కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు, సాయంత్రం, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు కలిసారు... ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఉద్దండులతో చర్చించారు... సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, మాట్లాడుతూ, కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదని అమిత్ షా అన్నారు... అదేమిటీ.. మనం రాష్ట్రానికి అడిగినవన్నీ ఇస్తున్నాము కదా... ఎన్నో చేసాం... ఎన్నో ఇచ్చాం... ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమీ భయపడనక్కర్లేదు... బూత్‌స్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేయండి. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వండి" అంటూ అమిత్ షా గీతోపదేశం చేసి పంపించారు...

narayana 03022018 2

ఇదే సందర్భంలో నిధుల గురించి మాట్లాడుతూ... రైల్వే జోన్ అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు చెప్పారు... అమరావతికి సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రోగ్రసివ్ రిపోర్ట్)ను ఇప్పటివరకూ ఇవ్వేలేదు అని అందుకే, అమరావతికి నిధులు ఇవ్వటం లేదు అని చెప్పారు... అప్పటి నుంచి, రాష్ట్ర బీజేపీ నేతలు కూడా, అదే పల్లవి అందుకుని, డీపీఆర్ ఇవ్వలేదు అంటూ ఎదురు దాడి మొదలు పెట్టారు... వీరందరి విమర్శల పై, అమరావతి వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణ స్పందించారు...

narayana 03022018 3

కేంద్రానికి డీపీఆర్ పంపలేదనడం అవాస్తవమని మంత్రి నారాయణ తేల్చిచెప్పారు. డీపీఆర్ పంపలేదు కాబట్టే నిధులు కేటాయించలేదనడం అర్థరహితమన్నారు. సీఆర్‌డీఏ అభివృద్ధికి రూ. 5 లక్షల కోట్లు అవుతుందని చలా రోజుల క్రితమే డీపీఆర్‌ ఇచ్చామన్నారు. రాజధానిలో పరిపాలన భవన నిర్మాణాలకూ డీపీఆర్ పంపామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పరిపాలన భవన నిర్మాణాలకు 5 వేల కోట్ల అంచనాలతో, డీపీఆర్‌ ఇచ్చామన్నారు... మరి, మంత్రి హోదాలో ఆన్ రికార్డు చెప్పిన వ్యాఖ్యలకు, అమిత్ షా ఏమి సమాధానం చెప్తారో చూద్దాం...

విజ‌య‌వాడ‌లో నిర్మిస్తున్న క‌న‌క‌దుర్గ పైవంతెన వ‌ద్ద శుక్ర‌వారం రాత్రి భారీ ప్ర‌మాదం చోటుచేసుకుంది. అదృష్ట‌వ‌శాత్తు ఆ స‌మ‌యంలో అటువైపుగా పాద‌చారులు, వాహ‌న‌చోద‌కుల రాక‌పోక‌లు లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. పైవంతెన‌కు అమ‌ర్చేందుకు శుక్ర‌వారం రాత్రి సుమారు 8:30 గంట‌ల స‌మ‌యంలో సిబ్బంది (ఎపి16టిడ‌బ్ల్యూ2104) నంబ‌రు గ‌ల భారీ ట్రాలీ మీద సిమెంట్ వింగ్ (పైవంతెన‌కు అమ‌ర్చే సిమెంట్ రెక్క)ను తీసుకువ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో కుమ్మ‌రిపాలెం వ‌ద్ద‌కు రాగానే అక్క‌డ ఉన్న ఖాళీ స్థ‌లంలో ట్రాలీని డ్రైవ‌ర్ మ‌లుపు తిప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ నేప‌ధ్యంలో ట్రాలీతో పాటు దానిపైన ఉన్న సిమెంట్ వింగ్ బ‌రువుకు మ‌లుపు వ‌ద్ద ఉన్న డ్రెయిన్‌పై చ‌ప్టాలు విరిగిపోవ‌డంతో ట్రాలీ ఒక్క‌సారిగా బోల్తా ప‌డింది.

flyover 03022018 2

దీంతో ట్రాలీ మీద ఉన్న సిమెంట్ వింగ్ సైతం కింద ప‌డిపోయింది. ఇదే క్ర‌మంలో ట్రాలీ, ఇంజ‌న్ ఒక‌దానికొక‌టి రెండు భాగాలుగా విడిపోయాయి. దీంతో వెంట‌నే సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై పెద్ద భారీ క్రేన్‌తో పాటు మ‌రో మూడు క్రేన్‌ల స‌హాయంతో కింద బోల్తా ప‌డిన ట్రాలీని గంట పాటు శ్ర‌మించి అతిక‌ష్టం మీద పైకి లేపారు. డ్రెయిన్ మీద ప‌డిన సిమెంట్ దిమ్మ‌ను తీసే ప్ర‌య‌త్నం చేసినా సాధ్యం కాక‌పోవ‌డంతో సిబ్బంది త‌మ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. నిర్మాణ ప‌నుల నిమిత్తం అడ‌పాద‌డ‌పా ఇటువైపు సోమా కంపెనీ వాహ‌నాలు రాక‌పోక‌లు సాగించే క్ర‌మంలో పాద‌చారులు, వాహ‌న‌చోద‌కులు కూడా ఇటువైపుగానే రాక‌పోక‌లు సాగిస్తుంటారు. రాత్రి స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో అదృష్ట‌వ‌శాత్తు అటువైపుగా రాక‌పోక‌లు లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

