మన రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు, ఈ మీడియా చూపించదు... వారికి కత్తులు, సుత్తులు, మందు తాగి దొరికిన వారు, పక్కనోడి ప్రైవేటు లైఫ్ ల్లో ఏమి జరిగింది, ఇవే కావలి... ప్రజల ఆలోచనలు వీటి చుట్టూతా తిప్పుతున్నారు... పొద్దున్నే 7:30 గంటలకు చర్చలతో మొదలు, పడుకునేదాకా మన వార్తా చానల్స్ చూపించేది ఇదే... కాని మన రాష్ట్రం ఏమి చేస్తుందో, దేశం గుర్తించింది, ప్రపంచం గుర్తించింది... దౌర్భాగ్యం, ఇలాంటి మంచి పనులు మీద మన మీడియా చర్చలు పెట్టదు... మన బలం ఇదీ అని మీడియా ప్రజలకు చెప్పదు.. దాని వెనుక హైదరాబాద్ మాఫియా ఉంది అనుకోండి, అది వేరే చర్చ...

bill gates 09012018 2

మొన్న సాక్షాత్తు భారత రాష్ట్రపతి మనల్ని మెచ్చుకుంటూ ట్వీట్స్ చేస్తే, ఇప్పుడు ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మన రాష్ట్రాన్ని, రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబుని మెచ్చుకుంటూ అమెరికా నుంచి లెటర్ రాసారు... అసలు ఈ బిల్గేట్స్ ఎవరు ? మన దేశంతో ఈయనకు పని ఏమిటి, పైగా ఆంధ్రా ముఖ్యమంత్రి కి ఈయన కితాబు ఇవ్వాల్సిన పని ఏమిటి? ఎందుకంటే ఆయన మనం చేస్తున్న మంచి గుర్తించారు కాబట్టి... వ్యవసాయంలో రాష్ట్రాన్ని ఇన్నోవేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు. గత నెలలో జరిగిన అగ్రిటెక్‌ సదస్సు ముఖ్యమంత్రి దూరదృష్టికి అద్దం పడుతోందన్నారు. భూసార పరీక్షల మ్యాపింగ్‌తో పాటు వ్యవసాయ విధానాలను రైతులకు చేరవేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు...

bill gates 09012018 3

అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆ లేఖలో రాయటం... ఆరోగ్యరంగంలో చేపడుతున్న సంస్కరణలు, పొరుగు సేవల విధానంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు కితాబిచ్చారు. అధికశాతం ప్రజలకు బీమా సౌకర్యం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ భారత్‌లోనే ముందంజలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు... ఇంటి కుక్క మొరగనట్లు,పెరటి వైద్యం పనికి రానట్లు మన రాజకీయ పార్టీలు, మీడియా, సినిమా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విషయంలో చేస్తున్నారు.... ఏది ఏమయినా, ఎవరు ఎన్ని గడ్డలు వేసినా ఆంధ్రుల కలలు చంద్రబాబు గారు మాత్రమే సాకారం చేయగలడు. మీకు ప్రతి ఆంధ్రుడు అండ ఉంటుంది బాబుగారు, వీళ్ళని పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలి...

సీనియర్ నటుడు, మాజీ ఎమ్మల్యే బీజేపీ నేత కోట శ్రీనివాసరావు మహా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు విషయాలు ప్రస్తావించారు... సినిమాలు గురించి విషయాలు చెప్పిన కోటా, రాజకీయాల పై కూడా మాట్లాడారు... ముందుగా సొంత పార్టీ గురించి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో మన దౌర్భాగ్యం ఏంటంటే.. బీజేపీకి ఊతం పట్టి నడిపే నాయకులు లేరు. బీజేపీకి దాని స్థానం దానికి పదిలం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొన్ని స్థానాలు వస్తే వస్తాయి. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పరచడం మాత్రం బీజేపీకి కష్టమే, అని అన్నారు.

kota 08012018 1

అలాగే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు గురించి మాట్లాడుతూ, ఎవరి కాన్ఫిడెన్సు వారిది, ఇప్పుడు,‘నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని, నేనే ముఖ్యమంత్రిని’ అని జగన్మోహన్ రెడ్డి గారు అనట్లేదా, సోము వీర్రాజు వ్యాఖ్యలు కూడా అంతే అని అన్నారు.. అలాగే రోజా మీద మాట్లాడుతూ, ‘నిర్మొహమాటంగా చెప్పాలంటే..రోజా గారిని పొలిటికల్ లీడర్ గా నేను పరిగణించను.. పట్టించుకోను. ఆమె మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు... ఈ మధ్య టీవీలో..బండ్ల గణేశ్, రోజా పోట్లాడుకోవడం చూశాను. ఏమిటా మాటలు? ఏమన్నా అర్థముందా? పోనీ, బండ్ల గణేశ్ అంటే ఏదో కుర్ర వెధవ, పిచ్చోడిలా వాగాడు. రోజా కేంటీ.. నువ్వు అనుభవజ్ఞురాలివి, ఎమ్మెల్యేగా చేశావు. ఆ అమ్మాయి గురించి నేనేమి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. బయటకు కనపడుతున్నది అది అని కోటా అన్నారు...

