిధులు,ప్రోత్సాహకాలు కొనసాగిస్తోందన్నారు. వేరే రాష్ట్రాలకు ఇచ్చేటట్లయితే ఏపీకి కూడా అదే పేరుతో ఇవ్వాలని కోరామని, దీనిపై ప్రజలను చైతన్యపరచాలని, తమ వాదనలో హేతుబద్ధత గురించి వివరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతారు... ఒకప్పుడు వైఎస్‌ జగన్‌కి అత్యంత ఆత్మీయుడు... జగన్‌ జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి, ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చిన మూలస్తంభం... జగన్‌లోని చీకటి కోణాలు తెలిసినా వైఎస్‌పై అభిమానంతో గుండెల్లోనే గుట్టుగా పెట్టుకున్న కమిటెడ్‌ లీడర్... రాష్ట్ర విభజన అనే అత్యంత హేయమైన గాయం విషయంలో జగన్‌ సోనియాతో రాజీపడటాన్ని సహించలేక పోయారు... జగన్‌ సోనియా మ్యాచ్‌ఫిక్సింగ్‌ వ్యవహారాన్ని బయటపెట్టారు... విశాఖలో విజయమ్మ గెలిస్తే లవ్‌లీ వైజాగ్‌ రక్తపాతంతో రగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు... వైజాగ్ లో జగన్, బ్యాచ్ ఎంటర్ అవ్వకుండా, ఆయన ప్రయత్నం చేసారు...

sabbam hari 22032018 2

ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు... సబ్బం హరి లాంటి వాళ్ళు చెప్పారంటే, దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉండక పోదు అనే అభిప్రాయం ప్రజల్లు ఉంది... ఆ నాడు, సోనియా, జగన్ ను ఎలా ఆడించిందో, ఇప్పుడు పవన్ ని ,మోడీ ఎలా ఆడిస్తున్నారో చెప్పారు సబ్బం హరి... భారతీయ జనతా పార్టీ ప్రోద్బలంతోనే టీడీపీపైనా, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లపైనా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ విమర్శలు చేస్తున్నారని సబ్బం హరి అన్నారు... పార్టీ ఆవిర్భావ సభా వేదిక నుంచి బాబు, లోకేశ్‌లపై విమర్శలు గుప్పించారని, ఇదంతా బీజేపీ ప్రణాళికలో భాగమని ఆయన విశ్లేషించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా, అన్ని రాష్ట్రాల్లోను బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని మోదీ-షాలు చేస్తున్న రాజకీయ వ్యూహంలో భాగంగానే ఏపీకి ఈ కష్టాలన్నీ వచ్చాయని హరి అభిప్రాయపడ్డారు.

sabbam hari 22032018 3

ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నదనే విషయంపై చర్చ సాగుతుంటే...రాజకీయ పార్టీలన్నీ దానివల్ల ఎలా లబ్ధి పొందాలనే అంశంపైనే దృష్టి సారించాయని, కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవకుండా స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని హరి ఆవేదన వ్యక్తంచేశారు. పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న వ్యాఖ్యలు రోజుకో విధంగా ఉంటున్నాయని.. దానివల్ల ఆయన గ్రాఫ్‌ పడిపోయిందని సబ్బం హరి వ్యాఖ్యానించారు. మోదీపై అవిశ్వాసం పెడితే..ఢిల్లీకి వెళ్లి అందరినీ కూడగడతానని చెప్పిన ఆయన ఇప్పుడు టీడీపీ అవిశ్వాసం పెడితే..నాటకాలు ఆడుతున్నారని చెప్పడం వల్ల ప్రజల్లో పవన్‌పై నమ్మకం పోయిందన్నారు. హోదా కోసం పవన్‌ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తానని ఇటీవల ప్రకటించారని, అది కూడా బీజేపీ వ్యూహంలో ఒక భాగమని తనకు సమాచారం ఉందన్నారు.

నిండా మునిగినోడికి చలి ఏమి ఉంటుంది అని, ఈ దొంగల పార్టీకి, ఇలాంటివి ఒక లెక్కా పక్కా ? పార్టీ అధ్యక్షుడి ప్రొఫైల్ చదవాలంటే, ఆ 420 కేసులు లిస్టు చదవటానికి, ఒక జాతీయ్ ఛానల్ ప్రింట్ అవుట్ తీసుకుని వచ్చి మరీ అడిగింది... అంతటి ప్రొఫైల్ ఉంది... మరి ఆయన అనుచరులు ఏమి తక్కువ, అందుకే, వారు కూడా, ఆ నాయకుడి పేరు నిలబెడుతున్నారు.. విచిత్రం ఏమిటి అంటే, ఇలాంటి వారు, మన కోసం పోరాడతారు, చంద్రబాబు లాంటి వాడిని జైలుకు పంపిస్తా అని సవాల్ చేస్తారు... ఇలాంటి వారు, అవినీతి గురించి మాట్లాడుతుంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది...

ycp mla 21032018

ఇక విషయానికి వస్తే, వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్‌ వాదనను సమర్థిస్తూ దీనిపై విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి వైకాపా తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెదేపా అభ్యర్థి వెంకట రమణరాజుపై గెలుపొందారు.

