ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖ వ్యాపార దిగ్గజం "టై " వ్యాపార సంస్థ ఇక నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా పాలుపంచుకోనున్నది. దేశ విదేశాల్లో భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ తనదైన ముద్ర వేసిన "టై " సంస్థ అమరావతి అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కాబోతున్నది. బుధవారం మంత్రి నారా లోకేశ్ చేతులు మీదుగా ప్రారంభంకాబోతున్న ఈ ఆధునిక వ్యాపార సంస అనేక దేశాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నది. ఈ సంస్థ ఒక లాభాపేక్ష లేని సంస్థగా ప్రసిద్ధి చెందింది.
కొత్త ఆలోచనలు, భవిష్యత్ అవకాశాలు నెట్వర్కింగ్ సెషన్స్ పెట్టుబడిదారులతో మాట్లాడడం, వర్క్ షాపులు నిర్వహించడం, ముఖాముఖి పరిచయ కార్యక్రమాలు నిర్వహించడం,సెమినార్లునిర్వహించడం, రోడ్ ట్రిప్స్ తదితర కార్యక్రమాలను టై అమరావతి సంస్న ఔత్సాహిక వ్యాపారవేత్తలతో నిర్వహిస్తోంది. 2,500 మందికి పైగా అనుభవం ఉన్న వ్యాపారవేత్తలు, వ్యాపార కార్యనిర్వాహకులు, చార్టర్ సభ్యులు ఈ టై అమరావతి సంస్థలో భాగస్వాములై ఉన్నారు. 8500 మంది ఔత్సాహికులు, నిపుణులు సభ్యులుగా ఉన్నారు.18 దేశాల్లో 61 చాప్టర్లను కలిగి ఉంది. వ్యాపారంలో సంపదను సృషించడం పై దృష్టి పెట్టడడంలో దిట్టగా పేరుగాంచింది. నిరంతరం సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తుంది. వందలకొద్ది అంకితమై పని చేసే వాలంటీర్లు ఇందులో ఉన్నారు.
పంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సమాజం ఈ సంస్థకు ఆహ్వానం పలుకుతోంది. వ్యాపారం రంగంలో వస్తున్న నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టడడమే కాకుండా వ్యాపార దృక్పధాన్ని మార్చడం, కొత్త ఆలోచనలకు పునాది వేయడంలో టై అందే వేసిన చేయిగా చెబుతుంటారు. 1992లో సిలికాన్ వ్యాలీలో స్థాపితమైన ఈ టై వ్యాపార సంస్థ ఒక విజయవంతమైన ప్రముఖ వ్యాపార దిగ్గజంగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. ఆంధ్రప్రదేశ్ లో వేగంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం, నిధుల సమీకరణ సులభతరం చేయడం పై ప్రధానంగా దృష్టిపెడుతుంది.