చంద్రబాబు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, అధికారంలో ఉంటే, మన ఫోకస్ అంతా అభివృద్ధి మీదే ఉండాలి.... రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమే చెయ్యాలి అని... చంద్రబాబుని ఆ అభివృద్ధి, అమరావతి, పోలవరం అనే పిచ్చాలోనే ప్రతిపక్షాలు ఉంచాల్సింది... కాని ఆయన్ను ఇబ్బంది పెట్టటానికి, తీవ్ర స్థాయిలో రాజకీయం చేస్తున్నారు.. చివరకి పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్ట్ లు ఆపటానికి కూడా వేనుకాడుట లేదు... దీంతో చంద్రబాబు మూడో కన్ను తెరిచారు... అభివృద్ధి నుంచి రాజకీయం వైపు అడుగులు వేస్తున్నారు... మొదటి రెండు అడుగులే, ఒక సంచలనం అయ్యాయి... ఒకటి పోలవరం పై కేంద్రం పై ధిక్కారం, రెండు కాపు రిజర్వేషన్...

cbn 02122017 2

ఈ రెండు అడుగులతో జగన్, కేంద్రం, ముద్రగడ ఇలా మొత్తానికి చంద్రబాబు ఎర్త్ పెట్టారు... కక్కలేక, మింగలేక ఎలా స్పందించాలో తెలీక, జుట్టు పీక్కుంటున్నారు... ఇవన్నీ డైరెక్ట్ గా ప్రజల ఎమోషన్ తో అటాచ్ అయ్యి ఉన్న సమస్యలు... చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవటంతో, ప్రతిపక్షలకు షాక్ తగిలింది... ముద్రగడ అయితే, ఇవాళ సాయంత్రం దాకా స్పందించలేదు అంటే, చంద్రబాబు ఎలాంటి దెబ్బ కొట్టారో అర్ధమవుతుంది... ఇటు ప్రజలకు మేలు చేసేలా, ఇటు రాజకీయంగా కూడా చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు...

cbn 02122017 3

రాజ‌కీయ వ్యూహాలు, చ‌తుర‌త‌లో త‌న‌ను మించిన వారు లేరని మ‌రోసారి నిరూపించారు చంద్ర‌బాబు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కీల‌కంగా మారే అన్ని అంశాల‌పై ప్ర‌జ‌ల‌కు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు... ఇప్పుడు కేంద్రం కోర్ట్ లో పోలవరం, కాపు రిజర్వేషన్ ఉన్నాయి... ఏ మాత్రం తేడా చేసినా, చంద్రబాబు ఉగ్ర రూపం చూపించటానికి రెడీగా ఉన్నారు... చంద్రబాబు లాంటి వ్యక్తి ఎన్డిఏ నుంచి బయటకు వస్తే, అది బీజేపీకి దేశవ్యాప్తంగా ఇబ్బంది అవుతుంది... ఇలాంటి ఛాన్స్ బీజేపీ తీసుకోకపోవచ్చు... మరో పక్క జగన్ అయితే సరే సరి... అసలు తన వ్యూహాలు ఏంటో, ఆ విధానాలు ఏంటో వారికే అర్ధం కావటం లేదు... అసెంబ్లీకి రాకుండా రోడ్లు మీద స్టేజి షోలు చేస్తుంటే, ప్రజలు ఎలా నమ్ముతారని అనుకున్నారో ఏంటో... మొత్తానికి రెండు రోజుల్లో అటు కేంద్రానికి, ఇటు జగన్ కు, మరో పక్క ముద్రగడకి ఊపిరాడకుండా చేస్తున్నారు చంద్రబాబు... అందుకే ఆయన్ను ఇంకొన్నాళ్ళు ఆ అభివృద్ధి అనే పిచ్చలోనే ఉంచాల్సింది... కాని ఇప్పటి నుంచే ఆయన్ను రాజకీయం వైపు తిప్పారు... అనుభవించండి...

