గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ ఆంధ్రా వాడి ఆక్రోశాన్ని పార్లమెంట్ వేదికగా దేశానికి వినిపించి, మాకు ఇంత అన్యాయం చేస్తావా, సమాధానం చెప్పండి ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’అంటే, రాష్ట్ర బీజేపీ నాయకులకి, చించేసుకున్నారు... మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని సంబోధించి ఘన కార్యం సాధించినట్టు భావిస్తున్నారు! జాగ్రత్తగా మాట్లాడండి అంటూ బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్‌రాజు, అలాగే కొత్తగా మీడియా ముందు పేలుతున్న విష్ణు వర్ధన్ రెడ్డి అనే పోటుగాడు, సోము వీర్రాజు అనే మహా వీరుడు, మరి కొంత మంది రాష్ట్ర బీజేపీ నాయకులు హడావిడి చేసారు...

kcr 27022018 2

అదే ఎదో పెద్ద తిట్టులాగా పీక్కున్నారు... మర్యాదగా 'మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ', మా సంగతి ఏంటి అంటే, అది తప్పుగా అనిపించింది... అయితే, నిన్న తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, నరేంద్ర మోడీని పట్టుకుని, ఒక బహిరంగ సభలో "మోడీ గాడు" అని అన్నారు... "ప్రధాని మోడీ గాడికి, చాలా సార్లు చెప్పా, కాని వినలేదు" అంటూ, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, ఒక ప్రధానిని, బహిరంగ మీటింగ్ లో, గాడు గీడు అంటుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులకు వినపడలేదు...

kcr 27022018 3

విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు, హైదరాబాద్ లో ఉండే విష్ణు వర్ధన్ రెడ్డి లాంటి వారికి, కెసిఆర్ ని ప్రశ్నించే దమ్ము లేదు... మరో పక్క, కొన్ని రోజుల క్రిందట వైసిపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడి కూడా "మోడీని బట్టలు ఊడదీసి కొడతాం" అని ప్రెస్ మీట్ లో చెప్తే, ఒక్క బీజేపీ నాయకుడు కూడా దాన్ని ఖండించలేదు... అలాంటింది, గల్లా జయదేవ్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే మాత్రం, ఓ పీకేసుకున్నారు... పీక్కోవలసిన చోట పీక్కుంటే, ఏమన్నా అర్ధముంటుంది... ప్రజల ఆక్రోశాన్ని మర్యాదగా వాడే భాషలో చెప్తే, దాన్ని కూడా తప్పు బడితే, ప్రజలే సరైన సందర్భాలో పీకుతారు...

విశాఖ విపత్తుల నగరం... హుద్ హుద్ పెను తుపాను తరువాత నగర ప్రజల్లో విపత్తుల పై భయాందోళనలు తలెత్తడం ప్రారంభమైంది. నగరం పై ప్రకృతి కన్నెర్ర చేస్తే ప్రజలను అప్రమత్తం చేయడానికి అనువుగా, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న కేంద్రమే జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎల్ అండ్ టి కంపెనీ రూ. 120 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్. దీనిని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు... దీని సేవల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరగనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదాలు, విపత్తుల సమయంలో నగరం పై పూర్తిస్థాయి పట్టు, నియంత్రణ సాధ్యమయ్యే కేంద్రాన్ని గత ఏడాది కాలంగా స్మార్ట్ సిటీ ప్రతినిధులు కష్టపడి తయారు చేశారు.

vizag rtgc 27022018 2

ప్రస్తుతానికి ఏడు సేవలు అందుబాటులోకి... విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్య అధికమైంది. నగరీకరణ నేపథ్యంలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో తరచూ జరిగే ప్రమాదాలతో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వాటి నివారణ కోసం మహా విశాఖ నగరంలో 65 ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 200 మీటర్ల వరకు స్పష్టంగా వాహనాల నెంబర్లను సైతం పసిగట్టగలిగే సీసీ కెమెరాలతో దూకుడుగా వెళ్లే వాహన చోదకులను పట్టుకుని, వారి నుంచి అపరాధ రుసము వసూలు చేస్తారు. సిగ్నల్ జంపింగ్ చేసేవారి వాహన సంఖ్య ఆధారంగా జరిమానా చలానా ఇంటికే పంపించే వీలుంది. సీసీ కెమెరాలున్న ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తే, జరిగిన తీరును పోలీసులు చూసుకునే వీలుంటుంది.

vizag rtgc 27022018 3

అలాగే నగరంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ పోల్స్ ద్వారా, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కి అనుసంధానం చేసారు... వాటి ద్వారా, ఈ ఏడు సేవలు అందుతాయి... 1. స్మార్ట్ పోల్‌పైన 3 విద్యుత్‌ లైట్లు ఉంటాయి. ఇవి వాతావరణ పరిస్థితులను బట్టి లైటింగ్ ఇస్తాయి. అంటే రాత్రివేళ ఎక్కువ లైటింగ్ ఉంటే.. తెల్లవారుజాము నుంచి కాంతిని తగ్గించేస్తాయి. 2. స్మార్ట్ పోల్‌ కు వైఫై డివైజ్‌ అమర్చి ఉంటుంది. ఇది ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ ఇస్తుంది. 3. స్మార్ట్ పోల్‌ పైన రెండు సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవి 180 డిగ్రీల పరిధిలో దృశ్యాలను రికార్డు చేసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కి లైవ్ లో పంపిస్తాయి.. 4.స్మార్ట్ పోల్‌ పై ఎన్విరాన్‌మెంటల్‌ సెన్సర్‌ ఒకటి ఉంటుంది. ఆ స్మార్ట్ పోల్‌ ఉన్న ప్రాంతంలో గాలి, వాయు కాలుష్య తీవ్రత, ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి వివరాలు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరవేస్తుంది. 5. స్మార్ట్ పోల్‌ పై నాలుగు స్పీకర్లు ఉంటాయి. విపత్తుల సమయంలో అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడానికి, ఏదైనా అత్యవసర సమాచారం అందజేయడానికి ఇవి ఉపయోగపడతాయి. 6. ఒక ఆడ్ బోర్డు ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు బోర్డు పై ప్రకటనల కోసం కార్పొరేషన్ ను సంప్రదించవచ్చు. 7.పోల్‌పైన ఏదైనా టెలికాం సంస్థ సిగ్నల్‌ యాంటీనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ ఆయా ప్రాంతాల్లో బలహీనంగా వున్నట్టయితే ఆ పోల్‌పై యాంటీనా ఏర్పాటుచేసుకుంటే సర్వీసును మెరుగుపరుచుకోవచ్చు.

నేటితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్ళు అయిన సంగతి తెలిసిందే... 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబుకు నాయకులు, కార్యకర్తల అభినందనలు తెలిపేందుకు ఆయన నివాసానికి భారీగా తరలివచ్చారు. అలాగే చంద్రబాబు రాజకీయ జీవిత విశేషాలతో ఫొటో ఎగ్జిబిషన్‌‌ను ఏర్పాటు చేశారు. టీఎన్‌ఎస్ఎఫ్‌ కార్యకర్తలు తీసుకొచ్చిన కేక్‌‌ను సీఎం చంద్రబాబు కట్ చేశారు. తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు... ఎన్నో ఒడిదుడుకులతో 40 ఏళ్లు ముందుకు సాగానని గుర్తు చేసుకున్నారు.

cbn 40 yrs journey 27022018 2

ప్రతి ఒక్కరికీ లక్ష్యం ఉండాలి, దానికి అనుగుణంగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణల తర్వాతే దేశానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్న బాబు సంస్కరణల గురించి మొదట గట్టిగా మాట్లాడింది తానే అని చెప్పుకొచ్చారు. తాను నిత్య విద్యార్థిని, దావోస్‌కు ఒక్కడినే వెళ్తున్నానన్నారు. మారుతున్న టెక్నాలజీని అందరూ అందిపుచ్చుకోవాలని, పాత సిద్ధాంతాలనే పట్టుకొని కూర్చుకోవడం సరికాదన్నారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే తన సిద్ధాంతమని సీఎం పేర్కొన్నారు.

cbn 40 yrs journey 27022018 3

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను అందరూ తెలుసుకోవాలన్నారు. అమెరికాలో అందరూ క్రమశిక్షణగా ఉంటారని, సింగపూర్‌లాంటి దేశాల్లో క్రమశిక్షణ బాగుంటుందని చంద్రబాబు అన్నారు. తాను తొలిసారిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిధులు సరిగా ఉండేవి కాదని, ఎన్టీఆర్‌ కాలంలో పెద్ద ప్రాజెక్టులేవీ లేవని అన్నారు. ఎన్టీఆర్‌ మనందరికీ ఓ విజన్‌ నేర్పించారని చంద్రబాబు ఆనాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.

అమరావతిలో, సియం నివాసం దగ్గర ఉన్న గ్రీవియన్స్ హాల్ లో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగుతోంది... సమావేశం ప్రారంభానికి ముందు రెండు నిమిషాలు మౌనం పాటించి సినీనటి శ్రీదేవి మృతికి తెలుగుదేశం పార్టీ నేతలు సంతాపం తెలిపారు... ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు... ఏమి జరిగిందో ఏమిటో అంటూ, ఆమె ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం అరుదైన అంశమని కొనియాడారు...

cbn sridev 27022018 2

ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల యనమల, సోమిరెడ్డి, లోకేశ్‌, కాల్వ శ్రీనివాసులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అందరి మధ్య 40 కిలోల కేక్‌ను కట్‌ చేశారు. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందు ఆధ్వర్యంలో 40 పావురాలను ఎగురవేశారు.

cbn sridev 27022018 3

సమావేశంలో భాగంగా అఖిలసంఘాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది... కేంద్రం పై వివిధ పార్టీలు, సంఘాలు పోరాడుతున్న నేపధ్యంలో, వారందరినీ కూర్చోపెట్టి, కేంద్రం పై ఎలాంటి వ్యుహ్యంతో వేళ్ళలో చర్చించనున్నారు... అలాగే, అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు... ఇవి బడ్జెట్ సమావేశాలు కావటంతో, జాగ్రత్తలు చెప్పనున్నారు... ఈ సారి కూడా వైసిపీ రాకపోతే, ఎలాంటి వ్యుహ్యంతో వెళ్ళాలి, బీజేపీ ఎమ్మల్యేలు గోల చేస్తే, ఎలా డీల్ చెయ్యాలి అనే అంశాలు చర్చిస్తారు...

Advertisements

Latest Articles

Most Read