పోలవరం విషయంలో వచ్చే సంవత్సర కాలం, ఎంతో కీలకమైనది... ఇప్పటికే కేంద్ర అనాలోచిత నిర్ణయం వల్ల, మూడు నెలలు అమూల్యమైన సమయం వేస్ట్ అయిపొయింది... చంద్రబాబు ఎలాగోలా సాధించి, నవయుగని తీసుకువచ్చి, కాఫర్ డ్యాంకి పర్మిషన్ లు తీసుకువచ్చి, పనులు ఆగకుండా చేసారు... అయితే, నిధులు విడుదలలో మాత్రం, కేంద్రం తీవ్ర జాప్యం చేస్తుంది... ఇప్పటికే మనం పెట్టిన ఖర్చు, 4 వేల కోట్లు పైన మనకు కేంద్రం ఇవ్వాల్సి ఉంది.. ఇలాంటి పరిస్థితుల్లో, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరం ఏర్పడే ప్రమాదం ఉంది..

cbn polavaram 02032018 2

కేంద్రం, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది అని, మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం, బీజేపీతో పోరాడటం చూస్తున్నాం.. మరో పక్క కేంద్రం, ఏ మాత్రం మన ఆందోళన పట్టించుకోవటం లేదు... దీంతో, ఏ నిమషం అయినా, చంద్రబాబు ఎన్డీయేలో నుంచి బయటకు వచ్చే వాతావరణం ఉంది... మిత్రపక్షంగా ఉంటేనే, అరాకోరా నిధులతో కేంద్రం విదిలిస్తుంది... అలాంటింది, చంద్రబాబు బయటకు వచ్చేస్తే, పరిస్థితి ఊహించుకోవచ్చు... పోలవరం జాతీయ ప్రాజెక్ట్... కేంద్రం డబ్బులు ఇవ్వాలి అది మన హక్కు... కాని కేంద్రం కావాలని లేట్ చేసిన కొద్దీ, ప్రాజెక్ట్ లేట్ అయిపోతూ ఉంటుంది.. ఎందుకుంటే ఇదే కీలక సమయం.. జూన్ లోపు సాధ్యమైనంత ఎక్కువ పని చెయ్యాలి... వర్షాలు పడటం మొదలైతే, పని సాగదు...

cbn polavaram 02032018 3

అందుకే, ఎటు పోయి, ఎటు వస్తుందో అనే ఉద్దేశంతో, చంద్రబాబు పోలవరం విషయంలో, మొత్తం కేంద్రం పై ఆధార పడకుండా, ప్రాజెక్ట్ పుర్తవటం కోసం, ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌(2018-19)లో సాగునీటి రంగానికి, దాదాపు రూ.24 వేల కోట్లు ఇవ్వనున్నారు. ఇందులో ఒక్క పోలవరం ప్రాజెక్టుకే అత్యధికంగా రూ.13 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి... అంటే, ఒక వేళ కేంద్రం సరైన సమయంలో స్పందించకపోయినా, రాష్ట్రం ముందు ఖర్చు చేసి, తరువాత మన హక్కుగా రావల్సిన డబ్బులు తీసుకుంటుంది... భూపరిహారం, ఎలాగూ 33 వేల కోట్లు కేంద్రమే ఇవ్వాలి... అందుకే ముందుగా ప్రాజెక్ట్ అయినా పూర్తి చెయ్యాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు... ఇప్పుడు కనుక ట్రాక్ తప్పితే, ఇక పోలవరం ఎప్పటికి అవుతుందో చెప్పలేము.. అందుకే, చంద్రబాబు కేంద్రంతో వైరం వచ్చినా, ముందు ప్రాజెక్ట్ ఆగిపోకుండా, ఇబ్బంది లేకుండా ఉండటానికి, ముందు చూపుతో ఆలోచించి, రాష్ట్ర బడ్జెట్ లోనే, పోలవరం ప్రాజెక్ట్ కు 13 వేల కోట్లు కేటాయిస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో, పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్రంతో పోరాడి మరీ సాధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అధికారులు.. రైతులకి నీరు ఇవ్వటం కోసం, ప్రతి సంవత్సరం కొట్లాడుతూనే ఉన్నారు... తాజాగా మరో సారి, తెలంగాణా అధికారులతో కోట్లాడి మరీ నీరు సాధించారు... నాగార్జున సాగర్‌ కుడికాల్వకు నీటి విడుదలపై ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు, గత మూడు సంవత్సరాలుగా పంతం నేగ్గించుకుంటున్నారు. కృష్ణా బోర్డుని ఒప్పించి మరీ, తెలంగాణ అధికారుల చేత గురువారం 2వేల క్యూసెక్కుల నీటిని కుడి కాల్వకు విడుదల చేపించారు ఏపి అధికారులు.

