చంద్రబాబు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రోజులు అవి... 1995 నుంచి 2003 వరకు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు... అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ప్రభుత్వం పై వ్యతిరేకంగా పాదయాత్ర చేశారు... వైఎస్ఆర్ పాదయాత్రకు ఈనాడు విశేషమైన కవరేజ్ ఇచ్చింది. మెయిన్ పేజ్ లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఫోటోలను ఆయన పాదయాత్ర చేసినంత కాలం ప్రచురించేది. వైఎస్ అధికారంలోకి వచ్చారు.... తరువాత ఏమి జరిగింది అనే చరిత్ర అందరికీ తెలిసిందే.. రాష్ట్రాన్ని తండ్రి కొడుకులు దోచేశారు... ఆ క్రమంలో, రాజశేఖర్ రెడ్డి దోపిడీ గురించి ఈనాడు రాస్తే, రాజశేఖర్ రెడ్డి తట్టుకోలేక, రామోజీని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు...

ramoji 01112017 2

అయితే రామోజీరావు వైఎస్ పాదయాత్రకు సహకరించడం చారిత్రాత్మక తప్పిదం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జనరేషన్ నాశనం అయిపాయింది అని, చాలా సార్లు తన కోటరీ వాళ్ళతో అన్నట్టు సమాచారం. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది... తన రాజకీయ మనుగడ కి సాక్షి ఒక్కటే సరిపోదు అని జగన్ రియలైజ్ అయ్యి, రామోజీతో కాళ్ళ బేరానికి వచ్చారు... బట్టలు లేకుండా రామోజీ కార్టూన్ వేసిన జగన్, ఇప్పుడు రామోజీ కోసం వచ్చారు.. ఏకంగా ఆయన ఇంటికి వెళ్లి 40 నిమషాలు బ్రతిమిలాడారు... తన పాదయాత్రకు మద్దతు ఇవ్వాలి అని అడిగారు...

ramoji 01112017 3

ఇప్పుడు జగన్ కు సహకరిస్తే మళ్లీ రాజశేఖర్ రెడ్డి విషయంలో తప్పు చేసినట్టే అని ఆయనకు దగ్గరి వారు రామోజీకి చెప్పారు... మరి రామోజీ డెసిషన్ ఏంటో తెలీదు కాని, కొన్ని రోజులుగా ఈనాడులో అయితే, అసంబద్ధమైన కధనాలు, ఆంధ్రప్రదేశ్ రాష్టానికి వ్యతిరేకంగా వస్తున్నాయి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అది ఒక ఎత్తు కాని, ఇతర పత్రికలు లాగా, ఏకంగా రాష్ట్రం మీద వ్యతిరేకంగా రాస్తున్నారు... దానికి ప్రత్యేక్ష ఉదాహరణ, ఇంకా చాలా టైం ఉన్నా, కేంద్రం ర్యాంకులు ప్రకటించక పోయినా, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, మన రాష్ట్రానికి 15వ స్థానం వచ్చింది అని, తెలంగాణా ఫస్ట్ అని రాయటం... అంతే కాదు తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నా పట్టించుకోని ఈనాడు, అక్కడ ప్రభుత్వం ఏమి చేసినా చెయ్యకపోయినా పొగుడుతూ కధనాలు రాస్తూ, మన ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ లో, ఎదో ఒక వ్యతిరేకమైన బ్యానేర్ ఐటెం ఉండటానికి చూస్తుంది.. ఇది ఎంతలా అంటే, గుంటూరులో ఒక రౌడి, ఇంకో రౌడీని రోడ్డు మీద చంపితే, అది బ్యానర్ ఐటెం వేసి, రాజధాని భద్రం కాదు అనే భావన కలగించింది... మరి, రాజశేఖర్ రెడ్డి విషయంలో జరిగింది మర్చిపోయారో ఏమో కాని, ఎవరు ఏమి చేసినా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పిచ్చ క్లారిటీతో ఉన్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read