అసైన్డ్ భూముల చట్టం... దశాబ్దాలుగా రాష్ట్రంలోని పేదలకు, ముఖ్యంగా దళితులకు వారి జీవితాలకు అండగా నిల్చిన చుట్టం! పెద్దలు, గద్దలు, బలవంతులు నయానో భయనో కొట్టుకుపోకుండా కాపాడిన చట్టం.. అలాంటి బలమైన రక్షణ దడిని.... ఇడుపుల పాయలో తాను చేసిన పాపం పండకుండా ఉండేందుకు తనకు శిక్షపడకుండా తప్పించుకునేందుకు తనలాంటి పెద్దలకూ, గద్దలకూ ఇకమీదటెలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు... ఒక్క కలం పోటుతో కుమ్మేసిన ఘనత మహానేత అని పిలుచుకునే వైఎస్ఆర్ ది! దళితుల క్షేమం మావల్లే... జగన్ మళ్లీ తెస్తానంటున్న రాజన్న రాజ్యం లో దళితులకు జరిగిన అన్యాయం చూతము రారండీ! పేదల నుంచి బలవంతంగా భూములను తీసుకోవటం కోసం అత్యంత పటిష్ఠమైన అసైన్డు భూముల చట్టానికి వైఎస్ సర్కారు తూట్లు పొడిచింది. చట్టానికి సవరణలను తేవటాన్ని హైకోర్టు తాత్కాలికంగా అడ్డుకున్నా, వైఎస్ సర్కారు ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. సవరణ చట్టాన్ని పెద్దలకు ఒక ఆయుధంగా పనికొచ్చేలా చేసి దాని ద్వారా విలువైన భూములన్నీ వారి పరం అయ్యేలా పావులు కదిపింది. అసైన్డు భూములను లాక్కోవటానికి ప్రాంతాలను నోటిఫై చేసి మరీ పేదల పొట్టకొట్టింది.

idupulapaya 06112017 2

అసైన్డు భూముల చట్టానికి సవరణలు తేవటానికి ముందు సాక్షాత్తూ వైఎస్, ఆయన కుటుంబ సభ్యుల అధీనంలోనే ఇడుపులపాయలో భారీగా అసైన్డు భూములుండేవి. ఈ విషయం బయట పడటంతో వాటిని తిరిగి ఇచ్చేస్తున్నట్టుగాను, వాటి తొలి లబ్ధిదారులు ఎవరో తెలియదు కనుక భూములను విద్యా సంస్థలకు అప్పగిస్తున్నట్లు అప్పట్లో వైఎస్ ప్రకటించారు. చట్టం ప్రకారమైతే పేదల భూములను ఇంతకాలం అనుభవించినందుకు వైఎస్, ఆయన కుటుంబ సభ్యులు శిక్షార్హులు. కానీ... ఆ భూములు ఎప్పుడో తమ కుటుంబ సభ్యుల పేర రిజిస్టరై ఉన్నాయిగనుక... ఆ తప్పు రిజిస్ట్రేషన్ అధికారులదేగాని తమది కాదంటూ వైఎస్ సమర్థించుకున్నారు. తర్వాత అసైన్డ్ భూముల చట్ట సవరణ చేశారు. ఇడుపులపాయ భూములను అప్పగిస్తున్న సమయంలోనే ఎవరి వద్దనైనా అసైన్డ్ భూములున్నట్లెతే 90 రోజుల్లో ప్రభుత్వానికి స్వాధీనం చేయాలంటూ వైఎస్ ప్రకటించి అదే విషయాన్ని చట్ట సవరణలో చేర్చారు కూడా! అలా చట్ట సవరణతో వైఎస్, ఆయన కుటుంబ సభ్యులు శిక్ష నుంచి బయటపడగలిగారు.