ap wate 02032018 2

రాష్ట్ర విభజన అనంతరం 2015ఫిబ్రవరి 11న నీటి కోసం సాగర్‌ ప్రధాన డ్యాంపై ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖాధికారులు, పోలీసులు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. తర్వాత 2017 మే 1న కుడి కాల్వకు కేటాయించిన కోటా పుర్తవకుండానే నీటి విడుదలను తెలంగాణ అధికారులు నిలిపివేయ గా, ఏపీ అధికారులు మరోసారి గొడవకు దిగారు. ఈ రెండు సార్లు, ఏపి అధికారులు, కృష్ణా నది బోర్డుతో పోరాడి, నీరు విడుదుల చేసుకున్నారు.. తాజాగా బుధవారం మరోసారి ఇలాంటి గొడవే జరిగింది.

ap wate 02032018 3

తెలంగాణా అధికారులు నీరు ఆపెయ్యటంతో, ప్రధానడ్యాంపై ఉన్న కంట్రోల్‌రూంకు వచ్చిన ఏపీ అధికారులు మరో రెండు రోజు లు నీటి విడుదల కొనసాగించాలంటూ వాగ్వాదానికి దిగారు. దీని పై మరో సారి ఏపి అధికారులు కృష్ణా బోర్డును సంప్రదించగా, 2వేల క్యూసెక్కుల చొప్పున ఐదు రోజులు నీరు విడుదల చేయాలని సూచించింది... ఈ మేరకు గురువారం ఉదయం 9 గంటల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు... ఈ విధంగా, గత మూడు సంవత్సరాల నుంచి, నీటి కోసం, ఏపి అధికారులు తెలంగాణాతో పోరాడుతూనే ఉన్నారు..

నార్త్ ఇండియాలో, విజయ విహారం చేస్తూ, అన్ని రాష్ట్రాలు కైవసం చేసుకుంటూ వస్తున్న, మోడీ, అమిత్ షా లకు సౌత్ ఇండియాలో మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి... కొద్దో గొప్పో ఆసలు ఉన్నది కర్ణాటకలో మాత్రమే... కర్ణాటక రాష్ట్రానికి షడ్యుల్ ప్రకారం మే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది... అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో, కర్ణాటకలో బీజేపీ గెలిచే అవకసామే లేదు... దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కూడా... అయితే కర్ణాటకలో గెలిచి, దక్షిణ భారత దేశంలో, మిగతా రాష్ట్రాల్లో పట్టు సాధించాలానేది అమిత్ షా, మోడీ ఆలోచన... కాని ఆ పరిస్థితి ఏ మాత్రం కనిపించటం లేదు... ఎలక్షన్స్ జరుగుతున్న కర్ణాటకలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది...

karnataka 02032018 3

అవినీతి పై పోరాటం అంటూ, గాలి జనార్ధన్ రెడ్డి, ఎడ్యురప్ప లాంటి అవినీతి నేతలకు ముందు పెట్టి, ఎలక్షన్స్ కు వెళ్తున్నారు మోడీ, అమిత్ షా... అలాగే దక్షినాది రాష్ట్రాల పై, మోడీ చూపిస్తున్న సవతి ప్రేమ కూడా, ప్రజల ఆగ్రహానికి కారణం అయ్యింది... మరో పక్క, పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వారు, అసలు బీజేపీకి వోట్ వేసే పరిస్థతి లేదు... బీజేపీ కి బుద్ధి రావాలంటే, కాంగ్రెస్ కైనా వేస్తాం అనే స్థాయిలో, కర్నాటకలోని తెలుగు ప్రజల మూడ్ ఉంది... ఇవన్నీ చూస్తుంటే, బీజేపీ ఓడిపోతుంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.. ఇక్కడ ఓడిపోతే, దాని ఎఫెక్ట్ మోడీ, షా పై పడుతుంది..

