బ్రాహ్మణి స్టీల్స్... వైయస్ రాజశేఖర రెడ్డి, ద్వారా లబ్ధి పొంది, రాయలసీమలో బ్రాహ్మణి స్టీల్స్ అనే ఉక్కు కర్మాగారాన్ని స్థాపించాడు గాలి జనార్దన్ రెడ్డి ... ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్ జగన్ పాత్ర కూడా అందరికీ తెలిసిందే... తరువాత బండారం బయట పడి, ఇద్దరూ వేరు వేరు కేసుల్లో జైలుకి కూడా వెళ్లి వచ్చారు.. ప్రస్తుతం ఇద్దరూ బెయిల్ పై బయట ఉన్నారు... ఇప్పుడు ఈ "బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌" పై డీఆర్‌ఐ (డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్) సీరియస్ అయ్యింది... బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌, అన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది అంటూ, మిషనరీ సీజ్ చేసింది... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...

bhramini 22012018 2

కడప జిల్లాలోని బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌కు సంబంధించిన రూ.189 కోట్ల విలువైన యంత్రాలను డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ సీజ్‌ చేసింది. 2009లో చెన్నై ఓడరేవు నుంచి బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌ యంత్రాలను దిగుమతి చేసుకుంది... బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన యంత్రాలను బ్రాహ్మణి ఇండస్ట్రీస్‌ ఇక్కడ ఉపయోగించడం లేదు. అవి ఎక్కడ ఉన్నాయో, అసలు ఉన్నాయో లేదో, లేక అమ్ముకున్నారో తెలీదు... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

bhramini 22012018 3

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి గాలి జనార్దన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయన జగన్‌తో కలిసి పలు వ్యాపారాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చెలిమితో గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ లీజు పొందారు. ఇందులో భాగంగానే ఆయన రాయలసీమలో బ్రాహ్మణి స్టీల్స్ అనే ఉక్కు కర్మాగారాన్ని కూడా స్థాపించారు. ఆ కర్మాగారానికి ముడి ఇనుమును వాడుకోవడానికి ఓబుళాపురం గనులను కట్టబెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్ పూర్తయ్యే వరకు ముడి ఇనుమును అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. దాంతో గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్‌ను పక్కన పెట్టేసి పెద్ద యెత్తున ముడి ఇనుమును ఎగుమతి చేసి కోట్లాది రూపాయలు సంపాదించి, చివరకు జైలు పాలు అయ్యారు కూడా...

ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్... గత రెండు సంవత్సరాలుగా, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది... దేశంలో అన్ని రాష్ట్రాల కంటే, మన రాష్ట్రం ఫస్ట్ ఉంటూ వస్తుంది... కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన 340 అంశాలను పరామీటర్స్ గా తీసుకుని, ర్యాంకింగ్స్ ఇస్తారు... ఈ సంవత్సరం కూడా, ఈ ర్యాంకింగ్స్ ఇవ్వనున్నారు... ఈ పరామీటర్స్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు వెబ్సైటులో (http://eodb.dipp.gov.in/) అప్డేట్ చెయ్యాలి... కేంద్ర ప్రభుత్వం, ప్రతి రాష్ట్రం అప్డేట్ చేసిన వాటిని ఇవాల్యువేట్ చేసి, ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంది... ఈ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది...

eodb 22012018 2

కాని నవంబర్ నెలలో, హైదరాబాద్ మీడియా హంగామా హంగామా చేసింది... ర్యాంకింగ్స్ ప్రకటించకుండానే, తెలంగాణా ఫస్ట్ అని, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉంది అని ఊదరగొట్టింది... చివరకు ఈనాడు కూడా అలాగే రాసింది... తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన బ్రీఫింగ్ తీసుకుని, విషయం తెలుసుకోకుండా, ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉంది అంటూ హేళన చేసారు.. అయితే, ఇప్పటికే ఇవాల్యువేషన్ జరుగుతూనే ఉంది... ప్రస్తుతం ర్యాంకుల బట్టి, ఆంధ్రప్రదేశ్ నాలుగువ స్థానంలో ఉంటె, తెలంగాణా 6వ స్థానంలో ఉంది... మొదటి స్థానంలో జార్ఖండ్ ఉంది... అయితే ఇవి ఇంకా ఫైనల్ కాదు...

eodb 22012018 3

ర్యాంకులు ప్రకటించే సమయానికి, ఆంధ్రప్రదేశ్ కచ్చితంగా మొదటి స్థానంలో ఉండి తీరుతుంది... నిజానికి రాష్ట్రానికి సంబంధించిన పరామీటర్స్ అన్నీ సబ్మిట్ చెయ్యటానికి నవంబర్ 7, 2017 చివరి తేది... కాని తెలంగాణ మీడియా మాత్రం నవంబర్ 1 నే, తెలంగాణా ఫస్ట్ అంటూ ప్రకటించింది... నవంబర్ 7 తరువాత అన్ని పరామీటర్స్ ఇవాల్యువేట్ చేస్తున్నారు... ఇప్పటి వరకు మనం నాలుగవ స్థానంలో ఉన్నాం, తెలంగాణా 6వ స్థానంలో, మనకంటే రెండు స్థానాలు వెనకబడి ఉంది... చివరకు ర్యాంకింగ్స్ ప్రకటించే రోజు మనకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది... ఇది తధ్యం... అప్పుడు ఈ తెలంగాణా మీడియా ఆర్తనాదాలు విందాం...

