మన దేశంలో మొత్తం 16 నీటి పారుదల ప్రాజెక్ట్ లు, జాతీయ ప్రాజెక్ట్ లు గా ఉన్నాయి... జాతీయ ప్రాజెక్టులు దేశసంపదతో సమానం. వాటి నిర్మాణం, నిర్వహణ, పరిరక్షణ కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు కలిసికట్టుగా ఆ లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కాని, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాల అలసత్వం, ప్రజాప్రతినిధుల అశ్రద్ధ వంటివి ప్రాజెక్టుల పరిపూర్తికి అడ్డంకులుగా మారాయి... ఇవన్నీ ఆలోచించే నీతి అయోగ్, మన రాష్ట్ర ప్రభుత్వాన్నే పోలవరం బాధ్యత తీసుకోమనగానే చంద్రబాబు ఒప్పుకున్నారు... కేంద్రం సహకరిస్తుంది అని చెప్పారు కాబట్టి, చంద్రబాబు నిర్వహణ బాధ్యత తీసుకున్నారు.. కాని కేంద్రం మాత్రం, నిధులు ఇవ్వకుండా, అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది..

national projects 01122017 2

దేశంలో మొత్తం 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినా వాటి పనులు పూర్తి కాలేదు... అసోంలోని కుల్సి డ్యామ్‌, ఏపీలోని పోలవరం, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నోవా-దిహింగ్‌ ప్రాజెక్టు, అప్పర్‌ సియాంగ్‌ ప్రాజెక్టు, హిమాచల్‌ప్రదేశ్‌లోని రేణుకాడ్యామ్‌, ఉత్తరాఖండ్‌లోని కిషుయా బహళార్థ సాధక ప్రాజెక్టు, జమ్ము కశ్మీర్‌లోని ఉజ్‌, బుర్సార్‌, మహారాష్ట్రలోని గోసిఖుర్ద్‌, యూపీలోని కెన్‌బెట్వా, సరయు నహర్‌ పరియోజన, పంజాబ్‌లోని షాపూర్‌కండి, రవివ్యాస్‌, పశ్చిమ్‌ బంగలోని తీస్తా, ఉత్తరాఖండ్‌లోని లక్వార్‌ ప్రాజెక్టుల నిర్మాణం ఉన్నాయి... వీటిలో మన పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్ట్ లు, దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది.

national projects 01122017 3

మొత్తం 16 నీటి పారుదల ప్రాజెక్ట్ ల ప్రస్తుత స్తితి చూస్తే, మన రాష్ట్రం నిర్వహిస్తున్న పోలవరం తప్పితే, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిగిలిని అన్నీ ప్రాజెక్ట్ లు అసలు ముందుకు కదలటం లేదు... ఇంకా దారుణం ఏంటి అంటే, 10 ప్రాజెక్ట్ లు కనీసం రిపోర్ట్ దశను కూడా దాటలేదు... మిగిలిన 5 ప్రాజెక్ట్ ల పనులు అసులు జరగటం లేదు... 16 జాతీయ ప్రాజెక్ట్ లలో, మన పోలవరం మాత్రమే, ఈ పరిస్థితిలో ఉంది... దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... అందుకే చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పడినా, తన నెత్తిన వేసుకుని పనులు పూర్తి చేస్తున్నారు... ఇప్పుడు ఇలా లేట్ చేసి, కేంద్రం తన చేతుల్లోకి తీసుకుని, మిగతా 15 ప్రాజెక్ట్ లు లాగా, మన పోలవరం కూడా ఇలాగే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిసి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెట్టి, ముఖ్యమంత్రిని సాధించటం కోసం, కేంద్రం ఆడుతున్న డ్రామా ఇది... చంద్రబాబుకి పోలవరం పూర్తి చెయ్యటం చేతకాదు అని ఎగతాళి చేస్తున్న రాష్ట్ర సైకోలుకి ఒక ప్రశ్న... మీ మహా మేత, కాలువలు తవ్వి మట్టి డబ్బులు కొట్టేసాడు కాని, ప్రాజెక్ట్ ఏరియాలో కనీసం 0.1 శాతం పని కూడా ఎందుకు చెయ్యలేదు ? పునరావాసానికి ఒక్క పైసా ఎందుకు ఇవ్వలేదు ? మీది డబ్బులు కొట్టేయాలి అనే సంకల్పం... చంద్రబాబుది ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలనే సంకల్పం...

