ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన పై ఇటీవల అనేక మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే... సాక్షాత్తు భారత రాష్ట్రపతి కూడా ముఖ్యమంత్రి పని తీరుని మెచ్చుకున్నారు... ఇప్పుడు లిస్టు లో మహారాష్ట్ర గవర్నర్ కూడా చేరారు... విజయవాడలోని కనకదుర్గమ్మను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్ విద్యాసాగర్‌రావు పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో గవర్నర్ విద్యాసాగర్‌రావు మాట్లాడారు...
అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్ విద్యాసాగర్‌రావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కూడా ఎంతో బాగా పని చేస్తున్నారు అని అన్నారు... కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు... గవర్నర్ విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీసాయి...
రాష్ట్రంలో బీజేపీ నేతలు, ప్రస్తుతం ఉన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను మార్చమని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు... నరసింహన్ ను మార్చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది... ఆయన స్థానంలో తెలుగు వాడు అయిన విద్యాసాగర్‌రావు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్తునంరు... ఇప్పుడు విద్యాసాగర్‌రావు విజయవాడలో మాట్లాడిన మాటలతో, ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది...