కేంద్రం, రాష్ట్రాన్ని అన్యాయం చేసిందయ్యా అని రాష్ట్రమంతా, కేంద్రం పై తీవ్ర ఆగ్రహంగా ఉంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, వారి గొయ్య వారే తవ్వుకున్తున్నారు... అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వారు కూడా, ఇక్కడ ప్రజల మనోభావాలు లెక్క చెయ్యకుండా, ఢిల్లీకి, సోనియాకి గులాంగిరీ చేస్తే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో చూసాం... ఇప్పుడు, అదే తప్పు రాష్ట్ర బీజేపీ చేస్తుంది...ఒక పక్క, ప్రజలకి స్పష్టంగా, మోడీ చేసిన దుర్మార్గం కనిపిస్తుంటే, ఇది తెలుగుదేశం - బీజేపీ సమస్యగా రాష్ట్ర బీజేపీ చూస్తుంది... ఇదే వైఖరితో, ఈ రోజు ఏపీ బీజేపీ పదాదికారుల సమావేశం అంటూ విజయవాడలో హడావిడి చేసారు...
మిత్ర ధర్మానికి టీడీపీ తూట్లు పొడిచిందని, ఏపీలో బీజేపీని ముద్దాయిని చేసింది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారట.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, మిత్రపక్షం తమపై చేస్తున్న దాడిని తిప్పికొడతామని అన్నారు. విభజన హామీలు అమలు చేసేందుకు చాలా సమయం ఉందని, సంక్షేమ పథకాల మొత్తాలను రెవెన్యూ లోటులో కలపడం సరికాదని అన్నారు... ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని సంబోధిస్తూ, గల్లా జయదేవ్ చేసిన ప్రసంగం కూడా, బీజేపీ నేతలకు బాగా కాలినట్టు ఉంది... దీని పై కూడా, బాగా పెక్కున్నట్టు సమాచారం...
అలాగే, 014లో ప్రకటించిన మేనిఫెస్టోను ఏ మేరకు అమలు చేసిందనే అంశాన్ని అధ్యయనం చేయడానికి బీజేపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.! బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి నేతృత్వంలో అధ్యయం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీని నిలదీసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏపీలో ఉన్న రెండు మంత్రి పదవులకు రాజీనామా చేయాలని, ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానం చేసినట్టు సమాచారం..... ఇవన్నీ బాగానే ఉన్నాయి, మీరు మీరు కొట్టుకు చావండి... ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం చెయ్యల్సిన సాయం గురించి ఏంటయ్యా అంటే, ఒక్క బీజేపీ నాయకుడు దాని గురించి మాట్లాడరు...