విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం, టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో విద్యుత్‌ వాహనాలకు సంబంధించి టయోటా ఎండీ హకిటో టచీబానా, ఐటి సెక్రెటరీ విజయానంద్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా టయోటా ఎండీ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం పై సంతోషంగా ఉన్నాం, ఏపీలో విద్యుత్‌ వాహనాలు ప్రవేశపెట్టేందుకు ఉన్న అవకాశాలు అధ్యయనం చేస్తాం అని టయోటా ఎండీ హకిటో టచీబానా అన్నారు.

toyota 16112017 2

మన దేశంలో విద్యుత్‌ వాహనాలను ప్రవేశపెట్టడానికి పలు సమస్యలు ఉన్నాయి, విద్యుత్‌ వాహనాల అమలుకు అవసరమైన వాతావారణాన్ని అన్ని రాష్ట్రాలు సృష్టించాలి, అన్ని రాష్ట్రాలు పర్యావరణహిత వాహనాలను వినియోగంలోకి తేవాలి అత్యధిక విద్యుత్‌ వాహనాలు వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు తేవాలనే లక్ష్యంతో ఉన్నాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. 2018 మే నుంచి డిసెంబర్ లోపు అధునాతన టెక్నాలజీ తో రూపొందించిన 10 ఎలక్ట్రిక్ కార్లను టయోట కంపెనీ రాష్ట్రానికి ఇస్తుంది.టయోట సంస్థ ఉచితంగా ఇచ్చిన వాహనాలను సీఆర్డీఏ పరిధిలో ప్రయోగాత్మకంగా వినియోగిస్తాం అని లోకేష్ అన్నారు.

toyota 16112017 3

టయోట సంస్థ ఒక్క ఏపీ ప్రభుత్వంతో తప్ప మరే రాష్ట్రంతోను ఒప్పందం చేసుకోలేదు, విద్యుత్‌ ఛార్జింగ్‌ వాహనాల ద్వారా కాలుష్య సమస్యను అధిగమించవచ్చు. త్వరలోనే ఎలెక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న బ్యాటరీ తయారీ కంపెనీల నుండి వాహనాల తయారీ కంపెనీ వరకూ ఉన్న పూర్తి ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చే విధంగా ఎలెక్ట్రిక్ వాహనాల పాలసీ తీసుకురాబోతున్నాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేందుకు కూడా ఒక నూతన విధానం రూపొందిస్తున్నాం అని అన్నారు. త్వరలోనే ఎలెక్ట్రిక్ వాహనాలను తిరుమల లోనూ, విశాఖపట్నం, అమరవతిలోనూ పెద్ద ఎత్తున వినియోగించబోతున్నాం అని మంత్రి నారా లోకేష్ అన్నారు.

స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కుటుంబం చాలా కాలంగా రాజకీయాల్లోకి దూరంగా ఉంది... అయితే, ఇవాళ వారి రాజ‌కీయ ప్ర‌స్థానంపై క్లారిటీ వచ్చింది... నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇవాళ సాయంత్రం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు... దీని వెనుక చాలా రోజులు నుంచి చర్చలు జరుగుతున్నాయి... మంత్రి అమరనాథ్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపారు... చివరకు కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పార్టీలోకి వస్తున్నారు... కిరణ్‌కుమార్‌రెడ్డి తదుపరి అడుగుల గురించి మాత్రం, మరింత సమయం పట్టే అవకాసం ఉంది...

krian 16112017 2

నిజానికి కిరణ్‌కుమార్‌రెడ్డి, జనసేనలో చేరుతారని, బిజేపిలో చేరుతారని వార్తలు వచ్చాయి... అయితే జగన్ కూడా తన వంతు ప్రయత్నాలు చేశారు... కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం, జగన్ వెంట వెళ్ళటానికి ఇష్ట పడలేదు.... ఈ క్రమంలో, కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి, ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది... మరి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా త్వరలో చంద్రబాబు వెంట వస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది... అనూహ్య రీతిలో ముఖ్యమంత్రిగా 2010 నుంచి 2013 వరకూ పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించిన సంగతి తెలిసిందే.