karnataka 02032018 2

అందుకే మోడీ, షా, మొదటి సారి ఎలక్షన్స్ అంటే భయపడుతున్నారా అంటే ? అవును అనే సంకేతాలు వస్తున్నాయి... కర్ణాటక ఎలక్షన్స్ ఆరు నెలలు పాటు వాయిదా వెయ్యటానికి సహకరించమని కేంద్రం, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి... వన్ నేషన్, వన్ ఎలక్షన్ లో భాగంగా, నవంబర్ దాకా కర్నాటక ఎలక్షన్స్ వాయిదా వేస్తె, ఆరు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలకు ఒకేసారి వెళ్ళవచ్చు అనేది ఆ లేఖ సారంశం... రాష్ట్రాల అంగీకారం ప్రకారం, ఎలక్షన్ కమిషన్ కు కేంద్రం తెలియచేయ్యనుంది... కాని, దీని పై కర్ణాటక ప్రభుత్వం, స్పందించలేదు అనే కధనాలు వస్తున్నాయి... అయితే, దీని వెనుక, ప్రస్తుతం కర్నాటకలో పరిస్థితి బాగోలేదు కాబట్టి, కొన్నాళ్ళు ఎన్నికలు జరగకుండా మోడీ, షా ప్లాన్ చేసినట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి... మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికలు కూడా, వరదలు వంక చూపించి, కొన్ని నెలలు వాయిదా వేసిన సంగతి గుర్తుకు తెచ్చుకుంటున్నారు...

ఎదో ఒక చిన్న ఊరట.. ఈ నిర్ణయం వల్ల, ప్రజలకు పెద్దగా ఒరిగేది ఏమి లేకపోయినా, మన రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఒక చిన్న విభజన హామీ నెరవేర్చింది కేంద్రం... రూ.219 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గురువారం కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం తెలంగాణకు చెందిన క్రమం లో ఏపీలో కొత్తగా గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 9(3)లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల మధ్య చర్చోపచర్చల తర్వాత ఒక యూనిట్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదించింది.

center 02032018 2

దీని ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా నిధులు ఇవ్వాలని, యూనిట్‌ ఏర్పాటుకు అవసరమైన మౌలికసదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పనకు సహకరించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. రూ.858.37 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టడానికి DPRను కేంద్ర హోంశాఖకు పంపింది. అదే సమయంలో పోలీసు ప్రధాన కార్యాలయం, పోలీసు విభాగానికి సంబంధించిన ఇతర అవసరాల కోసం 2014లోనే రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు డివిజన్‌లో 2700 ఎకరాల భూమిని గుర్తించింది.

center 02032018 3

ఈ నేపథ్యంలో అమరావతిలో 250 ఎకరాల విస్తీర్ణంలో 2 యూనిట్లుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. కాగా, రాష్ట్రంలో పూర్తిస్థాయి శిక్షణ కేంద్రం లేకపోవడం వల్ల విశాఖపట్నంలో ఉన్న గ్రేహౌండ్స్‌ ఆపరేషనల్‌ హబ్‌లోనే శిక్షణ తదితర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో కేంద్ర హోంశాఖ అధికారుల బృందం హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ కేంద్రానికి వచ్చి ఈ అంశంపై చర్చించింది. తర్వాత 2016 డిసెంబరులో ఆ బృందం ఏపీలో పర్యటించి గ్రేహౌండ్స్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు భూముల వివరాలివ్వాలని విజ్ఞప్తి చేసింది.

Advertisements

Latest Articles

Most Read