పవర్ సెక్టార్ లో చంద్రబాబుని కొట్టేవాడు ఈ దేశంలోనే కాదు ప్రపంచలోనే లేరు అంటే ఆశ్చర్యం కాదు... గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవర్ సెక్టార్ లో రిఫార్మ్స్ తీసుకోవచ్చి, కరెంటు కోతలు లేకుండా చేశారు.... తరువాత 10 ఏళ్ళు అంధకారంలో ఉన్నాం... ఇప్పుడు మళ్ళి ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ పవర్ సెక్టార్ లోని అన్ని రంగాల్లో టాప్ లో ఉంది... కేంద్ర పవర్ సెక్టార్ లో ప్రకటించే అన్ని అవార్డ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయి... కరెంటు కూతలు లేవు... కరెంటు క్వాలిటీ పెరిగింది... కరెంటు కావలసినంత ఉత్పత్తి అయ్యి, మిగులు కరెంటు పక్క రాష్ట్రాలకి అమ్ముకునే స్థాయికి వచ్చాం... ఇప్పుడు సోలార్ లో ప్రపంచంలోనే టాప్ లో ఉన్నాం...

ap power sector 02122017 2

ఇదే ఇప్పుడు దేశానికి ఆదర్శం అయింది... జైపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి ఇంధన సామర్థ్య సదస్సులో ఇంధన సామర్థ్యం పెంపు, పొదుపు, ఎల్‌ఇడీ బల్బుల వాడకంపై ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం 29 రాష్ట్రాలున్నా మన రాష్ట్రానికే లభించటం ద్వారా ఎనర్జీ రంగంలో ఏపీ విజయాలను ప్రపంచం గుర్తించినట్లు స్పష్టమయింది. ఇంధన సామర్థ్య రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వరల్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ది వరల్డ్ బ్యాంక్ (అమెరికా), కొరియా ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ప్యారిస్), టోరో (కెనడా), టెరీ సంస్థలు, ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న ఇంధన సామర్థ్య చర్యలపై ఆసక్తి ప్రదర్శించాయి.

ap power sector 02122017 3

ఏపీ ఇంధన సామర్థ్య విధానంతో చేసిన 1781 మిలియన్ యూనిట్ల ఇంధన ఆదా, తద్వారా రూ.982 కోట్ల పొదుపు, కర్బన్ ఉద్గారాలను 1.35 టన్నులకు తగ్గించి మిగిలిన రాష్ట్రాల కంటే ఎంతో ముందున్న వైనానికి అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు లభించాయి. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో గత నెల 27 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు ఐదు రోజులు నిర్వహించిన ఇంటర్నేషనల్ సింపోజియం టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చి ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్‌స్పైర్-2017లో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు మనదేశ ఇంధన సామర్థ్య సంస్థల ప్రతినిధులకు పలు విలువైన సూచనలు చేశారు.

ఈ రాష్ట్రంలో 1956వ సంవత్సరం నుండి కూడా కాపులకి రిజర్వేషన్ కావాలని చెప్పి ఉద్యమాలు చేపట్టటం మొదలు పెట్టారు. అంతకముందు కాపులు ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉండేవాళ్లు. బీసీ లుగా ఉండేటటువంటి కాపులు ఆ రోజున నీలం సంజీవరెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కాపులు బీసీలో ఉంటె వీళ్ళకి అన్నిరకాల బెనిఫిట్స్ వస్తాయన్న ఉద్దేశంతో, వీళ్ళని అన్ని రంగాలుగా ముందుకెళ్లనివ్వకూడదు, వీళ్లది పెద్ద జాతి అనే ఉద్దేశంతో బీసీ లో ఉన్నటువంటి కాపుల్ని ఓసీ లో పెట్టటం జరిగింది. ఆ తరవాత దళితుడైన దామోదరం సంజీవయ్య, నిజంగా వీళ్ళు ఓసి లో ఉండటానికి అర్హులు కారు, ఆర్ధికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యా పరంగా కానీ చాలా వెనకపడిపోయి ఉన్నారు వీళ్ళని బీసీ లో ఉంచటమే న్యాయం అన్న ఉద్దేశంతోటి ఆ రోజు ఉన్నటువంటి కాపు, బలిజ, వంటరి, తెలగ, తూర్పు కాపు ఒక్క స్తితిగతులన్నీ కూడా చూసి ఆ రోజున మల్లి తిరిగి ఓసీలోకి తీసుకువచ్చినటువంటి కాపులని బీసీ లో పెట్టటం జరిగింది.

