స్వచ్చమైన గోదావరి యాసలో, ప్రత్యర్దులకి కౌంటర్ లు వేసే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప గారు మానవత్వాన్ని చాటుకున్నారు... తన పర్యటనలో భాగంగా, రొజూలాగే బయలేదేరిన హోం మంత్రికి, యువకుడు ఆక్సిడెంట్ అయ్యి ఉండటం చూసి, యువకుడిని తన కాన్వాయ్ లోనే హాస్పిటల్ లో జాయిన్ చేసి, ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు... పోలీస్లు అందరికీ బాస్ అయినా, తనకూ హృదయం ఉంది అని, మానవత్వం చాటుకుని, నలుగురికి ఆదర్శంగా నిలిచారు...

chinarajappa 07112017 2

వివరాల్లోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లోని కెనాల్ రోడ్డులో ఓ యువకుడు బైకు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలతో రోడ్డు ప్రక్కన పడివున్న ఆ యువకుడి వద్ద జనం గుమిగూడి వుండటంతో అటుగా తన నివాసానికి కాన్వాయ్ లో వెళుతున్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆగి ఏం జరిగిందని ఆరా తీశారు. కారు దిగి ఆ యువకుడు దగ్గరకు వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ..

chinarajappa 07112017 3

మాగాం గ్రామానికి చెందిన పేరిచర్ల సుధీర్ వర్మ గా గుర్తించారు. మోకాలు,చేతులు ,నడుమ భాగం పై గాయాలతో బాధపడుతున్న సుధీర్ వర్మ ను తన కాన్వాయ్ పోలీసు వాహనంలో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సుధీర్ వర్మ బైకు ను అక్కడ పాకలో పెట్టి తాళం వేయించి అతనికి అందించారు. బంధువులకు సమాచారం అందించమని, కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించాలని అమలాపురం డిఎస్పీ ప్రసన్నకుమార్ ను హోంమంత్రి చినరాజప్ప ఆదేశించారు....

నిన్న మన ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడుల గురించి, మన రాష్ట్రంలో వివిధ ప్రముఖ సంస్థలు చేసుకుంటున్న ఏంఓయు ల గురించి, వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే... రోడ్డు మీద పోయేవాడికి, సూటు, బూటు వేయించి, వారితో ఫోటోలు దిగి, వీరే మనకి పెట్టుబడులు పెడుతున్నారు అని చంద్రబాబు రాష్ట్ర ప్రజలని మభ్యపెడుతున్నారు అని, జగన్ గారు అన్నారు... అయ్యా జగన్ గారు, ఈయన ఎవరో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల అంట, చంద్రబాబుకి ఏ రోడ్డు మీద దొరికాడో, తీసుకోవచ్చి రెండు ఫోటోలు దిగి, ఈయన మన రాష్ట్రంలో ఉన్న 15 వేల మంది యువతకి సాంకేతిక శిక్షణ ఇస్తాడు అని, చంద్రబాబు చెప్తున్నాడు... ఎంత అన్యాయస్తుడు జగన్ గారూ, ఈ చంద్రబాబు....

mcrosfot 07112017 2

ఇంత సీరియస్ సబ్జెక్టు లో, ఇలా రాసినందుకు క్షమించండి... కాని మన పెట్టుబడి దారులని అవహేళన చేస్తున్న వారికి బుద్ధి రావటం కోసం తప్పదు... విషయానికి వస్తే, రాష్ట్రంలో నిరుద్యోగులకు సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. ఆ సంస్థ టెక్నాలజీ/ టూల్స్‌లో ప్రధానమైన కైజాలా, అజ్యూర్‌ క్లౌడ్‌ స్టాక్‌, సంగం, లింక్‌డిన్‌, మైక్రోసాఫ్ట్‌ వర్చ్యువల్‌ అకాడమీ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి సహకారమందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనపై సంస్థ సీఈవో సత్య నాదెళ్ల సానుకూలంగా స్పందించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన సత్య నాదెళ్లతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోగంటి సాంబశివరావు భేటీ అయ్యారు.

