ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కుమార్ తల్లిదండ్రులకు  ఏపి పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఆయన తల్లిదండ్రులు ఇంటికి విజయవాడ పోలీసులు ఈ రోజు వెళ్లారు. కొండాపూర్‍లోని పీవీ రమేష్ తండ్రి నివాసానికి ముగ్గురు ఆంధ్రప్రదేశ్ పోలీసుల బృందం వచ్చింది. ఓ కేసు విచారణలో భాగంగా ఏ ఈనెల 22న విచారణకు రావాలని నోటీసులు అందజేసారు. అయితే రమేష్‍కుమార్ తల్లిదండ్రుల వయసు 80 ఏళ్ళపైనే ఉండి. వృద్ధులైన రమేష్ తల్లిదండ్రులను పోలీసులు కావాలాని వేధిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.  పీవీ రమేష్ కుమార్ తల్లిదండ్రులు ఈ విషయం పై స్పందించారు. గతంలో సిఐది చీఫ్ సునీల్ కుమార్ కు, తమకు విబేధాలు ఉన్నాయని, తమ కూతురు భర్త అయిన సునీల్ కుమార్ పై గృహ హింస కేసు పెట్టామని, అది దృష్టిలో పెట్టుకుని, ఇప్పుడు తమ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. తమను ఈ వయసులో ఏడిపించటం భావ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం పై పీవీ రమేష్ స్పందించాల్సి ఉంది.

దర్శకుడు రాంగోపాల్ వర్మ, మంత్రి కొడాలి నానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కొడాలి నాని గుడివాడకి క్యాసినో తెస్తే, అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. బుర్ర లేని వాళ్ళే కొడాలి నానిని తిడుతున్నారని, గుడివాడకు గోవా కల్చర్ తెచ్చారని, గుడివాడ వాళ్ళు గోవా వెళ్తారు కానీ, గోవా వాళ్ళు గుడివాడ రారని, కొడాలి నాని గుడివాడను ఆధునీకరణ చేసారని వర్మ అన్నారు. కొడాలి నానిని వ్యతిరేకించే వాళ్ళు, ఆధునీకరణ అడ్డుకుంటే, పాత చీకటి రోజుల్లో ఉంటారా అని అన్నారు. గుడివాడను పారిస్, లండన్, లాస్ వేగాస్ సరసన చేర్చిన కొడాలి నాని అభినందిస్తున్నా అని అన్నారు. లాస్ వేగాస్, గోవా సరసన గుడివాడని చేర్చినందుకు గర్వ పడాలని అన్నారు. గుడివాడలో క్యాసినో తెచ్చిన కొడాలి నానిని విమర్శించే వాళ్ళని పట్టించుకొనవసరం లేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు ఉదయం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. నిన్న హైదాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న చంద్రబాబు, ఉండవల్లి నివాసంలో హోం ఇసోలేషన్ లో ఉన్నారు. చంద్రబాబు స్వల్ప లక్షణాలతో కరోనా బారిన పడ్డారు. ఉదయం నుంచి అనేక మంది పార్టీలకు అతీతంగా చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆశించారు. కొద్ది సేపటి క్రితమే జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. మా మావయ్య చంద్రబాబు, అలాగే లోకేష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. ఉదయం నుంచి ఎన్టీఆర్ ట్వీట్ చేస్తారా లేదా అని సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇదే ఆసరాగా తీసుకుని, పేటీయం బ్యాచ్లు రెచ్చిపోయాయి. అయితే ఎన్టీఆర్ ట్వీట్ చేయటంతో, పాపం వారి ఆశల మీద నీళ్ళు చల్లినట్టు అయ్యింది. జగన మోహన్ రెడ్డి, గవర్నర్, చిరంజీవి, ఇలా అనేక మంది ప్రముఖులు చంద్రబాబు త్వరగా కోలుకోవాలి అంటూ ఆకాంక్షించారు.

వైసీపీ రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే త్వరలో తాను పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించిన ప్రకటన తరువాత సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ తానూ మళ్ళి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే తను గెలవడం ఖాయమని, సర్వేలు కూడా అవే చెప్తున్నాయని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. అయితే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేస్తే నరసాపురంలో వైసిపి నుంచి బరిలోకి ఎవరిని దింపాలనే ప్లాన్ బారీగా జరుగుతునట్లు తెలుస్తుంది. ఈ విషయం బయట మాత్రం ఎవరు మాట్లాడక పోయినా అంతర్గతంగా మాత్రం పెద్ద ప్లానే వేస్తున్నట్లు సమాచారం. జగన్ మాత్రం రఘురామకృష్ణంరాజు విషయం లో చాల మైండ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు విషయం గురించి జగన్ దగ్గర మాట్లాడగా అసలు ఆయన రాజీనామా చేయాలి కదా అప్పుడు చూద్దాం అన్నట్టు జగన్ అన్నారు అట. స్పీకర్ రాజీనామా ఆమోదం పైనా వైసిపి నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఒకవేళ స్పీకర్ ఆమోదం తెలిపినా, 6 నెలలలోపే ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఈ లోపే తమ ప్లాన్లు ఎక్కడ బయటపడకుండా చూసుకోవాలని వైసిపి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

rrr 18012022 2

మరోవైపు ఒకవేళ రఘురామకృష్ణంరాజు కనుక పార్టీకి రాజీనామా చేస్తే నర్సాపురం బరిలో ఎవరిని దింపాలనే దాని పైన చర్చ నడుస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంవీజీకే భానుని రఘురామకృష్ణంరాజుకి పోటీగా నిలపెట్టాలనే గట్టి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ భాను 1958 లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ నుంచి కూడా అభినందనలు అందుకున్న వ్యక్తిగా ఈయనకు పేరుంది. రాజ శేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సందర్భంలో ఈయన బెజవాడ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పని చేసారు. తరువాత రోశయ్య వద్ద కూడా పని చేసారు. ఈయన సామాజికవర్గం ఇక్కడ కలిసి వస్తుందని వైసీపీ భావిస్తుంది. ఇప్పటికే ఈ అంశం పైన సర్వేలు కూడా వైసీపీ చేపించిందని అంటున్నారు. మరో వైపు చిరంజీవిని కూడా ఇప్పటికే సంప్రదించగా, ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ముందు ముందు నర్సాపురం వేదికగా ఏపి రాజకీయాలు వేడెక్కనున్నాయి.

 

Advertisements

Latest Articles

Most Read