జాజివ‌ల‌స‌... కొండ‌లు, కోన‌ల న‌డుమ మారుమూల జ‌నజీవ‌న స్ర‌వంతికి దూరంగా, క‌నీసం ఫోను స‌దుపాయానికి కూడా నోచుకోకుండా ప్ర‌కృతి ఒడిలో మారుమూల అట‌వీ ప్రాంతాంలో అల‌రారుతున్న అందాల సీమ‌. తూర్పు గోదావ‌రి జిల్లా వై.రామ‌వ‌రం మండ‌లం, క‌నివాడ పంచాయ‌తి ప‌రిధిలోని ఈ గ్రామానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వెళితే క‌నీసం మాట్లాడ‌టానికి ఎలాంటి ఫోను స‌దుపాయం, నెట్ క‌నెక్ష‌న్ ఉండేది కాదు... అలాంటి గిరిజ‌న ప్రాంతాన్ని అక్క‌డ ప్ర‌జ‌లు ఏమాత్ర ఊహించ‌ని విధంగా దావోస్ నుంచి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా వీడియో ఫోను ద్వారా ప‌లుక‌రించి, వారి యోగ‌క్షేమాలు అడిగే స‌రికి జాజివ‌ల‌స ప్ర‌జ‌లు సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో పుల‌కించిపోయారు. రంప‌చోడ‌వ‌రం నుంచి దాదాపు 80 కిలో మీట‌ర్ల దూరంలో ఉండే ఈ ప‌ల్లెను తొలిసారిగా మంగ‌ళ‌వారం ఫోను, ఇంట‌ర్‌నెట్‌, కేబుల్ టీవీ స‌దుపాయాలు ప‌లుక‌రించాయి. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫైబ‌ర్ నెట్ సంస్థ వ్య‌వ ప్ర‌యాసాల‌కు ఓర్చి ఈ మారుమూల గిరిజ‌న గ్రామాన్ని సాధార‌ణ జ‌నంతో మ‌మేక‌య్యేలా క‌నెక్టివిటీ క‌ల్పించింది. జాజివ‌ల‌స‌కు క‌ల్పించిన ఈ స‌దుపాయాన్ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దావోస్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించారు. జాజివ‌ల‌స‌కు క‌ల్పించిన న‌వ సాంకేతిక స‌దుపాయం ప‌నితీరు ఎలా ఉందో స్వ‌యంగా అక్క‌డ గిరిజ‌నుల‌తో మాట్లాడి తెలుసుకున్నారు.

జాజివ‌ల‌స ప్ర‌జ‌ల‌తో ఫోను ద్వారా వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించి అక్క‌డ ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఏమ‌మ్మా ఈ స‌దుపాయం ఎలా ఉంది, దీనిద్వారా ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయ‌ని అనుకుంటున్నారు అని ఆయ‌న గిరిజ‌న‌లు అడిగారు. వారి యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. క‌ల‌లో ఊహించ‌నివిధంగా , స్వ‌యంగా ఇలా ముఖ్య‌మంత్రి త‌మ‌ను ప‌లుక‌రించే స‌రికి ప్రజ‌లు ఆనంద‌డోలిక‌ల్లో తేలిపోయారు. సారూ..చాలా సంతోషం సారూ, మీరు మాతో ఇలా మాట్లాడ‌టం, మా ఊరికి ఫోను ఇచ్చినారు మీరు, మీకు కృతజ్ఞ‌త‌లు అని జాజివ‌ల‌స మ‌హిళ‌లు తెలిపారు. త‌మ ఊరికి తాము ఊహించ‌ని విధంగా రోడ్డు కూడా వేస్తున్నార‌ని అది త‌మ‌కెంతో సంతోషంగా ఉంద‌ని తెలిపారు. దానికి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ... ఒక్క ఫోను ఏంట‌మ్మా మీ ఊరికి ఇప్పుడు ఇంట‌ర్‌నెట్‌, కేబుల్ టీవీ అన్నీ వ‌చ్చాయి. టెలీమెడిసిన్ ఒక్క‌టేమిటీ దీనివ‌ల్ల మీకు తెలినీ ప్ర‌యోజ‌నాలు మీకు ఎన్నో క‌ల‌గ‌బోతున్నాయి అన్నారు. జాజివ‌ల‌సకు ఫైబ‌ర్ నెట్ స‌దుపాయం క‌ల్పించ‌డం త‌న‌కు చాలా ఆనందంగా ఉంద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