mcrosfot 07112017 3

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తొలిదశలో 5వేల మందికి, రెండో దశలో 15వేల మందికి మైక్రోసాఫ్ట్‌ సంగం వేదికగా సోమవారం నుంచే శిక్షణను అందిస్తున్నామని సత్య నాదెళ్లకు సాంబశివరావు వివరించారు. మొబైల్‌ ఆధారిత వృత్తి విద్యతో కూడిన సమగ్ర శిక్షణ ఇస్తామన్నారు. అధిక ఉద్యోగావకాశాలు ఉన్న కంప్యూటర్‌ అసిస్టెంట్స్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సెల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఎలక్ట్రికల్‌ అండ్‌ హౌస్‌ వైరింగ్‌ టెక్నాలజీస్‌, నర్సింగ్‌, జనరల్‌ పేషెంట్‌ అసిస్టెంట్స్‌, మొబైల్‌ అసెంబ్లింగ్‌, హాస్పిటాలిటీ స్వీవర్డ్స్‌, వెయిటర్స్‌, కస్టమర్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కుట్టుమిషన్లు వంటి రంగాల్లో శిక్షణను ఇస్తున్నామని తెలిపారు.

రాజధాని అమరావతి పరిధిలో, వెలగపూడిలోని సచివాలయంలో, ఏమి జరిగినా, వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి మీడియాకి వివరాలు, ఫైల్స్ తో సహా వెళ్ళిపోవటం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆశ్చర్యానికి గురి చేసేంది... 50సంవత్సరాలు నిండగానే వారితో బలవంతంగా పదవీ విరమణ చేయిస్తారని ఆ మధ్య సాక్షిలో జరిగిన విష ప్రచారాం తెలిసే ఉంటుంది... అలాగే చంద్రబాబు పేషీలో ఏ చర్చ జరిగినా వెంటనే లోటస్ పాండ్ కు వార్తలు వెళ్ళిపోతున్నాయి... చంద్రబాబు ఎలక్షన్స్ కు వెళ్ళే ముందు, వృద్ధులకు 2 వేల పెన్షన్ పెంచుదాం అనుకున్నారు... ఇది వెంటనే, లోటస్ పాండ్ చేరటంతో, జగన్ ప్లీనరీలో ఈ విషయం ముందే ప్రకటించాడు....

secretariat 06112017 2

ఇది సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం, ఇంటి దొంగను పట్టుకోవటానికి ఆపరేషన్ స్టార్ట్ చేశారు... చివరకి ఇంటి దొంగ దొరికాడు... ప్రభుత్వానికి చెందిన కాగితాలను, ఫైల్స్ ను దొంగతనం చేస్తుంది, ఇరిగేషన్‌ శాఖలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి అని గుర్తించారు.. వెంటనే అతన్ని సస్పెండ్‌ చేసారు... ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వానికి చెందిన ఫైళ్లను దొంగతనం చేశారనే కారణంతో ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సచివాలయంలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఆయన ప్రభుత్వానికి చెందిన పత్రాలను అధికారుల అనుమతి లేకుండా, సంబంధిత సెక్షన్‌కు వెళ్లి అక్కడ ఉద్యోగులు లేని సమయంలో తీసుకెళ్లడం నేరమని, అంతే కాకుండా వాటిని పత్రికలకు అందించడం మరింత నేరమని, ఈ విషయం ఇంతటితో వదలకూడదు అని, సచివాలయం ఉద్యోగులు అంటున్నారు...

secretariat 06112017 3

ఈ వెంకట్రామిరెడ్డి మొదటి నంచి ఇలాగే చేసేవాడు అంటున్నారు...ఆయన ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి జగన్ పార్టీ ఏజెంట్ లా పరవర్తించే వారు... 2014 ఎన్నికల్లో తన భార్యకు వైకాపా సీటు కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. 'జగన్‌'కు చెందాల్సిన సిఎం సీటు చంద్రబాబుకు దక్కటంతో అప్పటి నుంచి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషయలు లోటస్ పాండ్ జారేసేవారు.. ఉద్యోగులకు చెందిన డ్రాప్ట్‌ఫైల్‌ను 'సాక్షి'కి ఇచ్చిన విషయంలో ఇప్పుడు ఈ దొంగ దొరికాడు.. ఇలాంటి దొంగలు ఇంకా ఎంత మంది ఉన్నారో, ప్రభుత్వం వెంటనే గుర్తించాలి... అంతే కాదు, వీరికి లోటస్ పాండ్ లో ఎవరు సహకరిస్తున్నారో విచారణ చేసి, వాళ్ళని కూడా లోపల వెయ్యాలి... ఇప్పటివరకు సేవ చేసినందుకు, ఈ సస్పెండ్ చేసిన వెంకట్రామిరెడ్డికి, వచ్చే ఎన్నికల్లో జగన్ అసెంబ్లీ సీటు ఇవ్వనున్నారు...

ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే టెక్నాలజీ అనే అభిప్రాయం ఉంది... రియల్ టైం గవర్నెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ ఇలా పరిపాలనలో టెక్నాలజీ ఉపయోగిస్తూ, సమర్ధవంతమైన సేవలు ప్రజలకు అందిస్తున్నారు... ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టెక్నాలజీ విప్లవం తీసుకురానున్నారు... అదే ‘వర్చువల్‌ క్లాస్‌’ రూమ్‌లు... ఇప్పటికే నాలుగు వేల స్కూల్స్ లో, పనులు ప్రారంభం అయ్యాయి... రూ.160 కోట్ల వ్యయంతో, జవనరి నాటికి, ఇవి రెడీ అవుతాయి... వీటిలో లోపాలు తెలుసుకుని, వాటిని సవరించి, మిగిలిన 46వేల పాఠశాలల్లో కూడా, ‘వర్చువల్‌ క్లాస్‌’ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు... ఈ వర్చువల్‌ తరగతులకు సంబంధించి పాఠశాలలకు ల్యాప్‌టాప్‌, యూపీఎస్‌, ప్రొజెక్టర్‌, ట్యాబ్‌లు, క్లిక్కర్‌లు, ఏసీ వంటి పలు పరికరాలు అమరుస్తారు. ఈ వర్చువల్‌ తరగతులకు ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌, బెంగళూరుకు చెందిన ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, గుంబి సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందినప్రతినిధులు పవన్‌, శ్రీకిరణ్‌, ప్రదీప్‌, వంశీ, ఉదయ్‌ సహకారం అందిస్తున్నారు.

virtual class 07112017 2

ఈ ప్రాజెక్ట్ బాధ్యత మొత్తం సమర్ధవంతమైన అధికారిగా పేరున్న అహ్మద్‌బాబు, లీడ్ చెయ్యనున్నారు... ప్రపంచంలోనే ఇన్నివేల పాఠశాల్లో ఒకేసారి వర్చువల్‌ క్లాస్‌రూంలు ఏర్పాటు చెయ్యటం ఎక్కడా లేదు... డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ కి, వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌ కి చాలా తేడా ఉంటుంది...డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ లో, ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలను వీడియోలో చిత్రీకరించి, తరగతి గదిలో ప్రదర్శిస్తారు..కాని, వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌లు అలా కాదు! స్వయంగా ఉపాధ్యాయుడే పిల్లల ముందుండి పాఠాలు చెప్పినట్లుగా ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులతో మాట్లాడొచ్చు. విద్యార్థులు తమ సందేహాలను అప్పటికప్పుడు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. చిత్రాలు, యానిమేషన్‌ ద్వారా వివరించవచ్చు.

virtual class 07112017 3

దీంతో, రాష్ట్ర, జిల్లా కేంద్రాల నుంచే కాక, ఎక్కడ నుంచి అయినా సీనియర్‌ ఉపాధ్యాయులు, నిపుణులు చెబుతున్న పాఠాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తరగతి గదుల్లో చూపిస్తారు. దీనికోసం ప్రొజెక్టర్‌, స్ర్కీన్‌ ఏర్పాటు చేస్తారు. అన్ని పాఠాలను కాకుండా... గణితం, సైన్స్‌లో క్లిష్టమైన... పాఠాలు మాత్రం వర్చువల్‌ తరగతి గదుల్లో బోధిస్తారు. విజయవాడలో ఈ సిస్టమ్‌కు సంబంధించి సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆయా జిల్లాకేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ వుంటుంది. పాఠశాలలన్నీ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఫైబర్‌ గ్రిడ్‌కు అనుసంధానం అవుతూ వుంటాయి. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రశ్నలు కూడా అడుగుతూ వుంటారు. స్త్రీన్‌పై మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు కూడా ఇస్తుంటారు. విద్యార్థులు తమ వద్ద వున్న క్లిక్కర్‌తో ఏబీసీడీల్లో ఒకటి ఎంచుకున ఆన్సర్‌ చేయాల్సి వుంటుంది. ఎంతమంది విద్యార్థులు కరెక్టుగా సమాధానం చెప్పారో, అసలు ఎంత మంది పాఠశాలకు హాజరయ్యారో ఇవన్నీ కూడా ఆటోమెటిక్‌గా అప్‌లోడ్‌ అవుతాయి.

Advertisements

Latest Articles

Most Read