ycp mla 21032018

అయితే పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వెంకటరమణరాజు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించింది. పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో భార్యను ఓ చోట ఎండీగా, మరోచోట సాధారణ గృహిణిగా పేర్కొన్నారని, ఆదాయ వనరులను సరిగా చూపలేదని నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు వంద పేజీల తీర్పును వెలువరించింది. ఈ కేసును పునర్విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రాతో కూడిన ధర్మాసనం హైకోర్టును ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ - ది సన్-రైజ్ స్టేట్ ... ఇది ఎదో కొటేషన్ కాదు, ఇది వాస్తవం... ఆంధ్రవాడిని అడ్డుకునే శక్తి ఎవ్వడికి లేదు... ఎన్నో అవమానాలు, సొంత రాష్ట్రంలో, ఒక వర్గం నిట్టూర్పులు... పరాయి రాష్ట్రంలో ఉంటూ, సొంత రాష్ట్రం మీద కుట్ర చేసే సంత..... అన్నిటికీ మించి ఢిల్లీ కుట్రలు... అసలు ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వగలమా అనే పరిస్థితి... భవిషత్తు శూన్యం... ఏమి జరుగుతుందో తెలీదు, ఎప్పటికి కోలుకుంటామో తెలీదు, మన పిల్లల భవిష్యత్తు ఏమి అవుతుందో అనే ఆందోళన... అలాంటి పరిస్థితిల్లో నుంచి, కారు మబ్బులుని చీల్చుకుంటూ, ఉదయిస్తుంది, మన ఆంధ్రప్రదేశ్... ఇది వాస్తవం, అని ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు చెప్పాయి, కేంద్రం విడుదల చేస్తున్న ర్యాంకింగ్స్ చెప్తున్నాయి... మన రాష్ట్ర వృద్ది రేటు చెప్తుంది... స్వయంప్రకటిత మేధావులు, రాజకీయ అవకాశవాదులు, కుల గజ్జి మేధావులు, వ్యక్తిగత, స్వార్ధ ప్రయోజనాల కోసం వెంపర్లాడే మీడియా జనాలు, పరాయి రాష్ట్రంలో ఉంటూ, సొంత రాష్ట్రం మీద కుట్ర చేసే సంత ఇలా ఎవరైనా సరే, ఇంత స్పష్టంగా వాస్తవాలు కనిపిస్తున్నా, చూడలేని , అంగీకరించలేని వాళ్లు ఉంటే, వెళ్లి కోడి గుడ్డు మీద ఈకలు పీక్కోవచ్చు...

companies 21032018 2

ఇవిగోండి 2014 నుంచి ఇప్పటి వరకు, 2016 CII సమ్మిట్ లో, 2017 CII సమ్మిట్, , 2018 CII సమ్మిట్ లో పనులు ప్రారంభించిన, గ్రౌండ్ అయిన కంపెనీల వివరాలు.... చంద్రబాబు తెచ్చిన పెట్టుబడులు, ప్రశ్నించే వారందరికీ ఇందులో చాలా సమాధానాలు లభిస్తాయి. ఇందులో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, ఎంత విలువ, వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చాయి, ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించాయి అనే వివరాలు స్పష్టంగా ఉన్నాయి... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల వివరాలు... (ఇవి మొబైల్ లో అంత స్పష్టంగా కనిపించవు... కంప్యూటర్ లో ఓపెన్ చేస్తే పూర్తిగా చూడవచ్చు) Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Industry&LOS=All .... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు... (కోట్లలో).... Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Investment&LOS=All ..... 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఉద్యాగాల వివరాలు... Source: https://www.apindustries.gov.in/Investment_AP/IndustryCount.aspx?Grid=Employment&LOS=All ...

companies 21032018 3

ఈ లిస్టు ఏముందిలే ఎవడైనా ఇస్తాడులే అంటారా ? మామూలు మనుషులకి అయితే, పైన చెప్పింది సరిపోతుంది... మన రాష్ట్రంలో ఒక వింత బ్రీడ్ ఉంది కదా వారి కోసం, మరిన్ని వివరాలు పెట్టాడు చంద్రబాబు... పైన లింకులకి వెళ్ళండి.. అక్కడ G1 అని ఉంటుంది... అంటే, అవి కంపెనీలు మొదలు పెట్టినవి... ఇవి 533 కంపెనీలు... ఇప్పటికే 2.70 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి... ఆ నంబర్స్ మీద క్లిక్ చెయ్యండి... మీకు కంపెనీల లిస్టు కనిపిస్తుంది... ఇక్కడ ప్రతి కంపెనీకి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి... అంతే కాదు, ఆ కంపనీలలో ఉద్యోగాలు వచ్చిన వివరాలు, వారి పేరు, ఫోన్ నెంబర్, ESI నెంబర్, ఇలా అన్నీ excel షీట్ లో ఉన్నాయి (2.70 లక్షల మందికి గాను, ఇప్పటికే 60 వేల మంది సమాచారం అప్డేట్ చేసారు... ప్రతి రోజు ఈ లిస్టు అప్డేట్ అవుతుంది.. మరో నెలలో 2.70 లక్షల మంది సమాచారం అప్డేట్ అవుతుంది)... ఉదాహరణకు ఒక కంపెనీ ద్వారా, 2 వేల ఉద్యోగాలు వస్తే, 2 వేల మంది వివరాలు ఉన్నాయి... ఆ కంపెనీ HR ఫోన్, ఈ మెయిల్ id కూడా ఉంది... కావాలంటే ఫోన్ చేసి కనుక్కోవచ్చు.... ఇంత చెప్పినా నమ్మక పొతే, ఆ కంపెనీ అడ్రస్ కూడా ఉంది, ఒక కార్ కాని, బస్సు కాని వేసుకుని వెళ్లి చూసి వచ్చి, ప్రజలకు వాస్తవాలు చెప్పండి... ఇక ఇంత కంటే transparetగా ప్రపంచంలో, ఏ ప్రభుత్వం పని చెయ్యదు.... ఊరికే చంద్రబాబు మీద పడి ఏడవకుండా, మన రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి గర్వంగా ఫీల్ అవ్వండి...

Advertisements

Latest Articles

Most Read