ముఖ్యమంత్రి కావాలి అనే సంకల్పంతో, ప్రజా సంకల్పం అనే పేరుతో, ఈ నెల 6వ తేది నుంచి జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే... ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన పాదయాత్ర, మొత్తానికి ప్రరంభంకానుంది.... ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్ చేరుకుంటారు. అనంతరం 4వతేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే 5వతేదీన కడప పట్టణంలోగల దర్గాను దర్శిస్తారు. అనంతరం పులివెందులకు చేరుకుని చర్చిలో ప్రార్ధనలు చేస్తారు. అనంతరం నవంబర్ 6 నుంచి, ఇడుపులపాయకు చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.
అయితే తిరుమల శ్రీ వారి దర్శనం కంటే ముందే, ఇవాళ ఉదయం, నాంపల్లి కోర్ట్ దర్శనానికి జగన్ వచ్చారు... అక్రమ ఆస్థుల కేసులో, జగన్ 11 కేసుల్లో A1గా ఉన్న సంగతి తెలిసిందే... ఈ కేసుల విచారణ నిమిత్తం, ప్రతి శుక్రవారం జగన్ కోర్ట్ కి హాజరు కావాల్సి ఉంది... దాని కోసం, ఇవాళ సాయంత్రం తిరుమల టూర్ ఉన్నా, ఇవాళ శుక్రవారం కాబాట్టి, నాంపల్లి సిబిఐ కోర్ట్ దర్శనం చేసుకున్నారు...
జగన్ తో పాటు, 11 కేసుల్లో A2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా, కోర్ట్ కి హాజరయ్యారు... వీరికి ఇంకా పిలుపు రాకపోవటంతో, ఇద్దరూ కుర్చుని కోర్ట్ హాల్ లో, పాదయాత్ర గురించి చర్చించుకుంతునట్టు సమాచారం... మరి కొద్ది సేపట్లో ఇంకో విశిష్ట అతిధి అయిన, ఓబులాపురం మైనింగ్ డాన్, జగన్ కి దేవుడు ఇచ్చిన అన్నయ్య అయినటువంటి, గాలి జనార్ధన్ రెడ్డి కూడా కోర్ట్ కి రానున్నారు... గాలి కూడా వచ్చిన తరువాత, ముగ్గురూ మరోసారి కలుసుకోనున్నారు... మొత్తానికి, పాదయాత్ర మొదలు పెట్టే రెండు రోజుల ముందు, జగన్ నాంపల్లి కోర్ట్ లో హాజరు వేయుంచుకుని బయలుదేరనున్నారు...