మనం ఒక సామాన్యుడిగా ప్రధానికి లేఖ రాస్తే, ప్రధాని కార్యాలయం స్పందిస్తుందా ? అదీ ఒక రాజకీయ ఆరోపణ చేస్తూ ఒక సామాన్యుడు లేఖలు రాస్తే, ప్రధాని కార్యాలయం అసలు అలాంటివి తీసుకుంటుందా ? చింపి చెత్త బుట్టలో పడేస్తుంది... కాని ఇక్కడ మాత్రం, ఒక అనామకుడు పోలవరంలో అన్యాయం జరిగిపోయింది అని లేఖలు రాస్తే వెంటనే స్పందిస్తుంది, ప్రధాని కార్యాలయం... రాష్ట్ర ప్రభుత్వం, సమాధానం ఆ అనామకుడికే చెప్పాలి అంటుంది... ఇలాంటి వింత ఎక్కడైనా చూసారా ? పోలవరం ఆపటానికి, పన్నిన మరో పన్నాగంలా ఇది ఉంది అంటున్నారు...
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ప్రాంతానికి చెందిన వ్యక్తి... అతని పేరు చౌదరయ్య అంట.. రిటైర్డ్ లెక్చరర్... పోలవరం ప్రాజెక్ట్ లో అన్యాయం జరిగిపోతుంది అంటున్నాడు...భూసేకరణలో అన్యాయం జరిగిపోయింది అంటున్నారు... పట్టిసీమ దండుగ అంటున్నాడు... పురుషోత్తపట్నం దండుగ అంటున్నాడు... ఇవన్నీ మన రాష్ట్రంలో ఎవరు మాట్లాడతారో తెలుసుగా ? మరి ఈ చౌదరయ్య గారికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు ? సరే ఈయన పొలిటికల్ మోటివ్ తో పంపించాడు... కేంద్రానికి ఇవన్నీ తెలియవా ? అన్నీ తెలియకుండానే, పోలవారానికి చిల్లర విదులుస్తుందా ? ఆ చిల్లర ఇవ్వటానికి కూడా వారానికి ఒకడు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు... ఒకడు డిజైన్ మార్చమంటాడు... ఒకడు తొందరగా పూర్తి చెయ్యాలి అంటాడు.. ఒకడు అది కావిలి అంటాడు... ఇంకొకడు మరొకటి అంటారు.... ఇంత మంది ఓకే అంటే కాని ఆ చిల్లర ఇవ్వటం లేదు...
ఒక పక్క ప్రధాన కాంట్రాక్టర్ దివాలా తీసాడు అని, అతని బ్యాంక్ ఎకౌంటు లో వేసిన నగదు, బ్యాంకులు ఇవ్వటం లేదు... ఇంకా అవినీతికి ఆస్కారం ఎక్కడ ? బిల్లులు చూపించి, కేంద్రం ఒకే చేస్తేనే అవి కాంట్రాక్టర్ ఎకౌంటులో పడేది... అయినా ఒక అనామకుడి లేఖకి, ఆఘమేఘాల మీద విచారణ చేయ్యమంటం ఏంటి ? మళ్ళీ పోలవరం డిలే చేసే కార్యక్రమమా ? ఈయనకు అన్ని ఆధారాలు ఉంటె కోర్ట్ కి ఎందుకు వెళ్ళరు ? ఆధారాలు కోర్ట్ లో ఇస్తే సరిపోతుందిగా ? ఈ డ్రామాలు ఏంటి ?చివరకి ఏది లేదు అని తేలుస్తారు... మరో రెండు నెలలు వేస్ట్ చేస్తారు... కాఫర్ డ్యాం విషయంలో ఇలాగే చేసారు.. చివరకి రెండు నెలలు సమయం వృధా చేసి, ఒకే అన్నారు... అయినా, మాకు విభజన సమస్యలు ఇన్ని ఉన్నాయని , కొన్ని వేల ఉత్తరాలు రాష్ట్ర ప్రభుత్వం రాస్తుంటే చెత్త బుట్టలో పడేస్తున్న కేంద్రం, ఒక అనామకుడి లేఖకి ఇంత హడావిడి ఏంటి ? ఆంధ్రులు అన్నీ గమనిస్తున్నారు... ఇప్పటికే మాకు అన్యాయం చేసినందుకు ఒక ఢిల్లీ పార్టీకి నామరూపాలు లేకుండా చేశాడు.. గుర్తు పెట్టుకుంటే మీకే మంచిది...