ఫైబ‌ర్ నెట్‌కు అభినంద‌న‌లు... జాజివ‌ల‌స గిరిజ‌న గ్రామానికి వైర్‌లెస్ నెట్ స‌దుపాయాన్ని దిగ్విజ‌యంగా క‌ల్పించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫైబ‌ర్ నెట్ సంస్థను, ఆ సంస్థ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి (సీఈఓ) అహ్మ‌ద్ బాబు, అధికారులు, సిబ్బందిని ముఖ్య‌మంత్రి అభినందించారు. గుడ్ చాలా బాగా చేశారు, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఇలా ఏమాత్రం క‌నెక్టివిటీ లేని ప్రాంతాల‌కు ఇదే త‌ర‌హా క‌నెక్టివిటీని క‌ల్పించాలి అని సూచించారు. జాజివ‌ల‌కు ఈ స‌దుపాయం ఎలా క‌ల్పించిందో ఫైబ‌ర్‌నెట్ సీఈఓ ఎ.బాబు వివ‌రించారు. ప్ర‌పంచంలోనే తొలిసారి... ఏ మాత్రం క‌మ్యూనికేష‌న్ స‌దుపాయం క‌ల్పించ‌డానికి అవ‌కాశం లేని మారు మూల ప్రాంతాల‌కు కూడా ఇలా ఏకంగా టెలిఈఫోను, కేబుల్ టీవీ, ఇంట‌ర్‌నెట్ స‌దుపాయాన్ని వైర్‌లెస్ ద్వారా క‌ల్పించ‌డం ప్ర‌పంచంలోనే ఇదే తొలిసారి అని ఫైబ‌ర్ నెట్ వ‌ర్గాలు తెలిపాయి. దీనికోసం ఫైబ‌ర్ నెట్ సంస్థ గూగుల్ ఎక్స్ సంస్థ స‌హ‌కారం తీసుకుని ఎఫ్‌.ఎస్‌.ఓ.సి ద్వారా ఈ స‌దుపాయం క‌ల్పించింది. దీనికోసం ఏపీ ఫైబ‌ర్ నెట్ చేసిన ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంత‌మ‌య్యాయి.

ఏమిటీ ఎఫ్‌.ఎస్‌.ఓ.సి... ఫ్రీ స్పేస్ ఆప్టిక‌ల్ క‌మ్యూనికేష‌న్‌..(ఎఫ్‌.ఎస్‌.ఓ.సి) అనేది గూగుల్ ఎక్స్ సంస్థ అందిస్తున్న స‌రికొత్త సాంకేతిక స‌దుపాయం. ప్ర‌పంచంలోనే ఇది అత్యుత్త‌మ సాంకేతిక స‌దుపాయం. ఏ మాత్రం సెల్ ఫోను సిగ్న‌ళ్లు లేని, కేబుల్ ద్వారా బ్రాడ్ బ్యాండ్ స‌దుపాయం క‌ల్పించ‌డానికి వీలులేని మారుమూల ప్రాంతాల‌కు వైర్‌లెస్ ద్వారా అన్ని ర‌కాల క‌నెక్టివిటీ క‌ల్పించ‌డ‌మే దీని ప్ర‌త్యేక‌త‌. 20 కిలోమీట‌ర్ల ప‌రిధిలో దీని ద్వారా 20 జీబీపీఎస్ (గిగా బైట్స్ ప‌ర్ సెకండ్‌) వేగంతో ఇంట‌ర్‌నెట్ స‌దుపాయం క‌ల్పించ‌వ‌చ్చు. ఎలాంటి కేబుల్ లేకుండానే ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు టెలిఫోను, అంత‌ర్జాలం, కేబుల్ టీవీ ప్ర‌సారాల‌ను క‌ల్పించ‌వ‌చ్చు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలు, స‌ల‌హాలు, సూచ‌న‌ల ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫైబ‌ర్ నెట్ సంస్థ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఈ త‌ర‌హా స‌దుపాయాన్ని క‌ల్పిస్తోంది. తొలిసారిగా తూర్పు గోదావ‌రి జిల్లా వై.రామ‌వ‌రం మండ‌లం, క‌నివాడ పంచాయ‌తీకి చెందిన జాజివ‌ల‌స‌కు ఈ స‌దుపాయం క‌ల్పించింది. ద‌శ‌ల వారీగా మిగిలిన ప్రాంతాల‌కు కూడా ఈ స‌దుపాయం క‌ల్పించ‌నున్న‌ట్లు ఏపీ ఫైబ‌ర్ నెట్ సీఈఓ ఎ.బాబు తెలిపారు. రాష్ట్రంలో ఇంట‌ర్నెట్‌, అంత‌ర్జాలం, కేబుల్ టీవీ స‌దుపాయం లేని ఆవాసాలు అనేవి ఉండ‌కూడ‌ద‌నేదే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ల‌క్ష్య‌మ‌ని, ఈ ల‌క్ష్య సాధ‌న‌కు ఫైబ‌ర్ నెట్ సంస్థ పున‌రంకిత‌మ‌వుతోంద‌ని తెలిపారు.

దావోస్ లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సమాఖ్య సదస్సుకు గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ హాజరయ్యారు... జయదేవ్, ఎంపీగా కాక, కంపెనీ సీఈఓ హోదాలో అక్కడకు వచ్చారు... మన దేశం నుంచి 130 మందికి పారిశ్రామికవేత్తలను కేంద్రం ఎంపిక చేసి ఇక్కడకు పంపింది... వారిలో అమరరాజ ఇండస్ట్రీస్ సీఈఓగా జయదేవ్ కూడా అక్కడకు వచ్చారు... ఈ సందర్భంలో, ఆరంభ వేడుకల్లో, ప్రధాని మోడీ మాట్లాడే సమావేశ మందిరంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యామంత్రి జయదేవ్ ను చూసి, పలకరించారు... ఎప్పుడు వచ్చావ్ అంటూ, క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు...

jaydev 24012018 2

ఈ సందర్భంగా, జయదేవ్ మాట్లాడుతూ, నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఔత్సాహిక పారి శ్రామిక వేత్తలను రాష్ట్రానికి ఆహ్వానిస్తామని అన్నారు. గత ఏడాది దావోస్ లో జరిగిన ఈ సదస్సు ద్వరా రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులను ఆకర్షించగలిగామని ఎంపి గల్లా జయదేవ్, అన్నారు... ప్రధాని నరేంద్రమోదీ మెక్ ఇన్ ఇండియా ఆలోచనలలో భాగంగా ప్రపంచ ఆర్థిక సమాఖ్య సమావేశాల్లో ఆరుగురు కేంద్ర మంత్రులు, 130 మందికి పైగా మన దేశానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పలు రాష్ట్రాల, ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరవుతున్నారని ఎంపి జయదేవ్ తెలిపారు...

jaydev 24012018 3

ఈ సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రులు కూడా హాజరైనట్లు తెలిపారు... పెట్టుబడులను ఆకర్షించేదుకు ఇది ఒక మంచి వేదిక అని అన్నారు... కేవలం గుంటూ రు పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే కాకుండా, అమరరాజ ఇండస్ట్రీస్ సీఈఓగా కూడా తాను, పారిశ్రామిక పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తానని తెలిపారు...