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు బృందం డిసెంబరు 3వ తేదీన దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లనున్నది. ఈ పర్యటనలో సామ్‌సంగ్‌, హ్యూండాయ్‌, లోప్టే సహా పలు ప్రఖ్యాత సంస్థల యాజమాన్య ప్రతినిధులతో ముఖాముఖి భేటీలు నిర్వహిస్తుంది. మొత్తం 6 ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ఆటోమైబైల్ దిగ్గజం ‘కియా’ వైస్ చైర్మన్ , లొట్టె కార్పొరేషన్ ప్రెసిడెంట్, కొకం కంపెనీ లిమిటెడ్ సీఈవో , OCI కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్, యంగ్ వన్ కంపెనీ చైర్మన్, కొరియా ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తో, ద్వైపాక్షిక సమావేశాలు ఉంటాయి.

అలాగే, 17 కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో, కియాకు అనుబంధంగా ఉన్న మరో 27 టూ టైర్, త్రీ టైర్ సంస్థల ప్రతినిధులతో గ్రూపు మీటింగ్స్ ఉంటాయి. అలాగే దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు ఉంటాయి... బూసన్ కాన్సులేట్ జనరల్ జియాంగ్ టెక్ మిన్... బూసన్ మెట్రో పాలిటన్ సిటీ మేయర్ సుహ్ బైంగ్సూ తో మీటింగ్స్ ఉంటాయి. 2 ఎంవోయూలు ఇప్పటికి ఖరారు అయ్యాయి, మరొకటి జరిగే అవకాశం ఉంది... ఎస్సెట్జ్ గ్రూపుతో ఏపీఈడీబీ ఎంవోయూ (ఇది ప్రాపర్టీ కంపెనీ), (అనంతపురములో ఏర్పాటుచేయనున్న వరల్డ్ క్లాస్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు పై)... కియా మోటార్స్‌ 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందం.... బూసన్, ఏపీఐఐసీ మధ్య ఎంవోయూ జరిగే అవకాశం ఉంది...

ఈ మధ్యనే దక్షిణకొరియా కాన్సుల్ జనరల్ జియోంగ్ డ్యూయెక్ మిన్ నేతృత్వంలో ఏపీలో పారిశ్రామికవేత్తల బృందం ఒకటి ఏపీలో పర్యటించింది. ఏయే రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయో సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ రాష్ట్రంలో భూముల లభ్యత, రాయితీలు, సహకారం, అనుమతులిచ్చే విధానం తదితర అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని ఈ బృందం సంతృప్తి చెంది వెళ్లింది... ఎలక్ట్రిక్ స్టీల్, లాజిస్టిక్, నిర్మాణరంగం, ఫైనాన్స్, ఆటోమొబైల్ కాంపొనెంట్స్, హెవీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, బ్యాటరీ, మీట్ ప్రాసెసింగ్, లిక్కర్స్, షిప్ బిల్డింగ్, మెడికల్, మెరైన్ అక్విప్‌మెంట్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. వీటి అన్నిటి మీద, చంద్రబాబు పర్యటనలో మరింత స్పష్టత వచ్చే అవకాసం ఉంది..

