అవును మీరు వింటుంది నిజమే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మనం ముద్దుగా పిలుచుకునే జగన్ పేరు మార్చుకున్నారు... అరువుకి తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ చెప్పాడో ? లేక న్యూమరాలజీ వాళ్ళు చెప్పారో ? లేక జోతిష్యం చెప్పే వాళ్ళు చెప్పారో కాని... పాదయాత్ర నుంచి జగన్ పేరు మారిపోతుంది...

jagan p 01112017 2

మొన్న జగన్ లండన్ కు వెళ్ళే ముందు జరిగిన వర్క్ షాప్ లో, ఇందుకు సంబంధించి, నాయకులకి కూడా సమాచారం అందింది... పాదయత్రకు సంబదించి బ్రోచర్లు, పోస్టర్స్ అన్నీ ఇక నుంచి కొత్త పేరుతో రానున్నాయి... చివరకి మీడియాకి కూడా ఇక నుంచి జగన్ ను అలాగే పిలవాలని ఆర్డర్స్ వెళ్ళాయి... నేషనల్ మీడియాలో కూడా ఇక నుంచి జగన్ రెడ్డి అనే పేరు వినిపించదు... ఇంతకీ జగన్ కొత్త పేరు ఏంటో తెలుసా JMR...

jagan p 01112017 3

ఈ JMR గారు పేరు ఎందుకు మార్చుకున్నారో క్లారిటీ లేదు కాని, YSR అనే ముద్ర పడాలి అంటే, పేరు షార్ట్ చేసుకోవాలని పీకే సలహానేమో అంటున్నారు... అయినా మనలో వర్త్ ఉండాలి కాని, పేరు మార్చితే, ప్లేస్ మారిస్తే సియం కుర్చీ వచ్చేస్తుందా ఏంటి ? సరే ఇక నుంచి జగన్ అనే పేరు వినిపించదు... JMR అనే పేరు వినిపిస్తుంది... JMR అంటే జైల్ మోహన్ రెడ్డి అనుకునేరు, జగన్ మోహన్ రెడ్డి అని అర్ధం... జై JMR....

చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రోజులు అవి... 1995 నుంచి 2003 వరకు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు... అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వం పై వ్యతిరేకంగా పాదయాత్ర చేశారు... వైఎస్ఆర్ పాదయాత్రకు ఈనాడు విశేషమైన కవరేజ్ ఇచ్చింది. మెయిన్ పేజ్ లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఫోటోలను ఆయన పాదయాత్ర చేసినంత కాలం ప్రచురించేది. వైఎస్ అధికారంలోకి వచ్చారు.... తరువాత ఏమి జరిగింది అనే చరిత్ర అందరికీ తెలిసిందే.. రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు దోచేశారు... ఆ క్రమంలో, రాజశేఖర్ రెడ్డి దోపిడీ గురించి ఈనాడు రాస్తే, రాజశేఖర్ రెడ్డి తట్టుకోలేక, రామోజీని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు...

ramoji 01112017 2

అయితే రామోజీరావు వైఎస్ పాదయాత్రకు సహకరించడం చారిత్రాత్మక తప్పిదం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జనరేషన్ నాశనం అయిపాయింది అని, చాలా సార్లు తన కోటరీ వాళ్ళతో అన్నట్టు సమాచారం. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది... తన రాజకీయ మనుగడ కి సాక్షి ఒక్కటే సరిపోదు అని జగన్ రియలైజ్ అయ్యి, రామోజీతో కాళ్ళ బేరానికి వచ్చారు... బట్టలు లేకుండా రామోజీ కార్టూన్ వేసిన జగన్, ఇప్పుడు రామోజీ కోసం వచ్చారు.. ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి 40 నిమషాలు బ్రతిమిలాడారు... తన పాదయాత్రకు మద్దతు ఇవ్వాలి అని అడిగారు...

ramoji 01112017 3

ఇప్పుడు జగన్ కు సహకరిస్తే మళ్లీ రాజశేఖర్ రెడ్డి విషయంలో తప్పు చేసినట్టే అని ఆయనకు దగ్గరి వారు రామోజీకి చెప్పారు... మరి రామోజీ డెసిషన్ ఏంటో తెలీదు కాని, కొన్ని రోజులుగా ఈనాడులో అయితే, అసంబద్ధమైన కధనాలు, ఆంధ్రప్రదేశ్ రాష్టానికి వ్యతిరేకంగా వస్తున్నాయి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అది ఒక ఎత్తు కాని, ఇతర పత్రికలు లాగా, ఏకంగా రాష్ట్రం మీద వ్యతిరేకంగా రాస్తున్నారు... దానికి ప్రత్యేక్ష ఉదాహరణ, ఇంకా చాలా టైం ఉన్నా, కేంద్రం ర్యాంకులు ప్రకటించక పోయినా, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, మన రాష్ట్రానికి 15వ స్థానం వచ్చింది అని, తెలంగాణా ఫస్ట్ అని రాయటం... అంతే కాదు తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నా పట్టించుకోని ఈనాడు, అక్కడ ప్రభుత్వం ఏమి చేసినా చెయ్యకపోయినా పొగుడుతూ కధనాలు రాస్తూ, మన ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో, ఎదో ఒక వ్యతిరేకమైన బ్యానేర్ ఐటెం ఉండటానికి చూస్తుంది.. ఇది ఎంతలా అంటే, గుంటూరులో ఒక రౌడి, ఇంకో రౌడీని రోడ్డు మీద చంపితే, అది బ్యానర్ ఐటెం వేసి, రాజధాని భద్రం కాదు అనే భావన కలగించింది... మరి, రాజశేఖర్ రెడ్డి విషయంలో జరిగింది మర్చిపోయారో ఏమో కాని, ఎవరు ఏమి చేసినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పిచ్చ క్లారిటీతో ఉన్నారు...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై, ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజా సమస్యలను చర్చించాల్సిన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా, పాదయాత్రకు వెళతానని జగన్ అంటున్నారని... ఇది ముమ్మాటికీ యుద్ధభూమి నుంచి పారిపోవడమేనని ఎద్దేవా చేశారు.