దావోస్ లో ఏపి లాంజ్ కి వచ్చిన, ఏజిల్ లాజిస్టిక్స్ సీఈవో, తన మాటలతో చంద్రబాబునే ఆశ్చర్యపరిచారు... చంద్రబాబు వెల్కమ్ చెప్పి, కూర్చోమని చెప్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఇంట్రో ఇస్తూ ఉండగా, ఏజిల్ లాజిస్టిక్స్ సీఈవో, తరక్ సుల్తా అల్ ఎస్సా కలిపించుకుని, ‘మీరు మాచేత పెట్టుబడులు పెట్టించేందుకు మమ్మల్ని ఒప్పించనవసరం లేదు. ఎందుకంటే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మేము ఇప్పటికే స్థిర నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు... ఇది చంద్రబాబుకి ఉన్న బ్రాండ్ ఇమేజ్.... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

agl logistics 23012018 2

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏజిల్ లాజిస్టిక్స్ ద్వైపాక్షిక సమావేశం, దావోస్ లో జరిగింది... ఈ సమావేశంలో సంస్థ సీఈవో తరక్ సుల్తా అల్ ఎస్సా (Tarak Sulta Al Essa), డైరెక్టర్ ఉగెన్ మెన్ (Eugene Mayne), పాల్గున్నారు... ఆయన రావటం తోనే, ‘మీరు మాచేత పెట్టుబడులు పెట్టించేందుకు మమ్మల్ని ఒప్పించనవసరం లేదు. ఎందుకంటే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మేము ఇప్పటికే స్థిర నిర్ణయం తీసుకున్నాం’ అని చెప్పారు తరక్.... అది ఎప్పుడు ఎలా అనేదే ఆలోచిస్తున్నామని అని చెప్పారు... త్వరలో అమరావతికి వచ్చి తదుపరి కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రికి తెలిపారు ఆ సంస్థ సీఈవో....

agl logistics 23012018 3

వ్యాపార విస్తరణకు ప్రణాళికలతో ఉన్నామని తరక్, ముఖ్యమంత్రికి వివరించారు... భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని తలంచామని, ముఖ్యంగా సాంకేతికంగా ముందున్న ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించామని తెలిపారు... ప్రభుత్వ నేతగా ఉన్న వ్యక్తి నుంచి సాంకేతికతకు సంబంధించిన మాటలు వినడం తనకు అమితాశ్చర్యంగా ఉందని, సంస్థలకు సంబంధించిన వారు కూడా ఇంత పరిజ్ఞానంతో మాట్లాడలేరని వ్యాఖ్యానించారు... విమానాశ్రయాల్లో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహణ పట్ల ఈ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది... ఇప్పటికే ఇండియాలో ముంబై, ఆఫ్రికలో మరికొన్ని నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టుల్లో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంది, ఏజిల్ లాజిస్టిక్స్ సంస్థ....

ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉందని, కృష్ణా-గోదావరి బేసిన్ లో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయని, పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని సౌదీ ఆర్మ్‌కో సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. దావోస్ పర్యటనలో రెండో రోజు పర్యటనలో మంగళవారం ముఖ్యమంత్రి సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీతో భేటీ అయ్యారు. తమ రాష్ట్రాన్ని తాకుతూ రెండు పారిశ్రామిక కారిడార్లున్నాయని, కృష్ణ పట్నాన్ని లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని, రిఫైనరీ ఏర్పాటు వాణిజ్యపరంగా ఎంతో లాభసాటి అవుతుందని, స్వదేశంలో కా మార్కెటింగ్ కు అనువుగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

పెట్రోలియం, రసాయన పరిశ్రమల ఏర్పాటుకు, విస్తరణకు తమ రాష్ట్రంలో ఇప్పటికే సానుకూల వాతవరణం ఉందని, హెచ్.పి.సి.ఎల్, గెయిల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ ఆయువుపట్టుగా ఉందని వివరించారు. రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (IIPE), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్& టెక్నాలజీ (CIPET) ను స్థాపించనున్నామని, ఇందువల్ల నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభిస్తాయని చంద్రబాబు వివరించారు.