krian 16112017 3

ఎట్టి పరిస్థుతుల్లోనూ, జగన్ లాంటి అవినీతి పరుడు వెనుక వెళ్ళే ఉద్దేశం లేదు అని, కిరణ్‌కుమార్‌రెడ్డి వర్గం చెప్తుంది.... ఇక మిగిలింది జనసేన, బిజేపి... ఒక ముఖ్యమంత్రిగా పాని చేసిన వ్యక్తి పవన్ కింద పని చెయ్యటం సాధ్యం అయ్యే పని కాదు అంటున్నారు.... బిజేపి మీద ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో వ్యతిరేకత వస్తున్న నేపధ్యంలో, చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న వారి వెనకాల వెళ్ళటం, కిరణ్ కుమార్ రెడ్డి కి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అంటున్నారు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014, 2015, 2016కు గాను ప్రకటించిన నంది అవార్డులుకు పెద్ద ఎత్తున రాజకీయ, కుల విమర్శలు వస్తున్నాయి.... 2015, 2016 సంవత్సరానికి ఏ గోలా చెయ్యని బినామీ గాళ్ళు, కుల కుంపట్లో డొల్లే వారు, పేరు కోసం వెంపర్లాడి క్రిటిక్ అనే పేరుతో గోల చేసే వారు, బూతు సినిమాలు తీసే c గ్రేడ్ డైరెక్టర్ లు, హైదరాబాద్ లో కులికే మీడియా బినామీ మీడియా చానల్స్ కేవలం 2014 సంవత్సరానికి ప్రకటించిన నందుల మీదే గోల చేస్తున్నారు... ఎందుకంటే 2014 సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాకు అవార్డు వచ్చింది అని... బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ వాడు అని, బాలకృష్ణ చంద్రబాబు బావ మరిది అని, అన్నిటికి అంటే, బాలకృష్ణ పలానా సామజికవర్గం వాడు అని... అంతే కాదు చంద్రబాబు ప్రభుత్వం ఏ పని చేసినా, విమర్శలు చెయ్యాలి, ఇష్యూ చెయ్యాలి అనే సైకో గ్యాంగ్ ఉంది మన దగ్గర... "మనం" అనే సినిమా కచ్చితంగా మంచి సినిమా.. దాంట్లో సందేహమే లేదు... కాని, అవార్డు ఇచ్చేప్పుడు ఇంకా ఎన్నో చూస్తారు... చివరకు ఎదో ఒకటి ఫైనల్ అవుతుంది... అందుకే మనం సెకండ్ బెస్ట్ ఫిలిం అయ్యింది... జ్యూరీ అది నిర్ణయించింది... దీంట్లో చంద్రబాబుకి ఏమి సంబంధం ? బాలయ్య కు ఏమి సంబంధం ? సామాజిక వర్గానిది ఏమి సంబంధం ?

nandi 16112017 1

తమకు అధికారం రాకుండా అడ్డుగా నిల్చున్నాడని పవన్ కళ్యాణ్‌ని, అతని వ్యక్తిగత జీవితాన్ని, అభిమానుల్నీ, మెగాఫ్యామిలీని పొద్దునలేస్తే అమ్మబూతులు తిడుతూ, ఎన్నికల సమయంలో తిరుపతిలో హోటల్లో తనిఖీల పేరుతో చిరంజీవి ఇంటి మహిళలని, కుటుంబాన్ని అవమానపరచి, ఆయన చిన్నకూతురి వివాహాన్ని రచ్చచేసి బజారుకీడ్చి, 2014 లో తెదేపాకి ఓట్లు వేశారని కాపు సామాజికవర్గాన్ని అసహ్యంగా రోజూ తిట్టే వైఎస్సార్ అభిమాన జగన్ భక్త వైసీపీ బృందం ... ఇవాళ అవార్డుల విషయంలో మెగాఫ్యామిలీకి అన్యాయం జరిగిందని మొసలికన్నీళ్ళు కార్చడం ఏంటి ? ప్రజలు ఆ మాత్రం అర్ధం చేసుకోలేరా ?