kota 08012018 2

అలాగే చంద్రబాబు గురించి మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ చంద్రబాబు చేతిలో ఉండటమే మంచిదని కోటా అన్నారు... తెలంగాణలో కెసిఆర్ కి వడ్డించిన విస్తరి... ఆంధ్రలో అలా కాదు కదా, ఆకులు పట్టుకుని విస్తరి తయారు చేసుకోవడమే కదా! నా లెక్క ప్రకారం..హైదరాబాద్ లో ఉన్న రోడ్ల లాగా బెజవాడ, అమరావతిలో రావాలంటే కనీసం ఇరవై సంవత్సరాలు పడుతుంది. ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయనాయకుడు, మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు. ఏపీ ఆయన చేతిలో ఉండటమే మంచిది. అంతకన్నా ఎవరూ చేయగలిగిందేమీ లేదు. ఆయన తప్పా ఇంకెవరు అభివృద్ధి చేయగలరు?’ అని చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వ జన్యు పరిశోధనా సంస్థ అయిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB) తెలంగాణా ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చింది.. మా సమస్యలు వెంటనే తీర్చకపోతే, తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోతాము అని అల్టిమేటం ఇచ్చింది... ఈ సంస్థ కోసం, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్ పోటీ పడుతున్నాయి.. కేంద్రంలో కూడా లాబీ జరుగుతుంది. ఈ సంస్థ తెలంగాణాలో ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా, ఇప్పటి వరకు తెలంగాణా ప్రభుత్వం ఏ సహకారం అందించకపోవటంతో, తెలంగాణా నుంచి ఆ సంస్థని తరలించాలి అనే ఆలోచనకు వచ్చారు...

ccmb 08012018 2

ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 2009 లో అప్పటి UPA కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు కేటాయించింది. అప్పటి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 114 ఎకరాలు ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించింది. కానీ అప్పటి నుంచి భూమి మాత్రం అప్పగించ లేదు. చివరగా భూమి అప్పగించినా, అది లిటిగేషన్ లో ఉంది... ఆ భూ యజమాని కోర్ట్ లో కేసు వేసాడు... మూడు సంవత్సరాల్లో అధికారంలో ఉన్న, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భూమి ఇవ్వలేదు... ప్రత్యామ్నాయ భూమిని అందించలేదు... ఎన్ని సార్లు కేంద్రం అడిగినా, తెలంగాణా ప్రభుత్వం మాత్రం స్పందించటం లేదు...

ccmb 08012018 3

దీంతో రూ .1,200 కోట్ల ప్రాజెక్టును మరో రాష్ట్రానికి మార్చాలని కేంద్రం ఆలోచిస్తుంది. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగంలోకి దిగింది... తెలంగాణా నుంచి సంస్థను తరలించే పక్షంలో, ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలని, అన్ని విధాలుగా సహకరిస్తామని, భూమి కూడా రెడీగా ఉంది అని సంప్రదింపులు జరుపుతున్నారు.. ముఖ్యమంత్రి ప్రపోసల్ తో కేంద్రం దాదాపు సరే అన్నట్టు సమాచారం.. చివరి అవకాశంగా తెలంగాణా ప్రభుత్వానికి మరో అవకాసం ఇచ్చి, వారు స్పందించక పొతే, 1,200 కోట్ల రూపాయల కేంద్ర సంస్థ ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాసం ఉంది...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండిగో విమానయాన సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది... ఆదివారం నుంచి ఇండిగో తన కార్యకలాపాలను తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రారంభించింది. మొట్టమొదటి సారిగా తిరుపతి నుంచి బెంగళూరు, హైదరాబాద్‌లకు అనుసంధాన విమాన సర్వీసులను మొదలుపెట్టింది. బెంగళూరుకు నుంచి తిరుమలకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ. అయితే ఇప్పటి వరకు బెంగళూరు నుంచి తిరుపతికి విమానం లేదు. ఇప్పుడు బెంగళూరు నుంచి అనుసంధాన విమానం అతి తక్కువ ధర రూ.1500కే అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

indigo 08012018

రేణిగుంట నుంచి హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, దిల్లీ, బెంగళూరు, ముంబయి ప్రాంతాలకు విమాన సర్వీసులు ప్రస్తుతం నడుస్తున్నాయి. ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియాతో పాటు ట్రూజెట్‌, ఎయిర్‌కోస్టా, స్పైస్‌జెట్‌లకు తోడుగా ఇప్పుడు ఇండిగో తన సర్వీసులు ప్రారంభించింది. రోజువారీ 13 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక ప్రత్యేక విమానాలు ఉన్నాయి. స్పైస్‌జెట్‌ విమానం రోజూ సాయంత్రం 4.30గంటలకు రేణిగుంట నుంచి బయలుదేరి హైదరాబాద్‌ మీదుగా ముంబయి చేరుకుంటుంది. ఎయిర్‌ ఇండియా విమానం రోజూ మధ్యాహ్నం 2.20 నిమిషాలకు రేణిగుంట నుంచి హైదరాబాద్‌ మీదుగా దిల్లీ చేరుకుంటుంది.

indigo 08012018

అయితే తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు... ఎప్పటి నుంచో అదిగో ఇదిగో అంటున్నా, ఇప్పటి వరకు అంతర్జాతీయ సర్వీసులు మొదలు కాలేదు... ఇది తొందరగా మొదలు పెట్టాలి అని ప్రజలు కోరుకుంటున్నారు... చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పీలేరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరుతో పాటు రాయాలసీమ జిల్లాల నుంచి గల్ఫ్‌ వెళ్లే కార్మికులు ఎక్కువ. దీంతో రేణిగుంట నుంచి మొదటిగా దుబాయికి సర్వీసును ప్రారంభించాలన్న డిమాండ్‌ ఉంది. శ్రీవారి దర్శనానికి ఏటా రెండు నుంచి అయిదు లక్షల మేర విదేశీయులు వస్తున్నారు. ఈ సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. విదేశీ విమానాలు నడిపే వీలుంది...

Advertisements

Latest Articles

Most Read