ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్, నిన్న చిత్తూరు జిల్లాలో మాట్లాడిన మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది... ఒక ప్రతిపక్ష నేతగా, రేపు అధికారం రావాలి అంటే, అధికారంలో ఉన్న వాళ్ళు చేసే తప్పులు ప్రజలకి చెప్పాలి, వాళ్ళని తన వైపు తిప్పుకునేలా నమ్మకం కలిగించాలి, తాను ఏమి చేస్తాడో చెప్పాలి... అప్పుడు ప్రజలు నీ మాటలు విస్వసిస్తే, నీకు ఓటు వేస్తారు, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తారు... నిన్న జగన్ మాట్లాడిన మాటలు, తన పరిస్థితిని తెలియ చేస్తున్నాయి... ఈ సారి అధికారం రాకపోతే తాను, తన పార్టీ, తన కేసులు ఏమైపోతాయో జగన్ కు పూర్తి క్లారిటీ ఉంది... అందుకే జగన్ అంత దిగజారిపోయి మాట్లాడాడు....
నిన్న చిత్తూరు జిల్లాలో పాదయత్ర చేస్తున్న జగన్, ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తూ, రాజశేఖర్రెడ్డి కంటే రాష్ట్రాన్ని రెండింతలు అభివృద్ధి చేస్తానని జగన్ చెప్పారు. ఆ ఒక్క ముక్క మాట్లడితే పరవాలేదు కాని, రాజశేఖర్రెడ్డి కంటే రాష్ట్రాన్ని రెండింతలు అభివృద్ధి చేస్తానని, "దయచేసి" ఒక్కసారి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరుకున్నాడు... "దయచేసి" అని జగన్ ఇలా బహిరంగంగా అర్థించడంతో రాజకీయాలు మీద కనీస అవగాహన ఉన్న వాళ్లు ఆ మాట విని అవాక్కయ్యారు... జగన్ మనస్తత్వం తెలిసినవారు, జగన్ ఇలా దిగజారి అర్థించడంతో, జగన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది అని అంటున్నారు...
ఒక పక్క జగన్ మాట్లాడుతున్న అదే రాజశేఖర్ రెడ్డి, దాదాపు రెండు దశబ్దాల పాటు అధికారం కోసం పోరాడాడు అని, ఎప్పుడు ఇలా "దయచేసి" నన్ను గెలిపించండి, నా గెలుపు కోసం ప్రార్ధించండి, నేను ముఖ్యమంత్రి అయితేనే మీ సమస్యలు తీరుస్తా అని ప్రజల దగ్గర ఇలా మాట్లాడలేదు అని గుర్తు చేసుకుంటున్నారు... చంద్రబాబు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా, పాదయత్ర చేసినా, ప్రజల సమస్యలు గురించి ప్రస్తావిస్తూ, నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్లారు అని, ఇలా సొంత డబ్బా కొట్టుకుని పాదయత్ర చెయ్యలేదు అని, అందుకే చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలు ప్రజలతో కనెక్ట్ అయ్యాయి అని, సక్సెస్ అయ్యాయి అని, జగన్ విషయంలో మాత్రం అంతా సినిమా సెట్టింగ్ లాగా, వాస్తవానికి దూరంగా, పైడ్ ఆర్టిస్ట్ ల చేత జరుగుతుంది కాబట్టే, జగన్ ఇలా దిగజారి మాట్లాడాల్సి వస్తుంది అని అంటున్నారు... ఇప్పటికైనా జగన్, తన శైలి మార్చుకుని, నిజమైన ప్రజా సమస్యల మీద ద్రుష్టి పెడితే ఉపయోగం ఉంటుంది అని అంటున్నారు...