ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఇవాళ పొద్దున్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే... జగన్ ప్రతి తిరుమల పర్యటన లాగే, ఈ పర్యటన కూడా వివాదాల మధ్యే నడించింది... అన్యమతస్థులు ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి అంటే, ముందుగా శ్రీ వారి పట్ల మాకు నమ్మకం ఉంది అని, డిక్లరేషన్ ఇవ్వాలి... ఎంత పెద్ద వారు వచ్చినా అది ఆనవాయతీ... పోయిన సారి, జగన్ తిరుమల వచ్చినప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు.. ఈ సారైనా జగన్, డిక్లరేషన్ ఇస్తారు అని అందరూ ఆశించారు... జగన్ శ్రీ వారి పట్ల, నమ్మకం ఉంది అని చెప్తారు అనుకున్నారు... కాని అలాంటిది జరగలేదు...

jagan tirupati 04112017 2

పైగా, పక్కనే ఉన్న చెవిరెడ్డి, వివాదాలకు తావు ఇవ్వకుండా, డిక్లరేషన్ బుక్‌లో సంతకం పెట్టమని, జగన్ దగ్గరకే బుక్ తీసుకువచ్చి చెప్పారు... దీంతో జగన్, ఇంతెత్తున లెగిసి, నీ హద్దులు నువ్వు తెలుసుకో, నాకు ఏ పని ఎప్పుడు చెయ్యాలో తెలుసు... చెయ్యాలో వద్దో, నీ చేత నేను చెప్పించుకునే స్థితిలో లేను... మా నాన్న ఏ రోజైన బుక్ లో సంతకం పెట్టారా ? మరి నేను ఆయన్ను ఫాలో అవ్వలా లేదా ? మా నాన్న ఇలాగే చేశాడు, నేను ఇలాగే చేస్తా అని చెవిరెడ్డి మీద అరవటంతో, అందరూ షాక్ అయ్యారు... ఇక చేసేది ఏమి లేక, చెవిరెడ్డి మిన్నకుండిపోయారట. జగన్ చేసిన పని కరెక్ట్ అని, అక్కడ జగన్ తో పాటు వచ్చిన మిగతా అన్యమతస్థులు కూడా అనటంతో, చెవిరెడ్డి నాకెందుకులే గోల అని, ఆ విషయాన్ని వదిలేసి, దర్శనానికి వెళ్ళిపోయారు.. అయితే కొంత దూరం వెళ్ళిన తరువాత కొందరు టీటీడీ అధికారులు ఆయనకు ఎదురెళ్లి డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు. ఆ సమయంలో వారివైపు ఆగ్రహంగా చూసిన జగన్, ఆపై తమాయించుకుని సున్నితంగా తిరస్కరించి దర్శనానికి వెళ్లిపోయారు.

jagan tirupati 04112017 3

ఈ వివాదం ఉండగానే, జగన్ చివరకి శ్రీవారి ప్రసాదం కూడా తీసుకోలేదు అనే విషయం కూడా బయటకు రావటంతో, అందరూ ఆశ్చర్యపోతున్నారు... అసలు జగన్ కు శ్రీవారి మీద నమ్మకం లేకపోతే, ఈ షో అంతా ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.... కొండ పైకి నడుచుకుంటూ వాస్తాను అని ప్లీనరీలో అందరి ముందూ చెప్పారు... కోర్ట్ లో లేట్ అయ్యింది అని, అది వదిలేసి డైరెక్ట్ గా కార్ లో కొండ పైకి వెళ్లారు... అక్కడ డిక్లరేషన్ బుక్‌లో సంతకం పెట్టలేదు... శ్రీ వారి ప్రసాదం ముట్టలేదు... కాని, ఆ స్వరూపానంద, చిన్నజీయర్ సేవలో మాత్రం, ఎక్కడ లేని వినయం చూపిస్తున్నాడు... శ్రీ వారితో ఆటలు వద్దు అంటూ, వెంకన్న భక్తులు జగన కు సలహా ఇస్తున్నారు... అయినా, ఆయన మారడు... అతనికి ఉన్న చరిత్ర అలాంటింది...