అంతే కాదు, తన సొంత స్థలం అయిన ఇడుపులపాయ ఎస్టేట్ కోసం వైఎస్ ఎన్నో అడ్డగోలు జీఓలు ఇచ్చి, ఇడుపులపాయ ఎస్టేట్ తను సేద తీరటానికి ప్రభుత్వ డబ్బులు తగలేశారు... ఆ ఎస్టేట్ లో ఏమి చేసేవారో తెలీదు కాని, చిన్న చీమ కూడా లోపలకి పోయే అవకాసం లేకుండా తన సొంత ఫాక్షన్ బ్యాచ్ తో, పహారా కాసే వారు... ఎకో పార్క్ అని, పీకాక్ పార్క్ అని, ఇలా ప్రభుత్వ డబ్బులతో ఇడుపులపాయ ఎస్టేట్ లో నిర్మించుకుని, ఎంజాయ్ చేసేవారు... 85 కోట్లు పెట్టి, తన ఎస్టేట్ కోసం 4 లేన్ రోడ్ వేయించారు... చివరకి అక్కడ హెలిపాడ్ కూడా నిర్మించారు... ఈ ఇడుపులపాయ ఎస్టేట్ లోనే, ఎన్నో వ్యవహారాలు నడిచేవి... అప్పటి స్కాంలు అన్నీ జగన్, ఇక్కడ నుంచే చేసేవారు... ఇప్పుడు జగన్ తన పాదయాత్ర తొలి అడుగు ఇక్కడ నుంచే వేశారు... ఇది ఇడుపులపాయలో, తండ్రి కొడుకులు కలిసి చేసిన ముడుపుల మాయ...

idupulapaya 06112017 8

idupulapaya 06112017 3

idupulapaya 06112017 4

idupulapaya 06112017 5

idupulapaya 06112017 6

idupulapaya 06112017 7

నేను నిజాయితీపరుడుని... నాకు అవినీతి అంటే ఏంటో తెలీదు... నాకు మోసం చెయ్యటం రాదు.. ఇది మా నాన్న నాకు నేర్పించింది... నన్ను అంత పద్ధతిగా, అవినీతి అంటే ఏంటో తెలీకుండా మా నాన్న నన్ను పెంచాడు.... మా నాన్న పాలించిన కాలం, స్వర్ణ యుగం... అందుకే అలాంటి పాలన మళ్ళీ రావాలి, అందుకే పాదయాత్ర చేస్తున్నా... మా నాన్న స్వర్ణ యుగం మళ్ళీ తీసుకువస్తా... చంద్ర బాబు పాలనా లో ఆనందం కరువైంది... నేను వస్తే, ఆనందమే ఆనందం.... చంద్రబాబు పాలనలో ఐఏఎస్ ల పని తీరు చూసారా... నేను వస్తే, వాళ్ళు ఎలా పని చెయ్యాలో చేప్తా.... ఇది జగన్, తన పాదయత్ర మొదలు అవుతున్న సందర్భంగా చేసిన ప్రసంగం... ఇంకా చాలా ఉంది, చదవండి... 

jagan 06112017 2

చంద్రబాబుకి రాజధాని ఎలా కట్టాలో తెలీదు... నాకు తెలుసు... చంద్రబాబుకి పెట్టుబడులు ఎలా తేవాలో తెలీదు, కాని నాకు తెలుసు.. చంద్రబాబుకి పరిపాలన ఎలా చెయ్యాలో తెలీదు.. కాని నాకు తెలుసు... చంద్రబాబుకి పోలవరం ఎలా కట్టాలో తెలీదు... కాని నాకు తెలుసు... చంద్రబాబుకి నీళ్ళు ఎలా ఇవ్వాలో తెలీదు... కాని నాకు తెలుసు... చంద్రబాబుకి ముసలి వాళ్ళకి పెన్షన్ ఎలా ఇవ్వాలో తెలీదు... కాని నాకు తెలుసు... చంద్రబాబుకి వ్యాపారాలు ఎలా చేపించాలో తెలీదు... కాని నాకు తెలుసు.... చంద్రబాబు చేసేవి స్కాంలు... నేను చెయ్యాలి అనుకునేది అభివృద్ధి... చంద్రబాబు అవినీతిలో నెంబర్ వన్... నేను, అభివృద్ధిలో నెంబర్ వన్...

jagan 06112017 3

మన రాష్ట్రంలో అసలు వర్షాలు పడ్డాయా ? నేను పాదం పెడితే వర్షాలు పడతాయి... చంద్రబాబు నాలుగేళ్లలో ఏమి చేసాడు ? నేను ఒక్క సంవత్సరంలో చేస్తా... 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటా... మా నాన్న ఫోటో పక్కన, నా ఫోటో పెట్టుకోండి... ఇవాల్టి నుంచి పాదయత్ర చేస్తున్నా... శుక్రవారం మాత్రం కోర్ట్ కి పోవాలి, ఆ రోజు అందరికీ సెలవు... నా కోసం ఎదురు చూస్తూ ఉండండి, నేను ముఖ్యమంత్రి అవ్వగానే మీ సమస్యలు తీర్చేస్తా... గెట్టిగా నేను ముఖ్యమంత్రి అవ్వాలి అని మీరందరూ ప్రార్ధించండి... మా నాన్న ఆశయమే నా ఆశయం.. అదే...అవినీతి లేని సమాజం... అంటూ జగన్ ప్రసంగం ముగించారు... అంతే జగన్ రాక్స్... జనం షాక్స్...