ఆ తరువాత ముఖ్యమంత్రి గా వచినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి, ఆ రోజు కుట్రతో అత్యధిక జనాభా ఉన్నటువంటి వీరికి ఏ రకమైన సదుపాయాలు దొరికిన సరే వీళ్ళు అన్ని రకాలుగా ముందుకి వెళ్తారనే కుట్ర తోనే, ఆరోజున తిరిగి మళ్ళీ కాపుల్ని ఓసీ లో పెట్టటం జరిగింది. అప్పటినుండి కూడా ఈ కాపు రిజర్వేషన్ మీద ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయ్. ఈ రాష్ట్రంలో అనేకమంది కాపు, బలిజ, వంటరి, తెలగ సంఘాల్లో అనేక మంది నాయకులు కాపు పెద్దలు, బలిజ పెద్దలు అందరు కూడా కాపులకి రిజర్వేషన్ కావాలని ఆందోళనలు జరుపుతూనే ఉన్నారు. కాని 2004 ఎన్నికల ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపుల్ని ఎట్టిపరిస్థితుల్లో కూడా బీసీ లో పెడతాను, మీరందరు కూడా నాకు సప్పోర్ట్ చేయండి అనిచెప్పి ఆ రోజున కాపు సంఘాల నాయకులని కాపుల్ని, కాపు పెద్దలందరిని కోరితే, ఆ ఎన్నికలలో అందరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కాపుల్ని బీసీ లో పెడతారనే ఆలోచనతో ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ ఇవ్వటం జరిగింది. ఆరోజున వైస్ రాజశేఖర రెడ్డి గారిని ఇదే బీసీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని సర్వేచేయటం కోసం 40 లక్షలు రూపాయలు ఖర్చవుతుంది, ఇవ్వమని చెప్పి అడిగితె ఆరోజు వైస్ రాజశేఖర రెడ్డి గారు 40 పైసలు కూడా ఇచ్చిన సందర్భంలేదు. ఆయన 2004 నుండి 2014 వరకు ఎటువంటి కాపుల్ని బీసీ లో పెట్టటానికి కావలసినటువంటి ఏ కార్యక్రమం కూడా తీసుకోలేదు. దానివల్ల మళ్ళీ 2014 ఎన్నికల ముంది కాపు సంఘాలు అన్ని కూడా చంద్రబాబు గారిని కోరటం వల్ల మళ్ళీ ఆరోజున చంద్రబాబు గారు ప్రామిస్ చేయటం మూలంగా 2014 ఎన్నికల మానిఫెస్టోలో చంద్రబాబు గారు కాపుల్ని బీసీ లో పెడతాను అని హామీ ఇచ్చారు హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

దానిలో భాగంగా రాజకీయానికి ప్రాధాన్యత ఇచ్చారు సుమారు 5 శాఖల మంత్రులు చిన్న రాజప్పగారు కానివ్వండి అదేవిధంగా ఘంటా శ్రీనివాస్ గారు కానివ్వండి అదేవిధంగా మాణిక్యాల రావు గారు కానివ్వండి నారాయణ గారు కానివ్వండి, మృణాలిని గారు కానివ్వండి ఇంతమంది కాపులకి ఎప్పుడుకూడా రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నపుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మంత్రులు లేరు ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి రాజకీయ మరి ప్రాధ్యాత ఉన్నటువంటి పదువులు కూడా లేవు. మరి అదే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చదలవాడ కృష్ణమూర్తి గారిని నియమించారు. ఈ విధంగా రాజకీయాల్లో కీలకమైనటువంటి పదవి రాష్ట్ర పార్టీ పదవి. ఆ పదవిని కూడా కిమిడి కళా వెంకట్రావు గారికి ఇవ్వటం జరిగింది. ఈ రకంగా కాపులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు గారు కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈరకంగా ఇన్ని సంవత్సరాల కృషి ఫలితంగా ఈరోజున చంద్రబాబు నాయుడు వచ్చినాకనే ఈ ఒక రిజర్వేషన్ పోరాటానికి ఒక మలుపు మొదలైంది. దానిలో భాగంగానే కాపుల్ని బీసీ లో పెట్టటంకోసం మంజునాథ్ కమిషన్ చేయటం జరిగింది.

