ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దావోస్ లో అలీబాబా క్లౌడ్ ప్రెసిడెంట్ తో సమావేశం అయ్యారు... ఈ సందర్భంగా ఆశక్తికర సంఘటన చోటు చేసుకుంది... చంద్రబాబు స్పీడ్ చూసి, అలీబాబా క్లౌడ్ ప్రెసిడెంట్ కూడా ఆశ్చర్యపోయారు... ముందుగా ఈ సంభాషణ చుడండి... సైమన్ హు : మేము భారత్ లో మొదటి డేటా సెంటర్ ఓపెన్ చేస్తున్నాము... రెండోది ఆంధ్రప్రదేశ్ లో చేస్తాము... చంద్రబాబు : ఎప్పుడు చేస్తారు ?... సైమన్ హు : ఈ ఏడాది చివర్లో చెయ్యాలని ప్రణాళికలో ఉన్నాం... చంద్రబాబు : ఏడాది చివర ఆంటే చాల ఆలస్యం అవుతుంది... ఎంత త్వరగా ఏర్పాటు చేస్తే ఇరు పక్షాలకు అంత మంచింది, త్వరగా ఏర్పాటు అయ్యేలా చూడండి...
ఈ సంభాషణ తరువాత, సైమన్ హు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు... మీ స్పీడ్ చూస్తుంటే మాకు అక్కడ ఎంతో తొందరగా కంపెనీ మొదలు పెట్టాలని ఉంది... వీలైనంత త్వరగా ఏర్పాటు అయ్యేలా చూస్తాం అని అన్నారు... మీరొక రాజకీయ నాయకుడిగా కాక శాస్త్రవేత్తలా మాట్లాడుతున్నారు.... అది మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది... మీ ఉత్సాహం, వేగవంతమైన నిర్ణయాలు తనను ముగ్దుడ్ని చేశాయని, మీ అభిమానిగా మార్చేశాయని, తప్పకుండా మీరు కోరిన విధంగా త్వరలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాము అని అలీబాబా క్లౌడ్ ప్రెసిడెంట్ అన్నారు...
మీరు ఇండియాలో సాంకేతికతకు ఆద్యులని, ఇ గవర్నెన్స్ పోషకులని తెలుసుకున్నాం. మిమ్మల్ని కలుసుకున్న తరువాత మీ మీద గౌరవం రెట్టింపు అయింది అని అన్నారు, సైమన్ హు... చంద్రబాబు కూడా అన్ని విషయాలు వివరంగా చెప్పారు... ఏది కావలి అంటే అది ఇవ్వటానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది అని, మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే, అన్ని విధాలుగా మీకు లాభం చేకూర్చే బాధ్యత మాది అని, మా యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అని కోరారు... ఈ సంబాషణ విన్న అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఇదీ మన ముఖ్య మంత్రి గారి స్పీడ్ అందుకే ఆయన్ను అందుకోవడం కష్టం అని అనుకున్నారు...