ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్, ఇవాళ తను నివాసం ఉంటున్న తెలంగాణా రాష్ట్రం నుంచి బయలుదేరి తిరుమల రానున్నారు.. రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు... అయితే క్రితం సారి జగన్ తిరుమల వచ్చినప్పుడు చేసిన హంగామా గుర్తు తెచ్చుకుని, వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు... ఎందుకంటే, అప్పుడు జగన్ తిరుమలలో చేసిన వీరంగం అలాంటింది... ఈ సారి, ఏమి చేస్తారో, ఎలా చేస్తారో అని ఆందోళన చెందుతున్నారు... నిజానికి జగన్ కు, ఆలయాల్లో ఎలా ఉండాలి అనే నియమాలు తెలీవు... తను క్రీస్టియన్ కనుకే, హిందువుల వోట్లు తనకి పడట్లేదు అని, అందుకే హిందువులను మంచి చేసుకోవటానికి, అలాగే ఆర్ఎస్ఎస్ నేతలను మచ్చిక చేసుకోవటానికి, జగన్ ఈ గుడులు, స్వామీజీల కాళ్ళ మీద పడటం లాంటి పనులు చేస్తున్నారు... భారత దేశంలో ఏ మతం వారైనా, వెంకన్నను దర్శించుకోవచ్చు కాని, అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, జగన్ పోయిన సారి అవన్నీ తప్పారు... అందుకే ఆందోళన....
ఇంతకీ అప్పుడు జగన్ ఏమి చేసారో తెలుసా... మార్చ్ 12, 2014న జగన్ తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళినప్పుడు చేసిన వీరంగం ఇది ... చెప్పులు వేసుకుని క్యూ కాంప్లెక్స్‌లోకి వెళ్లే యత్నం చేశారు.... అక్కడ ఉన్న వారు వారించటంతో, చెప్పులు తీసాడు... వెంకన్న నామస్మరణ మరోమోగాల్సిన లయం వద్ద అనుచరుల 'జై జగన్' నినాదాలు చేసారు, జగన్ అభిమానులు... జగన్ తో పాటు వచ్చిన అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది, టికెట్లు లేకుండానే దౌర్జన్యంగా క్యూల్లోకి వచ్చారు... జగన్ హిందూ మతస్తుడు కాదు... అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వస్తే, డిక్లరేషన్ ఇవ్వాలి... జగన్ అది కూడా చెయ్యలేదు... జగన్, ఆయన అనుచరులు, సామాన్యులని ఆపేసి, దాదాపు 25 నిమషాలు స్వామి వారి సన్నిధిలో ఉన్నారు... చివరకి రాష్ట్రపతి వచ్చినా, 10 నిమషాలకు మించి ఉండరు...
ఇక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, తిరుమల ఏడు కొండలు కాదు, రెండు కొండలే అని జిఓ కూడా ఇచ్చారు... తరువాత విమర్శలు రావటంతో వెనక్కి తగ్గి, జిఓ సవరించారు... అసలు దేవుడంటేనే నమ్మకం లేదని.. విగ్రహాలను చెప్పుతో కూడతానంటూ.. వీరంగాలాడిన సూడో కమ్యునిస్టు…కరుణాకరరెడ్డిని ఛైర్మన్ గా చేశారు.... ఎవరి మతాలను వారు గావురవించటం తప్పులేదు కానీ, ఇతర మతాలను కావాలని కించపరచటం చులకన భావంతో చూడటం దారుణం.... హిందూ సంప్రదాయాలను చులకన చెయ్యటం వీరి ఉద్దేశమే ఏంటో కాని, ఈ సారైనా జగన్ సవ్యంగా దర్శనం చేసుకుంటాడు అని ఆశిద్దాం... ప్రతి హిందువు కలియుగ దైవంగా భావించే వెంకన్న దర్శనంలో ఈసారైనా, సాంప్రదాయాలు పాటిస్తాడు అని ఆశిద్దాం...