ఇది రాష్ట్రంలో సమీప భవిష్యత్తులో పెట్రోలియం పరిశ్రమల ఏర్పాటుకు మరింత అనువైన వాతావరణం ఏర్పడేందుకు దారితీస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన కంపెనీలలో సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ఒక ప్రధాన కంపెనీ. కృష్ణ పట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు ఇప్పటికే ఆసక్తి ప్రదర్శించింది. ఆ కంపెనీ ప్రతినిధులు రాష్ట్రాన్ని రెండు పర్యాయాలు సందర్శించారు. వారితో నిరంతర సంబంధాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ఎలాగైనా సౌదీ ఆర్మ్‌కో రిఫైనరీ తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ముంబయ్‌లో ఈ నెలాఖరులో సౌదీ ఆర్మ్‌కో (Saudi Armco) ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు మరోసారి కలవనున్నారు.

కాగా సౌదీ ఆర్మకో కంపెనీ మహారాష్ట్రలో $ 40 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడితో ఐఓసిఎల్, హె.పి.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీలతో సంయుక్త భాగస్వామ్యంలో మెగా రిఫైనరీ ఏర్పాటు చేయాలని సౌదీ ఆర్మ్ సంస్థ ప్రయత్నం చేసింది. కానీ సంయుక్త భాగస్వామ్యం కార్యాచరణకు రాలేదు. ఈ దశలొ సౌదీ ఆర్మ్ సంస్థ రిఫైనరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు, సామర్ధ్యం ఉన్న కీలక ప్రదేశంగా మన రాష్ట్రంలోని కృష్ణ పట్నాన్ని గుర్తించింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ కంపెనీ భారత్ రాజధాని ఢిల్లీలో ఆర్మ్‌కో ఏషియా-ఇండియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు కు నిశ్చయించింది. భారత్‌లో మార్కెట్‌లో మరింత వాటా దక్కించుకోవటానికి ఈ సంస్థ కార్యకాలపాలు నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో 640 చ.కి.మీ మేర చమురు, రసాయనాలు, పెట్రెకెమికల్స్ ఇన్వె స్టిమెంట్ రీజియన్ (PCPIR) లో ఉందని, అలాగే 6 సెజ్‌లు ఉన్న విషయాలను అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని కృష్ణపట్నాన్ని తన పెట్టుబడులకు ప్రాధాన్యతా కేంద్రంగా ఎంచుకుంది. ఈ దిశగా వారిని ఒప్పించి మన రాష్ట్రానికి భారీ రిఫైనరీ తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంస్థ ప్రతినిధులతో గతంలో ఒకసారి సమావేశమయ్యారు.

ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించనున్నసిఐఐ పెట్టుబడి దారుల సదస్సుకు హాజరు కావాలని ఆయన సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీని ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నామని, వ్యాపార సానుకూల వాతావరణం ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ స్థిరంగా ముందుకు దూసుకువెళుతోందని వివరించారు. సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీ స్పందిస్తూ ‘భారత్‌కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు మీరు చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నాను’ అని చెప్పారు. కాగా సౌదీ ఆర్మ్‌కో ప్రధానంగా చమురు అన్వేషణ రంగంలో అపార అనుభవం గడించిన సంస్థ. భూమిలో చమురు, సహజవాయు నిక్షేపాలు (hydro corbans) అన్వేషణ, ఉత్పత్తి, ఎల్.పి.జీ ఉత్పత్తి, చమురు శుద్ధి, చమురు పంపిణీ, క్రూడ్ ఆయిల్ మార్కెటింగ్ లో ఎంతో ప్రసిద్ధి చెందింది.

Advertisements

Latest Articles

Most Read