నేను ముఖ్యమంత్రి అవ్వటం కోసం పాదయాత్ర చేస్తున్నాను... పాదయత్ర ముందు తిరుమల వెంకన్నను దర్శించుకుంటాను అంటూ, హడావిడి చేసిన జగన్ కు ఆది లోనే హంస పాద ఎదురైంది... జగన్, తిరుమల కొండ పైకి నడుచుకుంటూ వస్తారు అనే ప్రోగ్రాం ఉంది. అయితే, ఆ ప్రోగ్రాం అర్ధంతరంగా కాన్సిల్ అయినట్టు, తిరుపతి నాయకులకి సమాచారం అందింది... విషయం ఏంటి అని ఆరా తియ్యగా, ఇవాళ శుక్రవారం కావటంతో, జగన్ అక్రమాస్థుల కేసులో కోర్ట్ కి హాజరు అయ్యారు....

jagan tirum 03112017 2

అయితే, అనుకున్న సమయానికి అంటే ఎక్కువగా కోర్ట్ లో టైం తీసుకుంది... దీంతో జగన్ షడ్యుల్ మొత్తం మారిపోయింది... ఫ్లైట్ మిస్ అయ్యింది... తరువాత ఫ్లైట్ కి తిరుపతి వెళ్ళాల్సిన పరిస్థితి... దీంతో, కొండ పైకి నడుచుకుంటూ వచ్చే ప్రోగ్రాం రద్దు అయింది... జగన్, నేరుగా తిరుమల కొండ పైకి వాహనంలో వెళ్ళిపోతారు... రేపు పొద్దున, శ్రీవారి దర్శనం చేసుకుంటారని, పార్టీ వర్గాలు అంటున్నాయి... శ్రీవారి దర్శనం అవ్వగానే, కడప దర్గా, ఇదుపులుపాయ చర్చలో కూడా జగన్ ప్రార్ధనలు చేసి, పాదయాత్ర మొదలు పెడతారు...

jagan tirum 03112017 3

అయితే, శుభమాను శ్రీవారి దర్శనానికి, కొండ పై నుంచి నడుచుకుంటూ ప్లాన్ చేస్తే, ఇలా అయ్యింది ఏంటి అంటూ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి... ఇది అపసకునంగా అభివర్ణిస్తున్నాయి... జగన్ పాదాలు తమను తాకకూడదని ఆ సప్త గిరులు భావించాయేమో అని అనుకుంటున్నారు.... ఏది ఏమైనా, స్వామి వారి అనుగ్రహం లేనిదే, ఎవరూ ఏమి చెయ్యలేము, అంతా చేసేది, ఆ స్వామీ వారే, మనం నిమిత్తమాత్రులం అంటూ, మారిన షడ్యుల్ ప్రకారం తదుపరి జగన్ పర్యటన ఏర్పాట్లు చేసుకుంటున్నారు...

కేంద్రమంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు.. కేంద్రమంత్రి అయినా, కోట్లకు అధిపతి అయినా.. సామాన్య జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శం... 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో, ఒక చిన్న మచ్చ కూడా లేని జంటిల్ మెన్ ఆయన... ఈ మధ్య కొంత మంది, స్థాయిలేని వాళ్ళు ఆయనను సోషల్ మీడియాలో ఎలా టార్గెట్ చేసారో చూశాం... తాజాగా సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆశోక్ గజపతిరాజును ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రులకు సూచించారు. ఎంతో శ్రీమంతుడైన అశోక్ కేంద్రమంత్రి కాకమునుపు విజయనగరంలో అప్పుడప్పుడూ చిన్న నానో కారులో స్వయంగా డ్రైవింగు చేసుకుంటూ కనిపించేవారు. కావాలంటే కోట్లు విలువ చేసే విదేశీ కార్లు ఎన్ని కావాలంటే అన్ని కొనుగోలు చేయగలిగే ఆయన ఎంతో నిరాడంబరంగా తానే స్వయంగా నానో కారు నడుపుతూ షాపింగ్ చేసేవారు.

ashok 03112017 2

కేంద్ర మంత్రిగా ఆశోక్‌గజపతిరాజుకు ప్రభుత్వం అనేక అనేక వెసులుబాట్లు కల్పించింది. తాను ఎక్కాల్సిన విమానం వద్దకు నేరుగా ప్రత్యేక వాహనంలో వెళ్లవచ్చు. తనిఖీలు లేకుండానే విమానాశ్రయంలోకి వెళ్లవచ్చు. కానీ ఆయన అలా చేయరు. అందరు ప్రయాణికులతోపాటు వరుసలో నిలబడతారు. రెండు చేతులు పైకెత్తి చెకింగ్‌ చేయించుకుంటారు. మీ డ్యూటీ మీరు చేయండి, తప్పులేదంటూ సెక్యూరిటీ సిబ్బందికి సూచిస్తారు మంత్రి. విమానాశ్రయానికి కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. మిగిలిన ప్రయాణికులతోపాటు క్యూలో నిల్చుని... మెట్రో కార్డు (టికెట్‌) పంచ్‌ చేయించుకుని గేటు దాటి వెళతారు. ఈ తరహ వ్యక్తిత్వం ఉన్న ఆశోక్‌గజపతిరాజుకు మోడీ వద్ద ప్రత్యేక మార్కులు పడ్డాయి. ఆశోక్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన మంత్రివర్గసహచరులకు సూచించారు. ఆశోక్‌గజపతిరాజు సింప్లిసిటీని అందరూ అనుసరిస్తే బాగుంటుందని మోడీ అప్పుడప్పుడు తన సహచరులకు చెబుతుంటారు.