ముఖ్యమంత్రి కుర్చీ కోసం, ఒక పక్క పాదయాత్ర చేస్తున్న ఉత్సాహం ఉన్నా, లోపల మాత్రం జగన్ టెన్షన్ తో ఉన్నారు... దీని అంతటికీ కారణం తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్... జగన్ తన సొంత మీడియా, పేపర్ తో పాటు, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి, ఎంత విష ప్రచారం చేస్తున్నారో తెలిసిందే... అలాగే ఏనాడు రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోక, నిర్మాత్మకమైన సలహాలు ఇవ్వకుండా, రాజకీయ స్వార్ధం కోసం రాష్ట్ర పరువు తియ్యటానికి కూడా జగన్ వేనుకాడుటలేదు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దానికి విరుగుడుగా, జగన్ ని టార్చర్ పెట్టే గేమ్ ప్లాన్ ప్రారంభించింది. జగన్ వైఖరి పట్ల చాలా మంది నాయకులు, ఎమ్మల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే... ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి ఆయుధం అయ్యింది... తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనంతో పాదయాత్రలో తొలి అడుగువేసిన జగన్ కు ఆరంభంలోనే షాకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన రంపచోడవరం శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరిని తెలుగుదేశం పార్టీ చెంతకు చేర్చుకుని తమ ఉద్దేశ్యాన్ని మరోసారి స్పష్టం చేసింది.

jagan 051120d17 2

నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లోనూ, కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేసిన తెలుగుదేశం పార్టీ మరింత ఉత్సాహంగా ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్స్ ని రాజకీయంగా దారుణంగా దెబ్బతీసే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతుంది. వైఎస్సార్స్ ఎమ్మెల్యేలు పలువురు తమతో టచ్లో ఉన్నారని, వారంతా తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటనలు గుప్పించిన టిడిపి సీనియర్ నాయకులు జరగబోయే పరిణామాలను వెల్లడించారు. ఇదే అంశం జగన్‌ను కలవరపెడుతోందని వైసీపీలో చర్చ జరుగుతోంది. సుమారు 15 మంది టీడీపీ గూటికి చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో వారెవరో తెలుసుకోవాలని జగన్ ముఖ్య నేతలకు చెప్పినట్లు సమాచారం. వాళ్ళని ఈ పాదయాత్ర అయ్యే వరకు ఎలా అయినా ఆపాలని బొత్సా, అంబటికి బాధ్యతలు అప్పగించారు... తరువాత వెళ్ళినా ఇబ్బంది లేదని, ఇప్పుడు వెళ్తే నా పరువు అంతా పోతుంది అని జగన్ టెన్షన్ లో ఉన్నారు...

jagan 051120d17 3

జగన్ పాదయాత్ర తేదీని ప్రకటించిన వెంటనే కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను పార్టీలో చేర్చుకుని తమ ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసిన టిడిపి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డిని అడుగడుగునా దెబ్బతీస్తామని హెచ్చరికలు పంపింది. ఈనెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించనుండగా, అదే రోజు మరో ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి రానున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే జగన్ మీద చాలా మంది ఎమ్మల్యేలు అసంతృప్తితో ఉన్నా, ఎలాగొలా నేట్టుకుస్తున్నారు.. కాని, జగన్ తీసుకున్న తాజా నిర్ణయంతో, కొంత మంది ఎమ్మల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు... శాసనసభ సమావేశాల బహిష్కరించిన వైసీపీ ఆధినేత తీరు సరైందికాదు, ప్రజాస్వామ్య విధనాలకు ఆయన తిలోదకాలు ఇచ్చారనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళకుండా, ఈ పదవులు ఎందుకు, ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా, ఈయన వెనుక తిరిగితే, మాకు రేపు ఓట్లు వెయ్యమంటే ఎవరు వేస్తారు... మేము అవసరమైతే ప్రజా తీర్పుకు తలొగ్గి అసెంబ్లీకి వెళ్తాం... జగన్ ఏమి చేస్తాడో చూస్తాం అంటూ ధిక్కార స్వరంలో ఉన్నారు... ఇలాంటి వాళ్ళని కూడా తెలుగుదేశం ట్రాప్ చేసి, జగన్ కు టార్చర్ అంటే ఏంటో చూపించాలి అనే ఉద్దేశంలో ఉంది... ఇప్పుడు మాకు టైం వచ్చింది... ఇన్నాళ్ళు జగన్ అసత్య ప్రచారాలతో మమ్మల్ని ఎలా వేధించాడో, మేము దానికి రెండింతలు జగన్ ని ఎండగాడతాం అంటుంది అధికార పక్షం...

