ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాదుడే బాదుడులో దూసుకు పోతుంది. ఆదాయ మార్గాల అన్వేషణ కోసం, కనిపించిన ప్రతి దాని పైన పన్నులు వేస్తుంది. ఇప్పటికే ఎప్పుడో 30 ఏళ్ళ నాడు, ఎన్టీఆర్ కట్టిన గ్రామీణ, పట్టాన గృహ నిర్మాణం కింద నిర్మించిన ఇళ్ళకు వన్ టైం సెటిల్మెంట్ కింద, ప్రభుత్వం డబ్బులు వసూలు చేయటం ప్రారంభించింది. ఇదే పెద్ద రచ్చ అనుకుంటుంటే, ఇప్పుడు తాజాగా మరో బాదుడుకి రెడీ అయ్యింది. వ్యవసాయ భూముల్లో ఏవైతే నిర్మాణాలు జరిగాయో, ఆ నిర్మాణాలకు నాలా పన్ను చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, ఆ నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెనాల్టీతో సహా డబ్బులు కట్టాలని, కొత్త బాదుడి రెడీ అయ్యారు. గతంలో ఇళ్ళకు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ పెట్టగా, ఇది వన్ టైం కలెక్షన్ ఓటీసీని ప్రభుత్వం పెట్టింది. ఈ ఓటీసీ పధకంలో, ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలతో పాటు, అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో, ఎక్కడైతే వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టారో, అవి గుర్తించే పనిలో పడ్డారు. ఆ డేటా మొత్తం ఇప్పటికే రెవిన్యూ అధికారులు ద్వారా, కలెక్టర్లు సేకరించారు. ఈ మొత్తానికి కూడా నాలా పన్ను, ఫైన్ తో కట్టి క్రమబద్దీకరించుకునేందుకు సిద్ధం కావాలని ప్రభుత్వం సూచించింది.

shock 19012022 2

దీని వల్ల ప్రజలకు అధికారికంగా, ఆమోద ముద్ర వేసినట్టు అవుతుందని, ప్రజలకు ఒప్పించాలని చెప్పారు. దీంతో ఇప్పుడు వాళ్ళను నచ్చ చెప్పే పనిలో అధికారులు పడ్డారు. ఈ లెక్కలు అన్నీ వేసిన ప్రభుత్వం, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా డబ్బులు వస్తాయని ఆశిస్తుంది. ఆదాయం బాగా వస్తుందని ప్రభుత్వ అధికారులు లెక్కలు కట్టారు. ఇప్పటికే దీని పై మోఖిక ఆదేశాలు ఇవ్వగా, త్వరలోనే దీని పైన అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, నాలా పన్ను వసూలు కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో , అదే విధంగా పట్టన ప్రాంతాల్లో, నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, ఇలా చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో నిర్మాణాలు చేపట్టారని, ఈ నిర్మాణాలకు సంబంధించి, ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి, చాలా మంది అనుమతులు తీసుకోలేదని, అందుకే ఈ వన్ టైం కలెక్షన్ ద్వారా వారికి బాంపర్ ఆఫర్ ఇచ్చి, డబ్బులు వసూలు చేస్తే, వారికి ఆ స్థలం క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం చెప్పింది. మరి ప్రజలు ఏమంటారో చూడాలి.

ఆంధ్రపదేశ్ ఉద్యోగులు మళ్ళీ నిరసన బాట పట్టిన సంగతి తెలిసిందే. పీఆర్సీ పై, ఇతర అంశాల పై ఇచ్చిన జీవోలో ఉన్న అంశాలు చూసి షాక్ తిన్న ఉద్యోగులు, మళ్ళీ నిరసన బాట పట్టారు. అయితే ఉద్యోగుల నిరసనకు, ఈ రోజు అడ్డ్రెస్ చేస్తూ చీఫ్ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో సానుకూలత వస్తుందని ఉద్యోగులు భావించారు. అయితే చీఫ్ సెక్రటరీ వారికి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల ఆందోళన పై చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రినిసిపల్ సెక్రటరీ రావత్ మీడియా సమావేశం పెట్టి షాక్ ఇచ్చారు. ఉద్యోగుల వినతి పై స్పందిస్తూ, ఇప్పుడు కోవిడ్, ఒమిక్రాన్ ఉన్నాయని, అన్నిటినీ బ్యాలన్స్ చేస్తూ, పీఆర్సీ ని ఫ్రేం చేసామని అన్నారు. 17 వేల కోట్ల మధ్యంతర భ్రుతి ఇప్పటి వరకు ఉద్యోగులకు ఇచ్చాం అని అన్నారు. ఐఆర్ సాలరీలో భాగమనే ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఉద్యోగి జీతంలో గ్రాస్ సాలరీ తగ్గకుండా చూడాలని, తాము అదే చేసామని అన్నారు. అయితే మిగతా వాటిల్లో మాత్రం, కొన్ని తగ్గవచ్చు, కొన్ని పెరగవచ్చని, గ్రాస్ సాలరీ మాత్రం గతంలో కంటే ఎక్కువే ఉందని అన్నారు. అలాగే 62 ఏళ్ళ ఉద్యోగ రిటైర్మెంట్ వయసు పెట్టటం వల్ల, ఉద్యోగాలు తగ్గిపోతాయి అనేది కూడా సమంజసం కాదని అన్నారు. జీవన ప్రమాణాలు ఏపిలో పెరిగాయని అన్నారు.