ashok 03112017 3

రాజకీయాల్లో అవినీతి మకిలి అంటని నేతల్లో అశోక్ గజపతి రాజు గారు ఒకరు... లక్షల కోట్లకు అధిపతి అయిన ఈ రాజుగారి వంశపారంపర్య ఆస్తులు విద్యాసంస్థలు - బ్యాంకులు - ఆస్పత్రులకు ఇచ్చారు. ఇంకా వేలాది ఎకరాలు ట్రస్టు పేరుతో ఖాళీగా ఉన్నాయి. అదే ఇంకెవరైనా అయితే - అందులో భవంతులు నిర్మించో - ఇంకొకటో ఇంకొకటో చేసో ఆస్తులు పెంచుకునేవారు. కానీ అశోక్ కుటుంబం మాత్రం ఉన్నది చాల్లే అనుకుంటూ సంతృప్తిగా ఉంటారు. గతంలో రాష్ట్రంలో రెవెన్యూ - ఆర్థిక శాఖలు వంటి కీలక శాఖలు నిర్వహించినా ఏ రోజూ ఎవరూ పల్లెత్తు ఆరోపణ చేయలేదు. అంతెందుకు..... సొంత జిల్లా విజయనగరంలో ఆయన రాజకీయ ప్రత్యర్థయిన బొత్స సత్యనారాయణ కూడా అశోక్ పై ఏనాడూ ఒక్క రూపాయి తిన్నారని అనలేదు. అలాంటి క్లీన్ ఇమేజి అశోక్ ది...

అప్పుడే నాంపల్లి కోర్ట్ నుంచి బయటకు వస్తున్న జగన్ కు, అంబటి రాంబాబు చెప్పిన బ్రేకింగ్ న్యూస్ విని, దడ మొదలైంది.... పాదయత్ర జోష్ లో ఉన్న జగన్ కు ఇది నిజంగా చెదు వార్తే... మొన్న కెసిఆర్ కూడా ఇదే చెప్పాడు, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు ఇదే చెప్పాడు, ఢిల్లీ వర్గాలు కూడా ఇదే కన్ఫర్మ్ చెయ్యటంతో, జగన్ మరింత ఆందోళనలో ఉన్నారు... విషయం ఏమిటి అంటే, నియోజకవర్గాల సంఖ్య పెంపు కచ్చితంగా జరగబోతోందని, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ లో చెప్పారు..

cbn ap 03112017 2

ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు..అసెంబ్లీ సీట్ల పెంపుపై రాజ్‌నాథ్‌తో చర్చించామన్నారు. అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. సీట్ల పెంపుపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుందని అమిత్ షా బదులిచ్చినట్లు సీఎం పేర్కొన్నారు. మొత్తానికి ఈ సీట్లపెంపుపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ..

cbn ap 03112017 3

ఇప్పుడు ఇదే న్యూస్, జగన్ క్యాంప్ ను భయపెడుతుంది... తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా, వలసలను ప్రోత్సహించటం ఆపింది... పాదయాత్ర మొదలు పెట్టగానే, వలసలు ఉంటాయి అని అటు జగన్ కి కూడా తెలుసు... అయితే, కొంత మంది నాయకులు మాత్రం, తెలుగుదేశంలోకి వెళ్తే సీట్ రాదేమో అని ఉద్దేశంతో, ఉండిపోతున్నారు... ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెంపు ఉంది అని తెలిస్తే, ఈ వలసలు ఊపందుకుంటాయి.... ఇది ఇలా ఉండగానే, జగన్ కు ఇంకో సమస్య... ఇప్పటికే సగం నియోజకవర్గాల్లో కాండిడేట్ లేక ఇబ్బంది పడుతున్న జగన్ కు, ఇది ఇంకో సమస్యగా మారుతుంది... అందులోనూ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఆ డ్యామేజ్ ఏంటో జగన్ కు తెలుసు... వీటన్నిటిని అలోచించి జగన్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు...

Advertisements

Latest Articles

Most Read