వర్చ్యువల్ రియాలిటీ, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ... ఇవన్నీ మాట్లాడుతుంది, ఈ టెక్నాలజీలు వాడుతుంది, ఏ మైక్రోసాఫ్ట్, గూగులో అనుకునేరు... ఇవన్నీ మాట్లాడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి... మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... టెక్నాలజీ పట్ల, ఆయనకు ఉన్న అవగాహన, టెక్నాలజీ ఉపయోగించుకుని సమర్ధవంతమైన పరిపాలన చెయ్యటం, టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూశాం... ఇప్పుడు, ఈ టెక్నాలజీతో ప్రజలను అనుసంధానం చేస్తూ, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఈ నెల 27న భారత రాష్ట్రపతి అమరావతిలో ప్రారంభించనున్నారు.. రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్ర కార్యక్రమానికి రావటం అంటే చాలా అరుదు... ఇంతలా పరిపాలనలో సాంకేతికతను జోడించిన రాష్ట్ర ప్రభుత్వ పనితీరు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను విశేషంగా ఆకట్టుకుంది. అందుకే ఆయన స్వయంగా రావటానికి ఒప్పుకున్నారు.

rastrapati 22122017 2

రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి, రాష్ట్రంలో చంద్రబాబు అవలంభిస్తున్న టెక్నాలజీ అంశాలపై ప్రత్యేకంగా ఆరా తీయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలను రాష్ట్రపతి ఇప్పటికే ఆయన తెప్పించుకున్నారు. రాష్ట్రపతి పర్యటనలో పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులను రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వీక్షించనున్నారు. అదే విధంగా ఫైబర్‌గ్రిడ్‌ ప్రారంభించే సమయానికి ఆయా ఇళ్లల్లో టీవీలు ఆన్‌చేసుకుని ఉన్నవారితో రాష్ట్రపతి ముఖాముఖి మాట్లాడే వీలుంది. అటు నుంచి కూడా, ప్రజలు రాష్ట్రపతితో మాట్లాడతారు..

rastrapati 22122017 3

తరువాత, ఉండవల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టిన వర్చువల్‌ క్లాస్‌రూంని పరిశీలిస్తారు. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి రాష్ట్రపతి విద్యుత్‌ కారులో వెళ్తారు. సచివాలయంలో ఉండే రియల్‌టైమ్‌ గవర్నెర్స్‌ కార్యాలయంలో రాష్ట్రపతి దాదాపు గంటసేపు ఉంటారు. సాంకేతికతను ఉపయోగించి ఉద్యోగులు, సంక్షేమ పథకాల లబ్దిదారులతో ఎలా మాట్లాడుతున్నది చంద్రబాబు వివరిస్తారు. పాలనలో వేగం, కచ్చితత్త్వం తెచ్చేందుకు ఈ కేంద్రం ఎలా ఉపయోగపడిందన్న విషయాలను వివరిస్తారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read