వైసీపీ రఘురామకృష్ణంరాజు తన సొంత పార్టీనే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. అయితే త్వరలో తాను పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించిన ప్రకటన తరువాత సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ తానూ మళ్ళి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే తను గెలవడం ఖాయమని, సర్వేలు కూడా అవే చెప్తున్నాయని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. అయితే రఘురామకృష్ణంరాజు రాజీనామా చేస్తే నరసాపురంలో వైసిపి నుంచి బరిలోకి ఎవరిని దింపాలనే ప్లాన్ బారీగా జరుగుతునట్లు తెలుస్తుంది. ఈ విషయం బయట మాత్రం ఎవరు మాట్లాడక పోయినా అంతర్గతంగా మాత్రం పెద్ద ప్లానే వేస్తున్నట్లు సమాచారం. జగన్ మాత్రం రఘురామకృష్ణంరాజు విషయం లో చాల మైండ్ గేమ్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు విషయం గురించి జగన్ దగ్గర మాట్లాడగా అసలు ఆయన రాజీనామా చేయాలి కదా అప్పుడు చూద్దాం అన్నట్టు జగన్ అన్నారు అట. స్పీకర్ రాజీనామా ఆమోదం పైనా వైసిపి నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఒకవేళ స్పీకర్ ఆమోదం తెలిపినా, 6 నెలలలోపే ఎన్నిక జరగాల్సి ఉంటుంది. ఈ లోపే తమ ప్లాన్లు ఎక్కడ బయటపడకుండా చూసుకోవాలని వైసిపి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు ఒకవేళ రఘురామకృష్ణంరాజు కనుక పార్టీకి రాజీనామా చేస్తే నర్సాపురం బరిలో ఎవరిని దింపాలనే దాని పైన చర్చ నడుస్తుంది. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంవీజీకే భానుని రఘురామకృష్ణంరాజుకి పోటీగా నిలపెట్టాలనే గట్టి ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ ఐఏఎస్ ఆఫీసర్ భాను 1958 లో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జన్మించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ నుంచి కూడా అభినందనలు అందుకున్న వ్యక్తిగా ఈయనకు పేరుంది. రాజ శేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సందర్భంలో ఈయన బెజవాడ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ పని చేసారు. తరువాత రోశయ్య వద్ద కూడా పని చేసారు. ఈయన సామాజికవర్గం ఇక్కడ కలిసి వస్తుందని వైసీపీ భావిస్తుంది. ఇప్పటికే ఈ అంశం పైన సర్వేలు కూడా వైసీపీ చేపించిందని అంటున్నారు. మరో వైపు చిరంజీవిని కూడా ఇప్పటికే సంప్రదించగా, ఆయన తిరస్కరించిన విషయం తెలిసిందే. ముందు ముందు నర్సాపురం వేదికగా ఏపి రాజకీయాలు వేడెక్కనున్నాయి.