గత మూడు సంవత్సరాల నుంచి నోరు తెరిస్తే, రుణ మాఫీ అవ్వలేదు, అవ్వలేదు అని గోల చెయ్యటం... ఎవరికి అవ్వలేదో చెప్పండి, అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అడిగితే, పలాయనం చిత్తగించటం... బురద జల్లటమే కాని, ఏ రోజు ప్రజా సమస్యల పై చిత్తసుద్ధితో పోరాడే ఓపిక లేదయ్యే... ఫోటోషాప్ లు, దొంగ వార్తలు, విషపు రాతలే కాని, ఏ రోజు ప్రజా సమస్యల మీద పోరాటం ఉండదు... రుణ మాఫీ వేస్ట్ అన్న వైఎస్ మాటలు ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మర్చిపోలేదు.. రుణమాఫీ అని చంద్రబాబు ఎలక్షన్స్ ముందు హామీ ఇస్తే, అది అయ్యే పనే కాదు అని జగన్ ఎగాతాలి కూడా ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మర్చిపోలేదు.. చంద్రబాబు చేసిన రుణ మాఫీ కూడా ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మర్చిపోలేదు..
రూ.50వేల లోపు రుణాలు ఏకమొత్తంలో మాఫీ జరిగాయి. ఇప్పటికే రూ.14,500 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయడమైంది. హామీ ఇవ్వకపోయినప్పటికీ ఉద్యాన రైతులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.370 కోట్ల రుణాలు మాఫీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన తొలి రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్ దేశంలో గుర్తింపు పొందింది... అయినా సరే, ఒక్క రైతుకి కూడా రుణమాఫీ అవ్వలేదు అని మన అవినీతి పత్రికలో విషం చిమ్మతమే పని... కట్ చేస్తే, జగన్ సొంత బంధువులకు, వైసీపీ ఎమ్మల్యేలు, ZPTC, MPTC, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకలు ఇలా ఇంత మంది వైసీపీ పార్టీ నాయకులు ఉన్నారు.... చంద్రబాబు చేసిన రుణమాఫీకి జై కొట్టారు...
జగన్ అన్న అయిన వై.యస్ మదన్మోహన్ రెడ్డికి, జగన్ వదిన అయిన శ్రీమతి వై.యస్ మాదవీ లతకు మాఫీ అయిన విషయం నిజం కాదా? పులివెందుల ఆంధ్రా బ్యాంక్ లో తీసుకున్న పంట రుణం మాఫీ కావడం జరిగింది. వై.యస్ మధు అకౌంట్ నెంబర్ 045213100036589 లో రెండు విడతలుగా 63 వేలు,3 వ కంతుగా 36 వేలు వచ్చిన విషయం వాస్తవం కాదా.? వై.యస్ మాధవి లత అకౌంట్ no. 045213100036613 లో రెండు కంతులుగా 59643 రూపాయలు ,3 వ కంతుగా 34081 రూపాయలు రావడం జరిగింది. తన కుటుంబ సభ్యులకు రుణ మాఫీ పొంది ఎవరికి మాఫీ కాలేదని చెప్పడం జగన్ అసహనానికి నిదర్శనం. పులివెందులలో 99 శాతం మందికి మాఫీ అయింది. ఈ లిస్టు చూడు జగన్... నీ పాదయాత్రలో ఇదే చెప్తావా జగన్ ?