flyover 03022018 3

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానికులు పెద్ద సంఖ్య‌లో పెద్ద సంఖ్య‌లో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఇప్ప‌టికే పైవంతెన నిర్మాణ ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతుండంతో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేఖ‌త వ్య‌క్త‌మ‌వుతున్న విష‌యం విధిత‌మె. అలాగే పైవంతెన నిర్మాణ ప‌నుల జాప్యంపై స్వ‌యంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సైతం రెండు రోజుల క్రితం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంద‌ర్భం కూడా తెలిసిందే. నిర్మాణ ప‌నులు చేసే క్ర‌మంలో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటించ‌కుండా సిబ్బంది సాగిస్తున్న నిర్ల‌క్ష్యంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతుంది.

రెండు నెలల క్రిత్రం విజయవాడలో ఆడిన జగన్నాటకం గుర్తుందా... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తూ జగన్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే... అయితే అప్పట్లో, ఈ ఎపిసోడ్ అంతా, జగనే దగ్గరుండి చేపించారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి... వంగవీటి రాధా కూడా, ఇలాంటి వెధవలను పార్టీ ప్రోత్సహించ బట్టే పార్టీ ఇలా ఉంది అంటునే, మా అరెస్ట్ తో ప్రభుత్వానికి సంబంధం లేదు అని కూడా అన్నారు.

gowtham 02022018 2

ఇవన్నీ పక్కన పెడితే, సస్పెండ్ అయిన తరువాత, ఎవరన్నా మాట్లాడకుండా ఉంటారా ? రాధ అన్ని బూతులు తిడితే, కనీసం గౌతం రెడ్డి, వాటికి సమాధానం ఇవ్వలేదు... గౌతం రెడ్డి ఇంటి ముందు, దసరా, దీపావళి శుభాకాంక్షలు అంటూ, జగన్ ఫోటులు వేసి ఉన్న బానేర్లు, ఫ్లెక్స్ లు వేసుకున్నాడు... ఇవి అన్నీ నడుస్తూ ఉండగానే, గౌతం రెడ్డి రెండు రోజుల క్రిందట వెళ్లి జగన్ ను బహిరంగంగా కలిసి సంచలంనం సృష్టించారు... సస్పెండ్ అయిన వ్యక్తి, వెళ్ళి డైరెక్ట్ గా జగన్ ను ఎలా కలుస్తారు అంటూ, అందరూ ఆశ్చర్యపోయారు... అయితే, ఇవాళ అసలు విషయం చెప్పేశారు, గౌతం రెడ్డి...

gowtham 02022018 3

తాను ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నట్లు గౌతం రెడ్డి ఇవాళ ప్రకటించారు. వంగవీటి రంగా మీద చేసిన వ్యాఖ్యల విషయంలో, కాపులు ఆందోళనకు దిగడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి, సమాధానం చెప్పకుండానే, పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు జగన్ ప్రకటించారు...అయితే వైసీపీ నుంచి తనకు ఎలాంటి సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందలేదని, ఇవాళ గౌతమ్ రెడ్డి చెప్పారు... తనని అసలు ఎవరూ సస్పెండ్ చెయ్యలేదు అంటూ, గౌతం రెడ్డి చెప్పిన మాటలతో, జగన్ చేసింది అంతా డ్రామానే అనే విషయం అర్ధమైంది... మరి, ఇప్పుడు వంగవీటి రాధా ఎలా స్పందిస్తారో చూడాలి...

స్థానికత ఆధారంగా ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల రిలీవ్‌ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మూడేళ్లుగా నడుస్తున్న ఈ వివాదంపై ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించింది. స్థానికత ఆధారంగా ఉద్యోగులను రిలీవ్‌ చేయడాన్ని తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికత ఉన్న 1200 మంది ఉద్యోగులను రిలీవ్‌ చేయడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. .. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ విద్యుత్‌ సంస్థలైన ట్రాన్స్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

telangna 02022018 2

దీన్ని సవాల్‌ చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58 శాతం, తెలంగాణ 42 శాతం జీతాలుగా చెల్లిస్తున్నాయి... ఇదే విషయం పై కోర్ట్ కి వెళ్లారు... ఈ వివాదంపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ఉద్యోగుల రిలీవ్‌ను తప్పుబడుతూ శుక్రవారం తీర్పు వెలువరించింది.... తెలంగాణా ప్రభుత్వానికి గెట్టి మొట్టికాయ వేసింది హై కోర్ట్

telangna 02022018 3

గెట్టిగా మొట్టికాయి వెయ్యటమే కాదు, దీంతో పాటు ఉద్యోగులకు వేతనంగా చెల్లించిన మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తిరిగి చెల్లించాలని పేర్కొంది. ఉద్యోగుల వివాదంపై ఒక కమిటీ ఏర్పాటు చేసి నాలుగు నెలల్లో విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది... ఇదే విధంగా విద్యుత్ బకాయులు గురించి కూడా తీర్పు వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తెలంగాణా నుంచి 4 వేల కోట్ల బకాయలు వస్తాయి... కేంద్రంతో పెట్టుకుంటే ఇవి అయ్యే పనులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం కోర్ట్ కి వెళ్లి ఇది కూడా సాధించాలి...

Advertisements

Latest Articles

Most Read