కేంద్రం మరోసారి ఆంధ్రప్రదేశ్ పై ఎదో చేసేస్తున్నాం అనే హడావిడి వాతావరణం క్రియేట్ చెయ్యటానికి ప్రయత్నిస్తుంది... మార్చ్ 5 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో, తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేస్తామనటం, మరో పక్క వివిధ సంఘాలు ఆందోళనలు తీవ్ర తరం చెయ్యటంతో, కేంద్రంలో కొద్దిగా చలనం వచ్చింది... ఇది సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా తీసుకు వెళ్తాయో లేక, ఎదో చేసాం అని చెప్పటానికో తెలియదు కాని, ఆంధ్రప్రదేశ్ పై ఎమర్జెన్సీ మీటింగ్ అంటూ ఢిల్లీలో మీడియాకు లీకులు ఇస్తున్నారు...

meeting 01032018 2

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో టీడీపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ భేటీలో టీడీపీ డిమాండ్ల పై సుదీర్ఘ చర్చించినట్లు తెలుస్తోంది. రైల్వే జోన్‌తో పాటు, పలు డిమాండ్లను పరిష్కరించాలని, అమిత్‌ షాను టీడీపీ ప్రతినిధులు కోరారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆందోళనను కూడా రామ్మోహన్‌నాయుడు వెంకయ్యకు, అమిత్ షా కు వివరించారు.

meeting 01032018 3

సిఐఐ సమ్మిట్ లో పాల్గునటానికి, వైజాగ్ వచ్చిన వెంకయ్యతో, చంద్రబాబు చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి... ఏదైనా సరే, సమస్యలు పరిష్కరిస్తేనే, కేంద్రంతో సఖ్యత ఉంటుంది అని, లేకపోతే ఆందోళన కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పినట్టు వార్తలు వచ్చాయి.. వెంకయ్య కూడా, కేంద్రంతో ఘర్షణ వాతావరణం మంచింది కాదని, నేను చొరవ తీసుకుని, సాధ్యమైనంత వరకు, సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తాను అని చెప్పారు.. దానికి కొనసాగింపుగా, వెంకయ్య ఈ సమావేశం పెట్టారు... వెంకయ్య గారికి మన రాష్ట్రం కోసం, ఎదో చెయ్యాలి అనే తపన ఉన్నా, అమిత్ షా, మోడీ ఇష్టంతోనే ఏదైనా జరుగుతంది కదా... మరి ఈసారి ఏమి చేస్తారో ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రాష్ట్ర సంపద దోచేసి, చివరకు 11 సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో A1గా ఉండి, 16 నెలలు జైలు జీవితం అనుభవించి, బెయిల్ పై బయట తిరుగుతున్న జగన్ మోహన్ రెడ్డి, ప్రతి శుక్రవారం ఎక్కడ ఉన్నా, హైదరాబాద్ నాంపల్లి కోర్ట్ కి వెళ్తున్న సంగతి తెలిసిందే.. అయితే, ఇప్పుడు జగన్ ప్రతి శుక్రవారం నాంపల్లి దాకా వెళ్ళాల్సిన పని లేదా ? నాంపల్లి బదులు విజయవాడ వస్తే చాలా ? సుప్రీమ్ కోర్ట్ చెప్పిన దానికి, రాష్ట్ర ప్రభువం ఏమి చేసింది ? వీటి గురించి తెలుసుకోవాలంటే, ఇది చదవాల్సిందే... ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ కేంద్రంగా దీన్ని నెలకొల్పనుంది.

jagan court 01032018 2

ఆంధ్రప్రదేశ్ భూభాగ మంతా ఈ ప్రత్యేక న్యాయస్థానం పరిధిలోకి వస్తుంది. దీని కోసం కొత్తగా ఒక జిల్లా జడ్జి పోస్టు సహా మొత్తం 29 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వీరికి వేతనాల కింద ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు కానుంది. దేశవ్యాప్తంగా నేరారోప ణలు ఎదుర్కొంటున్న 1,581 మంది శాసనకర్తల పై విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించగా.. దేశవ్యాప్తంగా 12 చోట్ల వాటిని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు 14వ తేదీన సుప్రీంకోర్టుకు వివరించింది. అయితే 2018 మార్చి ఒకటో తేదీలోగా ఆ న్యాయస్థానాలన్నీ పనిచేసేటట్లు చూడాలని సుప్రీం అదే రోజు ఆదేశించింది.

jagan court 01032018 3

ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక న్యాయస్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసింది. ఒక్కో న్యాయస్థానం ఏడాదికి 165 కేసులు పరిష్కరించేం దుకు వీలుగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి దుప్పల వెంకటరమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులు తమ పరిధిలోని కేసుల్లో నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను విడదీసి ఈ ప్రత్యేక న్యాయస్థానాలకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే జగన్ వెళ్ళేది, నాంపల్లి సిబిఐ కోర్ట్ కాబట్టి, జగన్ కేసు కూడా ఈ ప్రత్యెక న్యాయస్థానానికి బదిలీ చేస్తారా అనేది చూడాలి... ఎందుకంటే, సిబిఐ కేసులు కూడా, దశాబ్దాల తరబడి విచారణలో ఉన్న విషయం చూసాం... మరి జగన్ కేసు కూడా విజయవాడకు పంపిస్తారో లేదో చూడాలి...