nandi 16112017 1

1983 నుంచి ఇప్పుడు వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఏళ్ళు అధికారంలో ఉంది ? బాలయ్య బాబుకి ఎన్ని నంది అవార్డులు వచ్చాయి ? అందులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా బాలయ్యకు నంది అవార్డు ఎందుకు వచ్చింది ? చంద్రబాబుకి పక్షపాతం ఉంటే, తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండగా చిరంజీవికి నంది అవార్డు ఎందుకు ఇచ్చేవారు ? తెలుగు ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకొనే ఆదిత్య 369 (1991 ) , భైరవ ద్వీపం ( 1994 ), తెలుగు సినిమా గతిని మార్చిన "సమర సింహ రెడ్డి" లాంటి సినిమాలకు అప్పుడు బాలయ్యకు నంది అవార్డు ఇవ్వకపోతే, ఇలాగే గోల చేసారా ? ఎన్టీఆర్ కొడుకుగా, చంద్రబాబు బావమిరిదిగా బాలకృష్ణ ఏనాడు అన్నా సెక్రటేరియట్ కు వెళ్ళే వాడా ? అలాంటి వాడి మీద ఇన్ని కుట్రలు చేస్తూ, నిందలు వెయ్యాలా ? దీంట్లో కుల ప్రస్తావన ఎందుకు.... నంది అవార్డు వచ్చిన వీరందరూ కమ్మ సామజిక వర్గం వారా ? "కమల్‌హసన్, రజనీకాంత్, చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌లాల్, జయసుధ, బ్రహ్మానందం, కృష్ణవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, అల్లు అర్జున్, మిక్కీ మేయర్, అనూప్ రూబెన్స్, వందేమాతరం శ్రీనివాస్, ఆర్.నారాయణమూర్తి, పిసీ రెడ్డి, బుర్రా సాయి మాధవ్, అవసరాల శ్రీనివాస్, చిత్ర, విజయ్ ఏసుదాసు, సమీర్ రెడ్డి, రమ్యకృష్ణ, అంజలి, అనుష్క, సతీశ్ వేగేశ్న, రీతూవర్మ, ఆది పినిశెట్టి, ప్రేమ్ రక్షిత్, సాబూ శిరిల్, రామ్-లక్ష్మణ్, రవిశంకర్, చిన్మయి, పులగం నారాయణ, ఏలేటి చంద్రశేఖర్, పీటర్ హెయిన్స్ "

nandi 16112017 1

బాలయ్య నంది అవార్డ్స్ జ్యూరీ కమిటీ లో బాలయ్య లేడు. ఆయన రఘుపతి వెంకయ్య అవార్డ్స్ అవార్డ్స్ జ్యూరీ కమిటీ చైర్మన్. బీజేపీ మాజీ మంత్రి కృష్ణంరాజుగారికీ, కాంగ్రెస్ మాజీ మంత్రి చిరంజీవిగారికీ, తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అధ్యక్షతన ఉన్న జ్యూరీ, వారిద్దరూ తెలుగు సినిమారంగానికి అందించిన సేవలను సముచితంగా గౌరవిస్తూ రఘుపతి వెంకయ్య పురస్కారాలను ప్రకటించింది. ఇప్పటివరకూ నటీనటులు, దర్శకనిర్మాతలు, గాయనీగాయకులకు మాత్రమే అందించిన ఈ పురస్కారాన్ని మొదటిసారిగా - ఈ కంప్యూటర్లు, ఫోటోషాపులు, విఎఫెక్స్ గ్రాఫిక్స్ లేని రోజుల్లో , సజీవకళ ఉట్టిపడేలా దాదాపు 2500 సినిమాలకి పోస్టర్లు, పబ్లిసిటీ మెటీరియల్ డిజైన్స్ చేసిన ఈశ్వర్‌గారికి 2015 సంవత్సరానికి ప్రకటించారు. ఈ అవార్డుల్లో కూడా రాజకీయం ఉందా ? వీళ్ళు కమ్మ సామాజిక వర్గం వారా ?. నంది అవార్డు కమిటీ మెంబెర్ గా బాలయ్య లేడు... చాలా మంది సినిమాల్లో వివిధ విభాగాల్లో పనిచేసిన వారు ఉన్నారు. అవేం తెలియని (పట్టని) ఎదవలు మైక్ వుంది కదా అని మాట్లాడటం, కీబోర్డ్ వుంది కదా అని విషపు రాతలు రాసేయడం. ఇప్పుడు అవార్డ్స్ గురించి చులకన గా మాట్లాడే మీరు , మీ హీరోలకి వచ్చిన అన్ని అవార్డ్స్ కూడా పైరవీలు చేసే తెచ్చుకున్నారా ? మనకి అవార్డు వస్తే మా హీరో వలన పక్క వాళ్ళకి వస్తే పైరవీ అంటారా ? తోటి హీరోలని గౌరవించడం నేర్చుకోండి.... లెజెండ్ సినిమాకు #SIIMA and #SICA అవార్డ్స్ కుడా వచ్చాయి, మరి అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు ? చంద్రబాబు అంటే వీళ్ళకు అంత చేతగాని వాడిలా కనిపిస్తున్నారా ? రేపు ఇవే అవార్డ్స్ తెలంగాణా ఇస్తుంది, అప్పుడు ఎంత మంది నోర్లు లేగుస్తాయో చూద్దాం... 

