ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎలా దోబుచులాడుతుందో చూస్తున్నాం... మరో పక్క ప్రతిపక్షం అడుగు అడుగునా అడ్డంకులు కలిగిస్తుంది... కోర్ట్ ల్లో కేసులు వేసి, ప్రాజెక్ట్ జాప్యానికి ప్రయత్నిస్తుంది...కేంద్రమేమో అంచనాలు పెంచడానికి ససేమిరా అంటోంది. విభజన తర్వాత రూ.12 వేల కోట్ల పనులు చేస్తే కేంద్రం ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాలి. నాబార్డు రుణం అన్నా అతీగతీ లేదు. కేంద్ర బడ్జెట్‌లో మాత్రం రూ.రెండు మూడొందల కోట్లు ప్రతిపాదిస్తున్నారు. పూర్తి నిధులిస్తామన్న కేంద్రం పాత లెక్కలను పట్టుకొని వేలాడుతుంది.... జగన్ పార్టీ వారు, ఇంత అంచనాలు ఎందుకు పెరిగాయి అంటున్నారు... మరి అప్పుడు మీ నాన్న గారు, ఏమి చేసారు అయ్యా అంటే, సమాధానం ఉండదు...
పోలవరం అంచనా వ్యయం 2010-11లో రూ.16 వేల కోట్లు కాగా, 2013-14 లెక్క రూ.58 వేల కోట్లు. విద్యుత్ కేంద్రాన్ని తీసేస్తే రూ.54 వేల కోట్లు. ట్రాన్స్‌స్ట్రారుకి ఇచ్చిన హెడ్‌వర్క్స్ రూ.6 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు పెరిగాయి. నిర్వాసితుల పునరావాసం రూ.3 వేల కోట్ల నుంచి రూ.33 వేల కోట్లకు పెరిగింది. అంటే, అన్ని పనుల్లోకి నిర్వాసితుల పునరావాసానికే 70% అదనపు చెల్లింపులు చెయ్యాలి... అంచనా వ్యయం భారీగా పెరగటానికి కారణం, ఈ నిర్వాసితులకి చెల్లింపులే... మరి ఈ పాపం ఎవరది ? మా నాన్న ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసాడు, చంద్రబాబు రిబ్బన్ కటింగ్ చేసి నీళ్ళు ఇస్తున్నాడు అని చెప్తున్న, జగన్ వీటికి ఏమి సమాధానం చెప్తాడు ? రాష్ట్రానికి డబ్బులు పుష్కలంగా ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి, నిర్వాసితులకి చెల్లింపులు ఎందుకు చెయ్యలేదు ? ఇప్పుడు లోటు బడ్జెట్ లో, చంద్రబాబు కేంద్ర సహయం కోసం నానా తిప్పలు పడుతుంటే, ప్రతిపక్షం సహకరించాల్సింది పోయి, ఎందుకు జాప్యం చెయ్యటానికి చూస్తుంది... కాంగ్రెస్ పార్టీ తెచ్చిన భూసేకరణ చట్టం వలన ఒక్క పునరావాసానికే, 33 వేల కోట్ల అదనపు ఖర్చు అవుతుంది... చంద్రబాబు కమిషన్ ల కోసం, అంచనాలు పెంచింది ఏంటి దీంట్లో ?
అప్పట్లో రాజశేఖర్ రెడ్డి మొబిలైజేషన్ అడ్వాన్సు లు అని, కాలువల్లో మట్టి కోసం అని మాత్రమే పనులు చేసి, కాంట్రాక్టుర్ లు లబ్ది పొందేలా, ఈయనకి, ఈయన కుమారుడికి కమిషన్ ఎక్కువ వచ్చేలా చూసుకున్నారు... అప్పుడే ఈ నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే, ఇప్పుడు చంద్రబాబుకి ఈ బాధలు ఉండేవి కాదు... కేవలం కాలువల్లో మట్టి డబ్బులు నొక్కేయ్యటానికి మాత్రమే పనులు చేశారు.. అసలు ప్రాజెక్ట్ కాంక్రీట్ పనులు కాని, గేటులు కాని, ఇలాంటి వాటి జోలికే పోలేదు... ఇప్పుడు చంద్రబాబు నానా కష్టాలు పడుతుంటే, చంద్రబాబుని విమర్శిస్తారు జగన్ పార్టీ వారు... మరి ఆ రోజు, రాజశేఖర్ రెడ్డికి పోలవరం కట్టాలి అని ఉంటే,ఒక్క ఎకరా కూడా ఎందుకు నిర్వాసితుల దగ్గర తీసుకోలేదు అంటే సమాధానం ఉండదు...