కమిషన్ ద్వారా మాత్రమే చట్టభద్రత వస్తుంది, జీవో ద్వారా అయితే మీకు చట్టభద్రత రాదు, రేపు ప్రొద్దున కోర్ట్ లోకి వెళ్తే విగిపోతుంది అని సంఘాల నాయకులు, పెద్దలు అందరూకూడా కోరిన మీదట చంద్రబాబు నాయుడు గారు జీవో ద్వారా కంటే మరి కమిషన్ ద్వారానే అడుగుతున్నారు. అది కూడా ముందు రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపులకి మరి ఒకసారి రిజర్వేషన్ ఇచ్చిన తరువాత ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చిత్తశుద్ధి తో పనిచేయాలి వాళ్లు ఏ కోర్ట్ కి వెళ్లినా సరే వీగిపోకూడదు అన్న ఉద్దేశం తోటి మరి ఆరకంగా ఈరోజు మంజునాథ్ కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ ద్వారానే దానికి చట్టభద్రత తీసుకు రావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయటం జరుగుతోంది. ఈ రోజున జీవో ద్వారా అయితే ఆయన అనేక పరియాయలు మీకు జీవో అయితే ఎంత రెండు నిమిషాల్లో నేను జీవో ఇస్తాను అనిచెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ జీవో ద్వారా వద్దు, ఎందుకని అంటే ఒకసారి ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు జీవో ద్వారా ఒకసారి వైస్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే అది కోర్టులోకి వెళ్తే అది వీగిపోయింది. అందుకే ఇప్పుడు కమిషన్ నివేదిక ఆధారంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో ఇది తీర్మానం చేశారు... ఇది కేంద్రానికి పంపిస్తారు... ఇప్పుడు కేంద్రం కాని, ఎవరన్నా కోర్ట్ కి వెళ్ళినా, ఎవరూ దీన్ని ఇవ్వకుండా ఆపటం కుదరదు... ఎందుకంటే ఇక్కడ కమిషన్ రిపోర్ట్ ఉంది... ఇంత చిత్తసుద్ధితో చంద్రబాబు ఇన్నాళ్ళకు, కాపులకి న్యాయం చేశారు.

పోలవరం విషయంలో చంద్రబాబు, నితిన్‌ గడ్కరీని కలిసినప్పుడు, కొత్త టెండర్లు పిలిస్తే ఆ అదనపు భారం రాష్ట్రం భరిస్తుంది అని చెప్పారు... ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కోట్‌ చేసిన మైనస్‌ 14 శాతానికి మించితే.. ఆ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులకు కొత్త టెండర్లను పిలిచేందుకు తమకు అభ్యంతరం లేదంటూ నితిన్‌ గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ రిటైర్‌మెంట్‌కు మూడు రోజుల ముందు ఆ టెండర్లను ఆపాలంటూ కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేసి, పోలవరం విషయంలో గందరగోళ పరిస్థితికి దారి తీశారు..

polavaram ias 02122017

నిజానికి ఈ అధికారి పై, రాష్ట్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు ముందు నుంచి గుర్రుగా ఉన్నారు... జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హోదాలో పనిచేసిన అమర్జిత్‌ సింగ్‌ పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, సీఎం చంద్రబాబుతోనూ ఓ సందర్భంలో దురుసుగా మాట్లాడారని ఆ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి... గత ఏడాది జూన్‌ చివరి వారంలో పోలవరం ప్రాజెక్టుకు నిధులు, డిజైన్ల అనుమతులకు సంబంధించి చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. జాతీయ హోదా ప్రాజెక్టుగా గుర్తించినందున పోలవరానికి సంపూర్ణ సహకారం అందించాలని అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని సీఎం చంద్రబాబు కోరుతున్న సమయంలో అమర్జిత్‌ సింగ్‌ జోక్యం చేసుకున్నారు.

polavaram ias 02122017



‘వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒకలా ఉంటే అధికారులు చెబుతున్న లెక్కలు మరోలా ఉన్నాయని.. వాటిని నమ్మేస్తే ఎలా? ప్రాజెక్టుల నిర్మాణం గురించి మీకు తెలుసా?’ అని సీఎంని అమర్జిత్‌ సింగ్‌ ప్రశ్నించారు. అమర్జిత్‌ అలా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు మాత్రం సంయమనం పాటిస్తూ.. ‘ప్రాజెక్టుల నిర్మాణంలో ఎవరి నుంచైనా పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు బేషజాలు లేవు. కొత్త విషయాలను నేర్చుకోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను... జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించిన 18 సాగు నీటి పథకాల్లో ఎన్నింటిని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణీత సమయంలో పూర్తి చేసిందో.. వాటిలో ఏ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేశారో చెబితే.. వాటిని చూసి పోలవరం ప్రాజెక్టునూ అదే తరహాలో వేగవంతంగా పూర్తి చేస్తాం’ అని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఉమాభారతి జోక్యం చేసుకుని.. దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రితో మాట్లాడేతీరు అది కాదని అమర్జిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో అమర్జిత్‌ సింగ్‌ పోలవరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.

Advertisements

Latest Articles

Most Read