cs 19012022 2

అందుకే రిటైర్మెంట్ వయసు పెంచామని అన్నారు. దీంతో పాటు ఐఆర్ కంటే తక్కువగా పీఆర్సీ ఇచ్చారని, ఉద్యోగులు చెప్పిన విషయం పై, మళ్ళీ పీఆర్సీ వేసిన విషయంలో, ఐఆర్ వెనక్కు తీసుకునే అవకాసం తమకు ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన నుంచి, ఇప్పటి వరకు అన్ని పరిణామాలు చెప్పుకుంటూ వస్తున్నారు. దక్షిణాదిలోనే అన్ని రాష్ట్రాల కంటే, మనకే తక్కువ ఆదాయం వస్తుందని అన్నారు. అలాగే తెలంగాణాలో మన ఆస్తులు ఇంకా రావలసి ఉందని అన్నారు. రాజధాని లేకపోవటం వల్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం నష్టపోయిందని వాపోయారు. అలాగే కరెంటు బకాయలు కూడా తెలంగాణా నుంచి రావాలని అన్నారు. ఇలా అన్ని విషయాలు, చెప్పుకుని వచ్చారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగులకు చాలా చేసామని అన్నారు. ఇలా తమ ఇబ్బందులు అన్నీ చెప్పుకొచ్చారు. దీంతో ఉద్యోగులు తమ బాధ గురించి చెప్పమంటే, ప్రభుత్వ బాధలు చెప్పటం పై షాక్ అయ్యారు. మరి ఉద్యోగులు ఏమి చేస్తారో మరి.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకి, చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాసారు. చంద్రబాబు నిన్న కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్వల్ప లక్షణాలతో తాను కోవిడ్ బారిన పడ్డానని చెప్పిన సంగతి తెలిసిందే. చంద్రబాబు త్వరగా కోలుకోవాలి అంటూ, అనేక మంది దేశ వ్యాప్తంగా, ఆయనకు విషెస్ పంపించారు. ఈ రోజు ఉదయం చంద్రబాబుకు భారత్ లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాసారు. చంద్రబాబు త్వరగా కోలుకోవాలి అంటూ సున్ వెయిడాంగ్ లేఖలో ఆకాంక్షంచారు చైనా రాయబారి. చంద్రబాబు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ చైనా రాయబారి లేఖ రాసారు. ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చంద్రబాబు స్థాయి ఇది అంటూ, టిడిపి శ్రేణులు పోస్ట్ చేస్తున్నాయి. అధికారంలో ఉన్నా, లేకపోయనా, చంద్రబాబుకు ఎప్పుడూ దేశ వ్యాప్తంగా గౌరవం ఉంటుందని పోస్ట్ లు పెడుతున్నారు.

కోవిడ్ బాధితుల పరిహారాన్ని వారి బాంధవులకి చెల్లించటంలో, దేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా, బీహార్ ప్రభుత్వాలు, చెల్లించక పోవటం పై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గతంలో సుప్రీం కోర్టు ఈ విషయంలో కోవిడ్ బాధితులకు సంబంధించి, మరణించిన వారి కుటుంబాలకు, వారు బంధువులకు 50 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశించటానికి ముందే, కేంద్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలకు ఉన్న స్టేట్ డిజాస్టర్ ఫండ్స్ కింద, ఈ నిధులు ఇవ్వచ్చు అని కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశాల ప్రకారం కోవిడ్ కారణంగా మరణించిన వారి కుటుంబాలకు, ఈ నష్ట పరిహారం, రాష్ట్రాలు చెల్లించాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ చెల్లింపులు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్ పైన ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించినా కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించకపోవటం పై, చట్ట వ్యతిరేకం అంటూ ధర్మాసనం పేర్కొంది.

sc 19012022 2

ఈ రాష్ట్రాలు చట్టాలకు అతీతులు కారని, రెండు రాష్ట్రాలు ఇలా తమ ఆదేశాలు పాటించపొతే కుదరదు అంటూ, సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్, అలాగే బీహార్ రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీలను తమ ముందు హాజారు కావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరు కావాలి అంటూ సుప్రీం కోర్టు ఆదేశించిటం చూస్తే, ఎంత సీరియస్ గా ఈ అంశం పై సుప్రీం కోరుట్ ఉందో అర్ధం అవుతుంది. రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఈ రోజు నోటీసులు జారీ చేస్తూ, చట్టానికి అతీతులు కారని, వీరు తమ ముందు హాజరు కావలసిందే అంటూ అగ్రహ వ్యక్తం చేసింది. ఎందుకు ఈ విధంగా రెండు రాష్ట్రాలు ఇలా నిర్లక్షం చేస్తున్నారో చెప్పాలి అంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో సుప్రీం కోర్టు మోదటి నుంచి సీరియస్ గ ఆంది. ముందుగా 2 లక్షలు ఇవ్వాలని ఆదేశించినా, నిధులు కొరత అని చెప్పటంతో, 50 వేలకు కుదించారు. అయితే ఇక్కడ ఆ డబ్బులు కూడా ఇవ్వలేక పోవటంతో, సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisements

Latest Articles

Most Read