ఫాక్షన్ పార్టీ, ఫాక్షన్ బుద్ధి మరోసారి బయట పెట్టుకుంది... వైఎస్ఆర్ పార్టీకి చెందిన A2 విజయసాయి రెడ్డి, ప్రాంతాల వారిగా టార్గెట్లు ఇచ్చి మరీ, మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు... వారం క్రితం కూడా, విజయసాయి ఇలాగే రెచ్చిపోయారు.... నేను త్వరలోనే కేంద్ర మంత్రిని అవుతున్నా, ఇద్దరు అధికారుల సంగతి తేలుస్తా అంటూ, రెచ్చిపోయిన విజయసాయి, ఈ రోజు, మరింత ముందుకెళ్ళి, మరి కొంత మంది పేర్లు చెప్పి, వారి పై మేము అధికారంలోకి రాగానే కక్ష తీర్చుకుని తీరతాం అంటూ వార్నింగ్ లు ఇస్తున్నాడు...

vijayasyi 18022018 2

ఉత్తరాంధ్రలో కళావెంకటరావు, రాయలసీమలో టీజీ వెంకటేశ్‌తో పాటు, గురజాల ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు, సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావుల సంగతి, ముఖ్యమంత్రిగా 'జగన్‌' ప్రమాణస్వీకారం చేసిన అరగంటనేలోనే చూస్తామని విజయసాయి రెచ్చిపోయారు... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం, నేను కేంద్ర మంత్రి అవ్వటం ఖాయం, అవ్వగానే వీరి సంగతి చెప్తా అంటూ, విశాఖపట్నంలోని ఈ వ్యాఖ్యలు చేసారు...

vijayasyi 18022018 3

ఈ వార్నింగ్ లు చూసి, ప్రజలు నోటితో కాకుండా, మరో దేంతోనో నవ్వుతున్నారు... ఈయన అధికారంలోకి వచ్చేది ఎప్పుడు, కక్ష తీర్చుకునేది ఎప్పుడు.. అయినా, ఈయన కక్ష తీర్చుకుంటూ ఉంటే, అవతలి వారు చూస్తూ ఊరుకుంటారా ? ఇది ప్రజాస్వామ్య దేశం కాదా ? కోర్ట్ లు, చట్టాలు లేవా ? 11 కేసుల్లో A2గా ఉన్న వ్యక్తి, ఇలా బహిరంగంగా, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులని, మంత్రుల్ని బెదిరిస్తున్నాడు అంటే, ఇలాంటి వాడి చేతికి అధికారం ఉంటే, ఈ రాష్ట్రాన్ని ఏమి చేస్తారో, ఊహకే అందని విషయం... ఇలాంటి వారి మాటలు, కోర్ట్ లు కూడా సుమోతోగా తీసుకుని, క్రిమినల్ కేసులు పెట్టి, లోపల వెయ్యాలి...

జగన్ కు దేంట్లో గోల్డ్ మెడల్ వస్తుంది అని ఆలోచిస్తున్నారా ? ఇంకా మనోడికి దేంట్లో వస్తుంది... బాగా ఆరి తేరిన విధ్యలోనే... ఇప్పటికే ఆయనపై 11 సీబీఐ, రెండు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) చార్జిషీట్లు ఉన్న జగన్ పై, కొత్తగా ఈడీ చార్జిషీటు మరొకటి తోడయింది... జగన్‌ కంపెనీల్లో ఇందూ టెక్‌ జోన్‌పెట్టుబడులకు సంబంధించి దాఖలు చేసిన ఫిర్యాదు (అభియోగ పత్రం)ను గురువారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇందులో ప్రధాన నిందితులైన వైఎస్‌ జగన్‌తో పాటు, A2 విజయసాయిరెడ్డితో పాటు మరికొందరికి కోర్టు సమన్లు జారీ చేసింది... వచ్చేనెల 16న నిందితులు, ఆయా సంస్థల ప్రతినిధులు స్వయంగా కోర్టుకు రావాలని ఆదేశించింది...

jagan 180222018 2

జగన్‌ కంపెనీల్లో ఇందూటెక్‌ పెట్టుబడులపై సీబీఐ సమర్పించిన చార్జిషీట్‌ ఆధారంగా ఈడీ కూడా విచారణ చేపట్టింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఈ పెట్టుబడులు వచ్చినట్లు నిర్ధారించింది. ఈడీ అభియోగాల ప్రకారం... ‘ఇందూ’ శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన ఇందూ కన్సార్షియానికి అర్హతలు లేకపోయినా అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 250 ఎకరాలను కేటాయించింది. ఈ సెజ్‌ ప్రాజెక్టును అప్పగించేందుకు అప్పటి ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ బీపీ ఆచార్య ప్రభుత్వానికి సిఫారసు చేశారు.

jagan 180222018 3

అలాగే, 100 ఎకరాలు శ్యాంప్రసాద్‌రెడ్డి కుమారుడు దయాకర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఎస్పీఆర్‌ ప్రాపర్టీ్‌సకు బదిలీ చేశారు. ఈ భూమిని కేటాయించినందుకు ప్రతిఫలంగా ఇందూ శ్యాంప్రసాద్‌ రెడ్డి జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో రూ.50 కోట్లు, కార్మెల్‌ ఏషియాలో రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇందులో కొంత మొత్తాన్ని నిమ్మగడ్డకు చెందిన సంస్థల ద్వారా సూట్‌కేస్‌ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టారు. ఇవి మనీలాండరింగ్‌ నిరోధక చట్టం నిబంధనలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్‌ నిరోధక చట్టం సెక్షన్‌ 3,4 నిందితులను శిక్షించాలని ఈడీ తన చార్జిషీటులో కోరింది.

