ముఖ్యమంత్రి చంద్రబాబు అంటేనే టెక్నాలజీ అనే అభిప్రాయం ఉంది... రియల్ టైం గవర్నెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ ఇలా పరిపాలనలో టెక్నాలజీ ఉపయోగిస్తూ, సమర్ధవంతమైన సేవలు ప్రజలకు అందిస్తున్నారు... ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టెక్నాలజీ విప్లవం తీసుకురానున్నారు... అదే ‘వర్చువల్‌ క్లాస్‌’ రూమ్‌లు... ఇప్పటికే నాలుగు వేల స్కూల్స్ లో, పనులు ప్రారంభం అయ్యాయి... రూ.160 కోట్ల వ్యయంతో, జవనరి నాటికి, ఇవి రెడీ అవుతాయి... వీటిలో లోపాలు తెలుసుకుని, వాటిని సవరించి, మిగిలిన 46వేల పాఠశాలల్లో కూడా, ‘వర్చువల్‌ క్లాస్‌’ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు... ఈ వర్చువల్‌ తరగతులకు సంబంధించి పాఠశాలలకు ల్యాప్‌టాప్‌, యూపీఎస్‌, ప్రొజెక్టర్‌, ట్యాబ్‌లు, క్లిక్కర్‌లు, ఏసీ వంటి పలు పరికరాలు అమరుస్తారు. ఈ వర్చువల్‌ తరగతులకు ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌, బెంగళూరుకు చెందిన ట్రైజిన్‌ టెక్నాలజీస్‌, గుంబి సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు చెందినప్రతినిధులు పవన్‌, శ్రీకిరణ్‌, ప్రదీప్‌, వంశీ, ఉదయ్‌ సహకారం అందిస్తున్నారు.

virtual class 07112017 2

ఈ ప్రాజెక్ట్ బాధ్యత మొత్తం సమర్ధవంతమైన అధికారిగా పేరున్న అహ్మద్‌బాబు, లీడ్ చెయ్యనున్నారు... ప్రపంచంలోనే ఇన్నివేల పాఠశాల్లో ఒకేసారి వర్చువల్‌ క్లాస్‌రూంలు ఏర్పాటు చెయ్యటం ఎక్కడా లేదు... డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ కి, వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌ కి చాలా తేడా ఉంటుంది...డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ లో, ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలను వీడియోలో చిత్రీకరించి, తరగతి గదిలో ప్రదర్శిస్తారు..కాని, వర్చువల్‌ క్లాస్‌ రూమ్‌లు అలా కాదు! స్వయంగా ఉపాధ్యాయుడే పిల్లల ముందుండి పాఠాలు చెప్పినట్లుగా ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులతో మాట్లాడొచ్చు. విద్యార్థులు తమ సందేహాలను అప్పటికప్పుడు అడిగి నివృత్తి చేసుకోవచ్చు. చిత్రాలు, యానిమేషన్‌ ద్వారా వివరించవచ్చు.

virtual class 07112017 3

దీంతో, రాష్ట్ర, జిల్లా కేంద్రాల నుంచే కాక, ఎక్కడ నుంచి అయినా సీనియర్‌ ఉపాధ్యాయులు, నిపుణులు చెబుతున్న పాఠాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తరగతి గదుల్లో చూపిస్తారు. దీనికోసం ప్రొజెక్టర్‌, స్ర్కీన్‌ ఏర్పాటు చేస్తారు. అన్ని పాఠాలను కాకుండా... గణితం, సైన్స్‌లో క్లిష్టమైన... పాఠాలు మాత్రం వర్చువల్‌ తరగతి గదుల్లో బోధిస్తారు. విజయవాడలో ఈ సిస్టమ్‌కు సంబంధించి సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఆయా జిల్లాకేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ వుంటుంది. పాఠశాలలన్నీ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఫైబర్‌ గ్రిడ్‌కు అనుసంధానం అవుతూ వుంటాయి. విద్యార్థులతో మాట్లాడుతూ ప్రశ్నలు కూడా అడుగుతూ వుంటారు. స్త్రీన్‌పై మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు కూడా ఇస్తుంటారు. విద్యార్థులు తమ వద్ద వున్న క్లిక్కర్‌తో ఏబీసీడీల్లో ఒకటి ఎంచుకున ఆన్సర్‌ చేయాల్సి వుంటుంది. ఎంతమంది విద్యార్థులు కరెక్టుగా సమాధానం చెప్పారో, అసలు ఎంత మంది పాఠశాలకు హాజరయ్యారో ఇవన్నీ కూడా ఆటోమెటిక్‌గా అప్‌లోడ్‌ అవుతాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read