మనకు తెలిసీ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వెబ్సైటులని జగన్ మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎలా వాడుతున్నారో చూస్తున్నాం... లోటస్ పాండ్ లో ఒక ఫేక్ బ్యాచ్ ని సోషల్ మీడియాలో అసత్య ప్రచారం కోసం వాడటం చూసాం... అలాగే 250 కోట్లు ఇచ్చి ఒక టీంని బీహార్ నుంచి తీసుకువచ్చి, మన రాష్ట్ర పరువు తీస్తూ, జాతీయ స్థాయిలో మన పరువు తీస్తున్నాడు జగన్... ఒక పక్క జగన్ ఈ రకంగా ఫేస్బుక్ ని వాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబానాయుడు సతీమణి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ త‌న‌య ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఫేస్బుక్ ని ఎలా వాడుతున్నారో చూడండి...

bhuvaneswari 19012018

ఎన్టీఆర్ ట్రస్టు డైరెక్టర్ గా ఉంటూ, వారు నిర్వహిస్తున్న సేవా కార్యాక్రమాల విష‌యంలో విన్నూత్నమైన నిర్ణ‌యం తీసుకున్నారు భువనేశ్వరి. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న దేశ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలని, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ లెజండరీ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే, ఈ బ్లడ్ డ్రైవ్ కోసం ఫేస్‌బుక్ స‌హాయం తీసుకున్నారు... ఈ లెజండరీ రక్తదాన శిబిరాలన కార్యక్రమాన్ని నిర్వహించటానికి 300 ఫేస్ బుక్ ఈవెంట్స్‌ను తీసుకుని ప్రమోట్ చేసారు.

bhuvaneswari 19012018

ఫేస్‌బుక్ సహకారంతో ఎవరికైనా రక్తం అవసరమైతే మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యక్తులకు సమాచారం అందించడం ద్వారా, అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరమైతే వారికి త్వరగా అందించడానికి ఉపయోగపడుతుందని, అందుకే ఫేస్బుక్ సహాయంతో సేవలు అందిస్తామని భువనేశ్వరి మీడియాతో అన్నారు.ఫేస్ బుక్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మంది బ్లడ్ డోనర్స్‌గా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో పేరు నమోదు చేసుకున్నారని చెప్పారు... ఫేస్బుక్ ని చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి ఇలా ప్రాణాలు కాపాడటానికి వాడుతుంటే, జగన్ లాంటి వాళ్ళు మాత్రం జాతీయ స్థాయిలో, రాష్ట్ర పరువు తియ్యటానికి వాడుతున్నారు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై స్వరం పెంచారు... గుంటూరు జిల్లా ఉండవల్లిలో సియం నివాసం వద్ద జరుగుతున్న కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు కేంద్రం పై సీరియస్ వ్యాఖ్యలే చేసారు... ఆంధ్రప్రదేశ్ విభజన గురించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసారు... ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రమేయం లేకుండానే విభజన చేశారని, అందరితో మాట్లాడి న్యాయం చేయాలంటే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజన చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

cbn collectors conf 19012018 2

విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అందరూ చెబుతున్నారని, కాని న్యాయం చెయ్యండి అంటే, మాత్రం ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు... పెద్దన్న పాత్ర పోషించి, ఆదుకోవాలని కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని, విభజన హామీల విషయంలో రాజీ లేదు అని, ఎవరితోనైనా పోరాడతామని చంద్రబాబు అనంరు.... విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుంటే, కేంద్రం పై సుప్రీం కోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని అని చంద్రబాబు అన్నారు...

cbn collectors conf 19012018 3

మొన్న ప్రధానిని కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు... విభజన చట్టంలో ఉన్నవే కోరుతున్నామని, అదనంగా అడగటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దక్షిణాదిలో తలసరి ఆదాయంలో మనం అట్టడుగున ఉన్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సామర్ధ్యం లేక తలసరి ఆదాయం తగ్గలేదన్నారు... ఇవన్నీ విభజన పాపాలు అని అన్నారు... ఇతర రాష్ట్రాలతో సమానస్థాయి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ ను కేంద్రం ఆదుకోవాల్సిందే అని, అది కేంద్రం బాధ్యత అని తెగేసి చెప్పారు...

జగన్ కొన్ని రోజులుగా జపిస్తున్న "నేనే సియం", "నేనే సియం" అనే నినాదం, రిపబ్లిక్ ఛానల్ అర్నబ్ గోస్వామికి తగిలినట్టు ఉంది... పాపం జగన్ బాధ చూసి తట్టుకోలేక, జగన్ ను కనీసం తన ఛానల్ లో అయినా సియం చెయ్యాలి అని అర్నబ్ అనుకున్నారో ఏమో పాపం, నిన్న ఒక సర్వే అంటూ హడావిడి చేసాడు అర్నబ్... ఆ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, మన రాష్ట్రానికి ఉన్న 25 ఎంపీ సీట్లలో, జగన్ పార్టీకి 13 సీట్లు వస్తాయి అని చెప్పాడు... అంటే సగానికి పైగా పార్లమెంట్‌ సీట్లు గెలుచుకుంటే...అసెంబ్లీ స్థానాల్లో ఖచ్చితంగా మెజార్టీ మార్కు దాటుతుందని అర్నబ్ అంచనా వేసి అలా అయినా కొన్ని రోజులు జగన్ ను సియం భ్రమలో ఉంచింది...

