అమరావతిని, భ్రమరావతి అంటూ హేళన చేస్తూ, సునకానందం పొందే రాష్ట్ర ద్రోహులు ఒక్కసారి అమరావతిలో ఏమి జరుగుతుందో చూడండి... ఇంత పెద్ద కాంపస్ కేవలం 10 నెలల్లో రెడీ అయ్యింది... మరో నెల రోజుల్లో మొత్తం రెడీ అయ్యి, ఈ దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీల తరుపున నిలవనుంది... చంద్రబాబుతో పాటు ప్రతి ఆంధ్రుడు కలలు కంటున్నా మన అమరావతిలో మొట్టమొదటి ఫలం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ..
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయమైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇప్పటికే అమరావతిలో క్లాసులు ప్రారభించింది... అయితే, ఇంకా కాంపస్ నిర్మాణం జరుగుతుంది... ఆ పనులు చురుకుగా సాగుతున్నాయి... ముఖ్యమంత్రికి ఇచ్చిన మాట ప్రకారం, షడ్యుల్ ప్రకారం నిర్మాణాలు పుర్తవుతున్నాయి... రాష్ట్రప్రభుత్వం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15న నిర్మాణ పనులు మొదలయ్యాయి. కేవలం ఐదు నెలల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధానమైన అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులను నిర్మించి, జూలైలో ప్రారంభం చేశారు... ఇప్పుడు నవంబర్ నాటికి, మిగతా నిర్మాణ పనులు కూడా పూర్తవుతున్నాయి...
2017-18 విద్యాసంవత్సరంలో నాలుగు బీటెక్ బ్రాంచ్లు.. కంప్యూటర్ సైన్స్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలకా్ట్రనిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టారు. ఈ ఏడాది దాదాపు 300 అడ్మిషన్లుజరిగాయి... ఇప్పటి వరకు 27 మంది అధ్యాపకులను నియమించారు. ఈ ఏడాది 70 శాతం అడ్మిషన్లు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు, 30 శాతం అడ్మిషన్లు రాష్ట్రేతరులకు కల్పిస్తున్నారు. ఎస్ఆర్ఎంలో మేనేజ్మెంట్ కోటా లేదు. క్యాపిటేషన్ ఫీజు లేదు... బీటెక్ విద్యార్థులకు ఏడాదికి ఫీజు రూ.2.5 లక్షలుగా నిర్ణయించారు.