గుంటూరులో జెఎల్‌ఇ (జయలక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌) సినిమాస్‌ పేరిట ఆధునిక హంగులతో, ఒకే ప్రాంగణంలో ఆరు థియేటర్లతో కట్టిన థియేటర్లు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త, ధియేటర్స్‌ అధినేత పోలిశెట్టి రాము సారధ్యంలో పలకలూరు రోడ్డులోని రమణీయం కల్యాణ మండపం ఎదుట నాలుగు ఎకరాల విశాల ప్రాంగణంలో జెఎల్‌ఇ సినిమాస్‌ పేరుతో ఆరు ధియేటర్లు రూపుదిద్దుకున్నాయి. రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా కార్పొరేట్‌ హంగులు, సినిమా చూసే ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతి పొందేలా సీటింగ్‌ను ఏర్పాటు చేశారు.

jle 01122017 2

శృంగేరి శారదా పీఠం సీఈవో పద్మశ్రీ అవార్డు గ్రహీత విఆర్‌ గౌరీశంకర్‌ ఉదయం 9-30 గంటలకు లాంఛనంగా థియేటర్‌లను ప్రారంభించారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, సినీ నిర్మాతలు బీవీఎస్ఎన్‌ ప్రసాద్‌, మధు, ఎన్‌వీ ప్రసాద్‌, ఏపీ ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అంబికా కృష్ణ పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

jle 01122017 3

ఒకే ప్రాంగణంలో మొత్తం ఆరు ధియేటర్లను ఏర్పాటు చేశారు. అద్దంలా మెరిసిపోయే టైల్స్‌తో పాటు కార్పొరేట్‌ లుక్‌లో సీటింగ్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. 4కె క్రిస్టి ప్రొజక్టర్స్‌ విజువల్‌తో త్రీడీ సౌకర్యం కూడా ఉంది. ఆరు థియేటర్‌లలో ఒక్కో థియేటర్‌కు 350 నుంచి 200 ల వరకు సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. టిక్కెట్లు రూ. 150, రూ. 250 లుగా రెండే క్యాటగిరీలు అందుబాటులోకి తెచ్చారు.

సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోలవరం ప్రాజెక్టు ఆపాలన్న కేంద్రం లేఖపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ ఆకలితో ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను కబలించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో పట్టు కోసం ఏమైనా చేస్తారు అని, తమిళనాడుపై ఇటీవల కుయుక్తులు పన్నుతోందని, అలాగే ఏపీని కూడా కబళించాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కబళించాలనే ఉద్దేశ్యంతోనే అనవసర సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు. 

jc 01122017 2

అందుకే పోలవరం విషయంలో అవసరంలేని సమస్యలు సృష్టిస్తోందని, కేంద్రం చర్యల పై మాకు అనుమానాలు కలుగుతున్నాయని అని అన్నారు. చంద్రబాబును నియంత్రించాలనే ఒక దుర్బుద్ధి ఉందనే అనుమానం కూడా ఉందని అన్నారు.. ‘పోలవరం విషయంలో సీఎం చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని, కాని కేంద్రం మాత్రం చిన్న చూపు చూస్తుంది అని, చంద్రబాబుని చుస్తే బాధ వేస్తుంది అని అన్నారు..

jc 01122017 3

ఆంధ్రప్రదేశ్ ఏమీ వాళ్ల జాగీర్దారు కాదు అని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారికి బానిసలమూ కాదు అని అన్నారు... పిలిచిన టెండర్లు ఆపాలనడం సరికాదని, పోలవరం ఆపితే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు తలెత్తే అవకాశం ఉందని జేసీ అన్నారు... పోలవరానికి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పరిపాలనాపరమైనవి కాకపోవచ్చునని, రాజకీయ కారణాలు ఉండొచ్చునని సందేహం వ్యక్తం చేశారు... ఒకవేళ ఏపీతో వైరం పెట్టుకోవాలని కేంద్రం భావిస్తే... చివరికి వారికే మూడుతుందని తెలిపారు... కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే, చంద్రబాబు వద్దు అని చెప్పినా, వ్యక్తిగతంగానైనా సరే పార్లమెంటు సమావేశాలలో నిరసన తెలియచేస్తాను అని అన్నారు...

Advertisements

Latest Articles

Most Read