ట్యాక్స్ ఎగ్గొట్టి, విదేశాల్లో వేల కోట్లు నల్ల డబ్బు దాచుకున్న "ప్యారడైజ్ పేపర్స్" జాబితా లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 714 మంది పేర్లులో, స్థానం సంపాదించి రాష్ట్రం పరువు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ, మొదలు పడదాం... ఒక పక్క మన ముఖ్యమంత్రి అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర ఇమేజ్ పెంచుతుంటే, ఈ దొంగల బ్యాచ్, మన రాష్ట్ర పరువు అంతర్జాతీయ స్థాయిలో తీస్తుంది... పోయిన ఏడాది "పనామా పేపర్స్"లో, జగన్ బినామీ రాంప్రసాద్ రెడ్డి గుట్టు రట్టు చేసేంది....2005లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ లో ఆరెంజ్ గ్లో లిమిటెడ్ అనే కంపెనీ ఏర్పాటు చేశారు. అడ్రెస్ గా హైద్రాబాద్ సిద్దార్థ్ నగర్ లోని ప్లాట్ నంబర్ 46 ని ఇచ్చారు. తీరా ఆరా తీస్తే ఆయన అరబిందో ఫార్మాలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని విజయసాయి రెడ్డికి వియ్యండుకు కూడా అని నిర్ధారణ అయ్యింది... ఇప్పుడు తాజాగా "ప్యారడైజ్ పేపర్స్"పేరిట ఏకంగా జగన్ గుట్టే బయట పడింది...

paradise papers jagan 06112017 2

ఇండియన్ ఎక్ష్ప్రెస్స్, ICIJ ఇన్వెస్టిగేషన్ లో, తాజాగా చెప్పిన దాని ప్రకారం ఇప్పటివరకు సిబిఐ కూడా పట్టుకోలేదని, జగన్ చేసిన మోసాలు ఇంకా చాలా ఉన్నాయి అంటుంది.. పూర్తి వివరాలు అప్లోడ్ చేస్తున్నాం అని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 180 దేశాలకు సంబంధించి, 13.4 పత్రాలు అప్లోడ్ చేస్తున్నాం అని చెప్పింది... పూర్తి వివరాలు ఇక్కడ అప్లోడ్ చేస్తాం అంటుంది https://www.icij.org/investigations/paradise-papers/ బహుసా, సాయంత్రంలోపు, మనోడు చేసిన మరిన్ని ఘనకార్యాలు మనం తెలుసుకోవచ్చు... ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కధనం ప్రకారం జగన్ గురించి ఇలా రాసి ఉంది "fresh financial links in a CBI case against YSR Congress Chief YS Jagan Mohan Reddy"

paradise papers jagan 06112017 3

ఇది వరకు జగన్ అక్రమాలను పనామా పేపర్స్ గుట్టుర‌ట్టు చేశాయి. అప్పుడు పనామా పేపర్స్ ఉదంతంలో రాంప్రసాద్ రెడ్డి పేరు బయటికి వచ్చింది. రామ్ ప్రసాద్ రెడ్డి విజయసాయి రెడ్డికి బినామీ. విజయసాయి రెడ్డి జగన్ కు బినామీ అని అందరికీ తెలుసు. మొత్తంగా తేలిందేమిటంటే పనామా బయట పెట్టింది జగన్ బినామీ పేరిట పెట్టిన పెట్టుబడుల విషయమే. మనీలాండరింగ్‌ ద్వారా బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్‌కు పంపిన గుట్టును పనామా పత్రాలు ధ్రువీకరిస్తున్నాయన్నారు. ఇప్పుడు "ప్యారడైజ్ పేపర్స్" లో ఏమి కొత్త విషయలు తెలుస్తాయో చూడాలి... ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ కధనం ప్రకారం సిబిఐ కూడా పట్టుకోలేదని, జగన్ చేసిన మోసాలు ఇంకా చాలా ఉన్నాయి అంటుంది.. చూద్దాం... ఇది ఇలా ఉండగా, 11 A1 కేసులు వెనక పెట్టుకుని, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్లి సంతకం పెట్టి వస్తూ, ఇవాల్టి నుంచి పాదయాత్ర అంటూ ప్రజల్లోకి రానున్నారు జగన్...

Advertisements

Latest Articles

Most Read