దాదాపు 20 న్యూస్ చానల్స్... మొన్న విజయవాడలో మొదలైన ఒక ఛానల్ తప్పితే, అన్నీ హైదరాబాద్ నుంచి నడిచేవే.. అక్కడ ఎడిటర్ కాని, స్క్రిప్ట్ రాసే వాడు కాని, వార్తని విశ్లేషించేవాడు కాని అందరూ హైదరాబాద్ లో కూర్చుంటారు... ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలీదు... ఇక్కడ ప్రజలు అభిప్రాయాలు పట్టవ్... వారికి ఒక అజెండా ఉంటుంది, ఆ అజెండా ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యమంగా చంద్రబాబు ఏమి చేసినా రచ్చ రచ్చ చెయ్యాలి... వాళ్లకి తెలంగాణాలో ఏమి జరుగుతుందో అనవరసం... తెలంగాణా గురించి ఒక్క నెగటివ్ వార్తా రాస్తే, అక్కడ కెసిఆర్ 10 కిమీ లోతులో పతి పెడతాడు అని భయం... చానల్స్ ఆపేస్తాడు అని భయం... అందుకే అక్కడ దాసోహం... ఇక్కడ చంద్రబాబు ఏమి అనడు కదా, అందుకే హైదరాబాద్ లో కూర్చుని, మన రాష్ట్రం మీద విషం చిమ్ముతూ ఉంటారు...

news 16112017 2

మా ఆంధ్ర రాష్ట్ర సమస్యలు గురించి మాట్లాడంది... తప్పు లేదు...కానీ నువ్వు ముందు ఆంధ్రుడివా, తెలంగాణ వాడివా తేల్చుకో... హైదరాబాదులో కూర్చుని, ఆంధ్ర రాష్ట్రాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా తిడతామంటే కుదరదు... లాగి పెట్టి లెంపకాయ కొడతాము... మా రాష్ట్ర సమస్య గురించి, మా మీద నిలువెల్లా విషం నింపుకుని, హైదరాబాదు లో కూర్చుని మాట్లాడతాము అంటే మేము వినడానికి సిద్ధంగా లేము. ఈ హైదరాబాద్ బేస్డ్ ఛానెల్స్, వారి అభిప్రాయాలను తీసుకొని, పదే పదే చూపిస్తూ, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం అని చూపించడం తప్పు.... ఛానెళ్లూ....ఆంధ్రకు రండి. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్ర్ ప్రజలు, విశ్లేషకులతో మాట్లాడండి. అంతే హైదరాబాదులో కూర్చొని మా ఆంధ్ర అవార్డుల మీద అవాకులు చావాకులు వాగద్దు... అర్హత లేని చెంచా గాళ్ళని స్టూడియోలో కూర్చో బెట్టి, మా ముఖ్యమంత్రిని, మా రాష్ట్రాన్ని తిట్టేస్తాం అంటే కుదరదు... ఒక్కసారి కుడా మా ఆంధ్రప్రదేశ్ గురించి, మా అమరావతి గురించి పోజిటివ్ గా మాట్లాడక పోగా, రొజూ విమర్శలు చేసే సన్నాసులని స్టూడియోల్లో కూర్చోబెట్టుకుని సొల్లు చెప్పించి, మీ అజెండా మా మీద రుద్దకండి... మా వార్తలు, మా ఆంధ్రా వారి నుంచి ఇవ్వాలి.... మా ఆంధ్ర సమస్యలు, మా ఆంధ్రా గురించి చర్చల్లో, మా ఆంధ్ర వారి అభిప్రాయాలనే ఇవ్వాలి... అంతే కానీ ఆంధ్రాని అనుక్షణం వ్యతిరేకించే వారు కాదు, మా ఆంధ్ర గురించి మాట్లాడేది....

news 16112017 3

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆలోచించాలి... మా ఆంధ్రా ప్రజల బాధ అర్ధం చేసుకోవాలి... మీ మెతకతనాన్ని అలుసుగా తీసుకుని ..... పక్క రాష్ట్రంలో కూర్చుని ఏ మాత్రం సంబంధం లేకపోయినా నోటికొచ్చినట్టు వాగుతా ఆంధ్ర ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు... ఆంధ్రులకి ఆత్మగౌరవం కంటే ఏది ఎక్కువ కాదు.... రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం పైన పక్క రాష్ట్రంలో కూర్చుని ,పక్క రాష్ట్రపు వెధవలతో దుమ్మెత్తి పోయిస్తున్న పక్క రాష్ట్రపు చానెల్స్ ని ప్రభుత్వం అదుపు చేయలేదా? కుల మత చిచ్చు పెట్టటమే ఏకైక అజండగా పని చేస్తున్న చానెల్స్ ని ఆపలేదా? మంచితనాన్ని అసమర్థత కింద జమకట్టే మూర్ఖులని, ఉపేక్షించటం సమంజసం కాదు... మీరు రియాక్ట్ అవ్వండి చంద్రబాబు గారు... ఇది ఎంత మాత్రం సమంజసం కాదు...

Advertisements

Latest Articles

Most Read