ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నంది అవార్డ్స్ పై, పోసాని స్పందించాడు... చంద్రబాబుని, లోకేష్ ని విమర్శ చేశాడు... సరే, జగన్ భజన చేస్తున్నాడుగా సహజం... కాని ఇక్కడ కెసిఆర్ ఎంతో గొప్పోడు అంట... లోకేష్ లా కెసిఆర్ అలోచించి ఉంటె, ఆంధ్రా వాళ్ళు ఎవరూ హైదరాబాద్ లో ఉండలేరు అంట... లోకేష్ అన్నది ఎవర్ని ? హైదరాబాద్ లో కుర్చుని, కావాలని ఆంధ్ర రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టె సన్నాసులని.... ఇది నిజమే కదా, ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని, సొంత రాష్ట్రంలో గొడవలు పెట్టాలి అనే సన్నాసులని ఏమనాలి ? అందుకే ప్రభుత్వం అలాంటి వారి మీద స్పందించింది... పోసాని, ఈ వ్యాఖ్యలకు హర్ట్ అయ్యి, కెసిఆర్ ఎంతో గొప్పోడు అని కెసిఆర్ ని పోగిడేసాడు... వీళ్ళ బ్రతుకు ఈ కెసిఆర్ భజన... లేకపోతే, కెసిఆర్ 10 కి.మీ కింద పాతి పెడతాడు కదా... బాబు పోసాని, నువ్వు చేసిన కెసిఆర్ భజనకు సూటి ప్రశ్నలు.... అంతకంటే ముందు ఒక మాట... మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించన వాడిలో, కెసిఆర్ కి మొదటి స్థానం ఉంటుంది...
కెసిఆర్ ఎన్నో బూతులు తిట్టాడు కాని, ఇంత జుబుక్సాకరంగా ఎవ్వరూ తిట్టి ఉండరు.. ఆంధ్రా వాళ్ళు తినే తిండిని పెంటతో పోల్చాడు... అప్పుడు ఎక్కడ ఉన్నావ్ పోసాని ? లోకేష్ మంత్రి అయ్యినందుకు సిగ్గు పడుతున్నా అన్నావ్, నువ్వు పొగిడిన కెసిఆర్ కొడుకు కేటిఆర్ అప్పట్లో ఆంధ్రా పోలీసులుని "ఎవడు రా ఆంధ్రా లంXX కొడకు" అన్నాడు, అప్పుడు ఎక్కడ ఉన్నావ్ పోసాని ? నువ్వు పొగిడిన కెసిఆర్ అల్లుడు, ఆంధ్రా ప్రాంతం వాడైన ఒక పెద్దయ్యన్ను ఢిల్లీలో ఆంధ్రా భవన్ లో కొట్టాడు, అప్పుడు ఎక్కడ ఉన్నావ్ పోసాని ? నమస్తే తెలంగాణా పత్రిక, టి.న్యూస్ ఛానల్, ఆంధ్రులని ప్రతి రొజూ తిడుతుంటే నువ్వు ఎక్కడ ఉన్నావ్ పోసాని ? మన ఉద్యోగస్తులను హైదరాబాద్ లో, మొఖం మీద ఉమ్మేసాం, గబ్బిలాలు లాగా పట్టుకుని వేలడతారు, సిగ్గు లజ్జా లేదా అని కెసిఆర్, అన్నప్పుడు ఎక్కడ ఉన్నావ్ పోసాని ? హైదరాబాద్ లో ఆంధ్ర వ్యాపారస్తుల మీద దాడులు, వీరిని ఇక్కడినుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఎక్కడ ఉన్నావ్ పోసాని ? ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతీ పై హైదరాబాద్ లో సాంస్కృతిక దాడులు, వారిని కించ పరిచే విధంగా మాట్లాడటం, చేసినప్పుడు, ఎక్కడ ఉన్నావ్ పోసాని ? చివరకి తెలుగు తల్లి దెయ్యం, మాకు తెలంగాణా తల్లే ఉంది అని కెసిఆర్ అన్నప్పుడు, ఎక్కడ ఉన్నావ్ పోసాని ? ఇలాంటివి చెప్పుకుంటూ పొతే, కొన్ని లక్షలు ఉంటాయి...
ఎన్టీ రామారావు, నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి... వీళ్లు ఏ ఒక్కరోజూ స్వపక్ష, ప్రతిపక్ష, విపక్ష నేతలను కానీ, సొంత పార్టీ కార్యకర్తలను కానీ, మరే ఇతర వ్యక్తులను కానీ బూతులతో దూషించడం ప్రత్యక్షంగా కానీ, మీడియా ద్వారా కానీ చూడలేదు.... ఏ రోజూ తెలుగు జాతి గౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడలేదు... ఆ జబ్బు ఉంది నువ్వు పొగిడే కేసీఆర్‌కే, పోసాని... తన స్థాయిని విస్మరించి... ఉచ్ఛ నీచాలు మరిచి నోరు పారేసుకుంటున్నాడు... అది కెసిఆర్ దొరాహంకారం.... ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్థాయిని మరిచి బూతులు తిట్టిన ఘనుడు కేసీఆరే... అలాంటి కెసిఆర్ ఎప్పుడూ ఆంధ్రా ద్రోహే... నీకు కెసిఆర్ తో అవసరం ఉంటే, భజన చేసుకో... పిచ్చి పిచ్చి మెంటల్ వాగుడుతో, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నీ సొంత డబ్బా రుద్దమాక... 2004లో జై చంద్రబాబు అన్నావ్.... 2009లో జై చిరంజీవి అన్నావ్... ఇప్పుడు జై జగన్ అంటున్నావ్... ఇది నీ క్యారక్టర్... నువ్వు పెద్ద పుడింగి లాగా, నీతులు చెప్పమాక...