 

ఒక పక్క కేంద్రం పై, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన బాట పట్టిన వేళ, మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ బహిరంగ విమర్శలు చేస్తున్న వేళ, కేంద్రం నుంచి అనూహ్యమైన వర్తమానం వచ్చింది... ఒక పక్క, ఇక్కడ విభజన హామీల్లో రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన సాయం గురించి మాట్లాడుతుంటే, కేంద్రం పంపించన వర్తమానంతో, రాష్ట్ర అధికారులు అవాక్కయారు...‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీ రాష్ట్రానికి రావాలనుకుంటున్నారు! ప్రధాని స్థాయిలో ప్రారంభించాల్సిన, శంకుస్థాపన చేయాల్సిన పథకాలు, ప్రాజెక్టులు ఏవైనా సిద్ధంగా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పండి’’అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పియంఓ ఆఫీస్ వర్తమానం పంపించింది...

modi 17022018 3

శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో ఉండగా ఢిల్లీ నుంచి అందిన సమాచారాన్ని అధికారులు తెలియచేశారు.... అయితే కేవలం ప్రరంభోత్సవాలకే వస్తారా, లేకపోతే ఏమన్నా నిధులు ఇస్తాం అని ప్రకటిస్తారా, లేక అమరావతి వచ్చినప్పుడు ఇచ్చిన నీళ్ళు, మట్టి తీసుకువస్టారా అనేది చూడాల్సి ఉంది... ఒకవేళ ప్రధానమంత్రి వస్తే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే లోపు ముందు వస్తారా? తర్వాత వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే... 5వ తేదీలోపే ప్రధాని వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది...

modi 17022018 2

అమరావతికి ప్రధాని వస్తున్నప్పుడు, ప్రధాని నవ్యాంధ్రకు వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారు. ఆశగా ఎదురు చూశారు. కానీ... ఆయన మొండిచేయి చూపించారు. అప్పుడే దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు... ప్రజల్లో మరోసారి ఆగ్రహం రగులుతున్న సమయంలో రాష్ట్రానికి వస్తామంటున్నారు... ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఫలితం ఉండదు అనే భావన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. పైగా... రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంతో కలిసి ఇదంతా చేసిందనే సంకేతాలు వెళతాయి అని ప్రభుత్వం భావిస్తోంది... రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారు? ఎంత సహాయం చేస్తారు? ఎలా, ఎప్పుడు చేస్తారు? అనే అంశాలపై ముందే స్పష్టత తీసుకోవాలని... ఆ తర్వాతే, ఆయనకు అధికారికంగా ఆహ్వానం పంపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం బెంగుళూరు చేరుకున్నూరు... సాయంత్రం అక్కడ జరిగిన హడిల్ 2018 కార్యక్రమంలో చంద్రబాబు పాల్గున్నారు... ది హిందూ అధ్వర్యంలో జరిగిన ఈ కాంక్లావ్ లో ముఖ్యమంత్రిని, NDTV మ్యనిజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ జైన్ ఇంటర్వ్యూ చేసారు, అదే సందర్భంలో, అక్కడకు వచ్చిన ఇన్వెస్టర్స్ ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధనం చెప్పారు... ముఖ్యంగా, బీజేపీతో సంబంధాల పై, అమరావతి నిర్మాణం పై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి... అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వివిధ విప్లవాత్మిక కార్యక్రమాల పై కూడా చర్చలో డిస్కషన్ జరిగింది...

cbn hindu 17022018 2

బీజేపీతో సంబంధాల పై చంద్రబాబు స్పందిస్తూ, విభజన జరిగిన విధానం పై చెప్పారు... రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే భాజపాతో ఆ రోజు పొత్తుపెట్టుకున్నట్టు తెలిపారు. విభజన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపులేకపోతున్నామని.. నవనిర్మాణ దీక్ష చేస్తున్నామన్నారు. హక్కుల కోసం ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ఇది ఐదు కోట్ల జనాభాకు, కేంద్రానికి సంబంధించిన విషయమని తెలిపారు. హామీలన్నీ నెరవేర్చాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున డిమాండ్‌ చేస్తున్నానని అన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నామని చంద్రబాబు అన్నారు. హేతుబద్ధతతో విభజన జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు.

cbn hindu 17022018 3

ఇదే సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఎంత వరకైనా వెళ్తాను అని ఇప్పుడే గుంటూరులో చెప్పి వచ్చారు, దీని మీద మీ కామెంట్ ఏంటి అని అడగగా... చంద్రబాబు స్పందిస్తూ, నేను గుంటూరు నుంచి ఇక్కడ వరకు బెంగుళూరు వచ్చాను, ఎందుకు వచ్చాను ? ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉంటారు, నా స్టేట్ ని ప్రమోట్ చేసుకోవచ్చు అని వచ్చాను... దావోస్ వెళ్తున్నాను, వివిధ దేశాలు తిరుగుతున్నాను, 24 గంటలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నాను... ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను ? ముందు రాష్ట్రం, తరువాతే ఏదైనా, ఎంత వరకైనా వెళ్తాను, ఎంత వరుకైన కష్టపడతాను అని చంద్రబాబు చెప్పారు... ఈ మాటలతో, అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్, మీడియా ప్రతినిధులు, వివిధ డిగ్నిటరీస్ అందరూ, చప్పట్లు కొట్టి, చంద్రబాబుని అభినందించారు...

Advertisements

Latest Articles

Most Read