జగన్ ప్రియ శిష్యురాలు, నోరు తిరేస్తే మగవాళ్ళు కూడా హడిలిపోయే మాటలతో విరుచుకుపతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మల్యే, , సినీ నటి రోజా ఇంట్లో భారీ చోరీ జరిగింది.. ఈ చోరీలో, అత్యంత విలువైన బంగారు హారంతో పాటు, పెద్ద ఎత్తున నగలు , వజ్రాలు మాయం అయినట్టు తెలుస్తుంది... హైదరాబాద్ లోని మణికొండలో రోజా ఇల్లు ఉంది... తన ఇంట్లో దొంగతనం జరిగిందని ఎమ్మెల్యే రోజా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. రోజా ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు...

roja 2202018 2

మాదాపూర్ డీసీపీ అధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుంది... హైదరాబాద్ లో తన నివాసంలో గత 10 రోజుల నుండి రోజాతో పాటు, కుటుంబ సభ్యులు ఎవరూ ఉండటం లేదు అని సమాచారం... 10రోజుల నుండి ఇంటికి తాళం వేసి ఉండడం వల్ల, దొంగలు గమనించి ఈ దొంగతనం జరిగింది అంటున్నారు... బాగా తెలిసిన వ్యక్తే ఈ దొంగతనం చేయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.. అయితే పెద్ద ఎత్తున బంగారం పోయింది అని వార్తల్లో రావటంతో రోజా అలెర్ట్ అయ్యారు...

roja 2202018 3

అంత పెద్ద ఎత్తున బంగారం, వజ్రాలు పోయాయి అని బయటకు తెలిస్తే, ఐటి రైడ్ లు లాంటివి జరిగితే, అవి ఎక్కడ నుంచి వచ్చయి, అవి మీవేనా ? ఎవరైనా ఇచ్చారా ? లాంటి ప్రశ్నలు వస్తాయనే ఉద్దేశంతో, రోజా అలెర్ట్ అయ్యారు.. 10 లక్షల విలువైన బంగారు హారం మాత్రమే పోయింది అని మీడియాకు సమాచారం ఇచ్చారు... వచ్చిన దొంగ, మొత్తం దోచుకుపోతాడు కాని, బంగారం హారం ఒక్కటే దొంగతనం చేసి, మిగాతావి ఎందుకు వదిలేస్తాడు అనే అనుమానం మీడియా వర్గాల్లో నెలకొంది.. వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి అనుకోండి... దొంగ దొరికి, రోజా పోగొట్టుకున్న బంగారం, వజ్రాలు తొందరగా దొరకాలి అని కోరుకుందాం...

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పెద్ద కొడకునంటూ విర్రవీగి, సహజ వనరులని దోచుకుని, చివరకి జైలు పాలు అయ్యి, బెయిల్ పై బయట తిరుగుతున్న, గాలి జనార్దన్‌రెడ్డి కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది... గాలి జనార్ధన్ రెడ్డి, ఇప్పుడు వైఎస్ జగన్ లాగానే, బెయిల్ పై బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే... అయితే గాలి జనార్ధన్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు, కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది సుప్రీమ్ కోర్ట్... ఆ షరతులతో పాపం గాలి, ఇబ్బంది పడుతున్నాడో ఏమో, వాటి పై మళ్ళీ సుప్రేం కోర్ట్ కు వెళ్ళాడు...

gali 22012018 2

నాకు బెయిల్ ఇచ్చినప్పుడు పెట్టిన షరతులు ఎత్తివేయండి, సవరించండి అంటూ సుప్రీం కోర్ట్ లో గాలి జనార్ధన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేసారు... ఈ పిటీషన్ పై సుప్రీం కోర్ట్ విచారణ చేసింది... ఇరు పక్షాల వాదనలు సుప్రీం కోర్ట్ విన్నది.. అయితే గాలి జనార్దన్‌రెడ్డి న్యాయవాదుల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. బెయిల్ నిబంధనలను సడలించకూడదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో జగన్ విషయం కూడా వార్తల్లోకి వచ్చింది...

gali 22012018 3

జగన్ కూడా ఇలాంటి కేసులోనే అరెస్ట్ అయ్యి, 16 నెలలు జైలులో ఉండి, బెయిల్ పై బయట తిరుగుతున్నాడు... ప్రస్తుతం, ఈడీ, సిబిఐ విచారణకు ప్రతి శుక్రవారం హాజారు అవుతున్నాడు... జగన్ కూడా త్వరలో బెయిల్ నిభందనలు సవరించమని, అవి తన రాజకీయ యాత్రలకి ఇబ్బంది అవుతున్నాయని, త్వరలో కోర్ట్ లో పిటీషన్ వేస్తాడు అనే వార్తలు వస్తున్నాయి... మరి ఇప్పుడు గాలి జనార్ధన్ రెడ్డికి ఇచ్చిన తీర్పు నేపధ్యంలో, జగన్ కు కూడా ఇలాంటి ఎదురుదెబ్బే తగిలే అవకాశం ఉంది...

Advertisements

Latest Articles

Most Read