arnab 19012018 2

2014 లో జగన్ కు వచ్చిన ఎంపీ సీట్లు 8... ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప పార్లిమెంట్ తప్ప, ఎక్కడా కన్ఫర్మ్ సీట్ లేదు... అటు తిప్పి, ఇటు తిప్పి చూసినా, మహా అయితే 3 నుంచి 5 సీట్లు వస్తాయి అనేది ఇక్కడ ఉన్న వారి అంచనా... అలాంటిది ఏ ప్రాతిపదికన 13 వస్తాయి అంటున్నాడో అర్నబ్ కే తెలియాలి.. అసలు జగన్ అనే వాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాడని జనం మర్చిపోయి చాలా రోజులు అయ్యింది... మరో పక్క చంద్రబాబు అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండిటిలో సమానంగా దూసుకుపోతున్నారు... అలాంటిది ముఖ్యమంత్రి చంద్రబాబును కాదని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్‌ కావాలని ఎవరైనా కోరుకుంటారా ?

arnab 19012018 3

ఈ రిపబ్లిక్ టీవీ, అమిత్ షా మౌత్ పీస్ అనే ప్రచారం కూడా ఉంది... అన్ని రాష్ట్రాల్లో NDAకి అనుకూలంగా సర్వే చెప్పిన అర్నబ్, మన రాష్ట్రంలో మాత్రం జగన్ కు అనుకూలంగా చెప్పాడు... అంటే, దీని వెనుక బీజేపీ పెద్దల ఆలోచన ఎమన్నా ఉందా ? అసలు ఈ సర్వే కామెడీ ఇది... 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అర్నబ్ రిపబ్లిక్, సీ వోటర్ సర్వే చేసింది 60,000 మందిని... అంటే సగటున ఒక నియోజకవర్గానికి కేవలం 110 మంది... 25 నియోజకవర్గాలకు గానూ ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు 3.68 కోట్లు... అంటే సగటున ఒక నియోజక వర్గానికి 14 లక్షల 72 వేల మంది ఓటర్లు... 14,72,000 ఓటర్లకు గానూ 110 మందిని సర్వే చెయ్యడం అంటే సర్వే శాంపిల్ సైజు 0.0074%.. ఇదో సర్వే.. మళ్ళీ దీనికో పెద్ద బిల్డ్ అప్... ఇది చూపించి జగన్ ను బకరా చెయ్యటం తప్ప మరే ఉపయోగం లేదు..

రాష్ట్రాలు విడిపోయాయి... ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నాము... అయినా సరే, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తన రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం, ఎప్పుడూ ఆంధ్రా ప్రజలని, ఆంధ్రా ప్రాంతాన్ని కించ పరుస్తూనే ఉంటారు.. నిన్న ఇండియా ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కెసిఆర్ మాట్లాడతూ, అసలు మాకు ఆంధ్రప్రదేశ్ తో పోలిక ఏంటి ? హైదరాబాద్ కి వీళ్ళు చేసింది ఏముంది ? చంద్రబాబు లాంటి వారు హైదరాబాద్ ని నాశనం చేసారు, ద్వంసం చేసారు అని అన్నారు... అలాగే నిన్న నీతీ అయోగ్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, హైదరబాద్ లో ఉన్న ఆంధ్రా వాళ్ళు అందరూ ఆంధ్రా వచ్చేస్తే, ఆంధ్రాప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందుతుంది అని వ్యాఖ్యలు చేసారు...

cbn 19012018 2

కెసిఆర్ వ్యాఖ్యల పై, నీతీ అయోగ్ వైస్ చైర్మన్ వ్యాఖ్యల పై చంద్రబాబు ఇవాళ స్పందించారు... కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, ఐఏఎస్ లు కూడా కెసిఆర్ వ్యాఖ్యల పై అభ్యంతరం తెలిపారు... చంద్రబాబు చాలా హుందాగా స్పందించారు... ఆంధ్రప్రదేశ్ తో పోలికే లేదని కేసీఆర్‌ అన్నారని, అయితే, నేను తెలంగాణ ప్రజలను నిందించను అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలేమీ తప్పు చేయలేదని, నాటి పాలకులు చేసిన పాపం ఫలితమిది అని చంద్రబాబు అన్నారు.... 1995కు ముందు.. తర్వాత హైదరాబాద్ ఎలా ఉందో పరిశీలిస్తే.. ఎవరు అభివృద్ది చేశారో తెలుస్తుందని చంద్రబాబు అన్నారు... ఏపీ ప్రజలు చేతగానివాళ్లేం కాదని ఆయన వ్యాఖ్యానించారు...

cbn 19012018 3

అలాగే సీనియర్‌ ఐఏఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం కూడా కేసీఆర్‌ వ్యాఖ్యల పై అభ్యంతరం వ్యక్తం చేసారు... ఆంధ్రా పాలకులు తెలంగాణను విధ్వంసం చేశారన్న వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ అన్నారు... అంతేగాక హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేశారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య కూడా అభ్యంతరం తెలిపారు.... అలాగే నీతీ అయోగ్ వైస్ చైర్మన్ వ్యాఖ్యల పై స్పందిస్తూ, హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాబట్టే అందరూ వెళ్లారని, మళ్లీ అక్కడి నుంచి రమ్మనడమేంటి? అని అన్నారు.... ఇది చంద్రబాబుకి, కెసిఆర్ కి ఉన్న తేడా... చంద్రబాబు కూడా మా ఆంధ్రా వారి వాళ్ళే మీ హైదరాబాద్ బ్రతుకు అంటే, రాజకీయంగా ఆంధ్రా ప్రాంతంలో హీరో అవుతారు... కాని, ఆయన అలాంటి పనులు చెయ్యరు... ఆయనకు తెలుగు ప్రజలు అందరూ సమానం అనుకుంటారు కాబాట్టే, కెసిఆర్ లాంటి వారి ఆటలు సాగుతాయి... ఈ క్రింది వీడియోలో, 5:44 నుంచి చూడండి...

Advertisements

Latest Articles

Most Read