జగన్ పార్టీలో ఉంటే ఆ మాత్రం ఉండాలి మరి.. పైగా ఎంపీ... జగన్ కి బాగా దగ్గర... మరి కనీసం జగన్ స్థయికి మ్యాచ్ అవ్వాలి కదా... జగన్ స్థాయి చుస్తే, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు.. 16 నెలలు జైలు... మరి ఆ నాయకుడు స్థాయిని మ్యాచ్ అవ్వాలి కదా... అందుకే, వాళ్ళ పార్టీ నాయకులు, ఎంపీలు, ఎమ్మల్యేలు కూడా పాకులాడుతు ఉంటారు... జగన్ ద్రుష్టిలో పడాలి అంటే, ఎదో ఒక కేసు ఉండాల్సిందే.. ఇక పార్టీ టికెట్ ఆశించే వారు అయితే, కావాలని కేసుల్లో ఇరుక్కుని మరీ, జగన్ దృష్టిలో పడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు... అప్పుడే వారు జగన్ ఫాలోవర్స్ అవుతారు, అది వైఎస్ఆర్ పార్టీ అవుతంది.. అదే కోవలో, వైసీపీ ఎంపీనే కాదు, ఆయన కుటుంబం కూడా ఇరుక్కుంది...

ycp 01032018 2

వైసీపీ ఎంపీ మేకపాటి కుటుంబానికి కోర్ట్ లో మొట్టికాయలు పడ్డాయి... హైదరాబాద్‌ కోర్టులో, ఈ రోజు మేకపాటి కుటుంబానికి, రూ.1.73 కోట్ల చెక్‌బౌన్స్‌ కేసు ఒకటి విచారణ జరిగింది... ఎన్ని సార్లు నోటీసు ఇచ్చినా, ఈ కేసు విచారణకు హాజరుకాకపోవడంతో మేకపాటి కుటుంబానికి కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది... కోర్ట్ పదే పదే పిలిచినా, రాకపోవటం పై, సీరియస్ అయిన కోర్ట్, వారి పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది...

ycp 01032018 3

మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, మేకపాటి అభినవ్ రెడ్డి, మేకపాటి అభిషేక్ రెడ్డి, మేకపాటి శ్రీదేవి, ఆదాల రచనారెడ్డి, పుపకం మధుసూదన్ రెడ్డి, కొండా దేవిశ్రీప్రసాద్, సదాత్ హుస్సేన్, సురేంద్రనాథ్‌పై న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసింది... వీరందరూ ఎక్కడ ఉన్నారో తెలియాల్సి ఉంది... అయితే, వారెంట్ కొట్టేయించుకునేందుకు అఫిడవిట్ వెయ్యటానికి, మేకపాటి కుటుంబానికి చెందినా లాయర్లు ప్రయత్నిస్తున్నారు...

ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, పాదయత్ర స్టైల్ గురించి అందరికీ తెలిసిందే... వారానికి ఒక రోజు, శుక్రవారం కోర్ట్ కి పోవాలి.. అందుకోసం గురువారం మధ్యాహ్నం నుంచే మనోడు జంప్ అవుతాడు... గట్టిగా నడిచేది 5 రోజులు... మళ్ళీ మధ్యలో పండుగలు అని, అదని, ఇదని, హాలిడే తీసుకుంటాడు... అయితే పోయిన వారం, గురువారం ఉదయమే హైదరాబాద్ చెక్కేసాడు... రెండు రోజులు హాలిడే తీసుకున్నాడు... పోయిన శుక్రవారం విచారణలో, కేసు వాయిదా పడిన సందర్భంలో, జడ్జి గారు, మళ్ళీ వాయిదా, మర్చి 9 కి వాయిదా వేసారు... అంటే, రేపు మర్చి 2న సెలవు లేదు... దీంతో మనోడికి గుండెల్లో గుబులు మొదలైంది...

jagan tent 01032018 2

అలవాటు పడిన ప్రాణం... ఒక్క రోజున్నా రెస్ట్ తీసుకోకపోతే ఉండలేడు... అందుకే సెలవు కోసం ఒక ప్లాన్ వేసాడు... కేంద్రం అన్యాయం చేస్తుంది అంటూ, ఈ రోజు కలెక్టరేట్ ల ముట్టడి అని పిలుపు ఇచ్చారు... అందుకే, అందరూ గట్టిగా కలెక్టరేట్ ల ముట్టడి అంటూ ఈ రోజు పాదయాత్రకి హాలిడే ప్రకటించారు.. సరే, కేంద్రం మీద పోరాటం కదా, తప్పేముందిలే అని అనుకున్నారు అందరూ... జగన్ కూడా, ఇరగ దీసుకుని ఆందోళన చేస్తారేమో అని ఊహించారు... తీరా చుస్తే, సీన్ వేరేలా ఉంది..

jagan tent 01032018 3

అందరినీ కలెక్టరేట్ ల ముట్టడి చెయ్యమని పంపించి, మనోడు నిన్న రాత్రి టెంట్ లో కి వెళ్లి, ఇప్పటి వరకు బయటకు రాలేదు... ఎంతటి వారు వెళ్ళినా నో పర్మిషన్... పోనీ ఫ్యామిలీ ఏమన్నా వచ్చిందా అంటే ఇదీ లేదు... అర్జెంటు అయ్యా, కొంచెం మాట్లాడాలి అని, ఒక సీనియర్ నేత వెళ్తే, రేపు రమ్మని సెక్యూరిటీ పంపించి వేసారు... ఇది జగన్ తీరు... పాదయాత్రకి సెలవు కోసం,ఇది ఒక వంక... నిజంగా తనకి కేంద్రం పై పోరాటం చెయ్యాలనే చిత్తసుద్ధి ఉంటే, తన పార్టీ వారితో కలిసి ఆందోళన చేసే వాడు... మోడీ ఏమన్నా అంటాడు, అమిత్ షా తిడతాడు అని భయంతో, ఆందోళన పిలుపిచ్చి టెంట్ లో దూరాడు...

Advertisements

Latest Articles

Most Read