సముద్రంలో అలలు... తీరంలో జన తరంగాలు స్వర మాంత్రికుడు ఏఆర్ రహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ తో కాకినాడ తీరం మైమరిచిపోయింది. కాకినాడ సాగర సంబరాల సందడి గురువారం ఏఆర్ రెహమాన్ షో తో ఘనంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా కాకినాడలో 'అందరికీ ఆహ్వానం అంటూ రెహమాన్ సంగీత విభావరి ఏర్పాటైంది. దీంతో కాకినాడతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలు, పక్క జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో సంగీతాభిమానులు కాకినాడకు తరలివచ్చారు. దాదాపు 3 లక్షల మంది ప్రజలు పాల్గుంటే, మన హైదరాబాద్ మీడియా చానల్స్ కనీసం ఒక సెకండ్ల న్యూస్ కూడా ఇవ్వలేదు...
పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు తమ కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షో ప్రారంభమయ్యే సరికి సుమారు మూడు లక్షల మంది జనం ఎన్టీఆర్ బీచ్ కు చేరుకున్నారు. రెహమాన్ వేదిక పైకి రాగానే ఒక్కసారిగా ఉర్రూతలూగారు. రాత్రి 7.30 గంటల నుంచి మూడున్నర గంటలపాటు రెహమాన్ షో సాగింది. తెలుగు, హిందీ పాటలతో రెహమాన్, ఆయన బృందంలోని గాయకులు ప్రేక్షకులను మంత్రముగుదుల్ని చేశారు.
ఈ సందర్భంగా అత్యద్భుతమైన సాంకేతిక తతో వేదికపై స్క్రీన్ లు, ఆధునిక సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెహమాన్ నీ మంత్రులు యనమల , నిమ్మకాయల చినరాజప్ప అయ్యన్నపాత్రుడు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సత్కరించారు. అయితే, ఈ విషయం తెలిసిన చాలా మంది సామాన్య ప్రజలు, ఏ ఛానల్ అన్నా లైవ్ ఇస్తారేమో అని చాలా ఆశగా చానల్స్ మార్చి మార్చి చూసినా, పనికిమాలిన లైవ్ చర్చలు ఇచ్చారు కాని, ఒక్కరు కూడా ఈ ఈవెంట్ లైవ్ ఇవ్వలేదు... కనీసం న్యూస్ ఐటెంగా కూడా వెయ్యలేదు... ఏమి చేస్తాం మన ప్రాప్తం అంత వరుకే...