raghuveera 01112017 2

ఏదైనా సమస్య కోసం వెళ్తే, నన్ను సీఎంను చేయండి.. అప్పుడే చేస్తానని చెప్పే నాయకుడు దేశం మొత్తం మీద ఈయనొక్కరే అంటూ ఎద్దేవా చేసారు... శాసనసభ అంటే ప్రభుత్వాన్ని నిలదీయడానికి చేసే వేదిక. ప్రజలు ప్రతిపక్ష పాత్ర అప్పగించినందుకు అక్కడ వారి సమస్యలను ప్రస్తావించి.. పరిష్కరించాలి గానీ, ఇదేంటి అంటూ మండిపడ్డారు.

raghuveera 01112017 3

తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కరించడానికే జగన్‌కు ప్రతిపక్ష నేత పదవిని ప్రజలు కట్టబెట్టారని, మంగళవారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఆయన విలేకరులతో అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటు పడాల్సిన ప్రతి పక్ష నాయకుడు, అసెంబ్లీకి వెళ్లనంటున్నారని ఇలాంటి వారికి ప్రజలు ఓటు ఎందుకు వేయాలని రఘువీరా ప్రశ్నించారు. జగన్ పాదయాత్రకు ప్రజలు రావచ్చేమో కానీ ఆ పాదయాత్రకు ప్రజామోదం ఉండదని ఆయన అన్నారు. ఆయన పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారన్నారు.

"ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టం... ఆయన అధికారులకు చేత పనులు చేపిస్తున్నారు.... అక్కడ ఏమి జరుగుతుందో, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడటానికి మమ్మల్ని కూడా తీసుకువెళ్తున్నారు... ఆయన మా సమస్య పరిష్కరిస్తారు అనే పూర్తి నమ్మకం మాకు ఉంది.... సూర్య చంద్రులు ఉండేంత వరకు, మీ లాంటి ముఖ్యమంత్రే కావలి..." ఇది ముఖ్యమంత్రి మీద ఫాతిమా వైద్య కళాశాల బాధితులకు ఉన్న భరోసా... ఒక పక్క వారు ఎంతో కష్టంలో ఉన్నా, ముఖ్యమంత్రి మాత్రమే, మా సమస్య తీరుస్తారు అనే నమ్మకం...

cbn 01112017 2

యాజమాన్యపు లోపాల వల్ల విద్యా సంవత్సరం నష్టపోయి వీధుల పాలైన కడప జిల్లా ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తిచేశారు. న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని విద్యార్థులకు సీఎం హామీ ఇచ్చారు. ఎంసీఐతో మాట్లాడాలని, అవసరమైతే నేను కూడా మాట్లాడుతానని, మంత్రి కామినేనిని సీఎం చంద్రబాబు ఆదేశించారు..

cbn 01112017 3

సుప్రీకోర్టుకు తాజా తీర్పు పై మరోసారి పిటిషన్ దాఖలు చేయాలని అధికారులకు ఆదేశించారు... 9 మందితో కమిటీ వేస్తన్నట్లు చెప్పిన చంద్రబాబు, దాంట్లో బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులును కూడా భాగస్వామ్యం చేసారు... సమగ్ర పరిశీలన జరిపి కేంద్రంతో మరోసారి చర్చలు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు... ప్రభుత్వ ప్రయత్నాల పై విద్యార్థులు సంతృప్తిగానే ఉన్నారన్న కామినేని, సుప్రీంకోర్టు తీర్పుతో అవకాశాలు మూసుకుపోయాయని, ఇదే విషషమై వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య రేపు దిల్లీ వెళ్తన్నారని, ముఖ్యమంత్రి ఎలా అయినా ఈ సమస్య పరిష్కారం చేస్తారని చెప్పారు... ఆ బాధితులు, ముఖ్యమంత్రి మీద, ఎంత నమ్మకంతో ఉన్నారో, మీరు ఈ వీడియోలో చూడండి...

Advertisements

Latest Articles

Most Read