"ఇదే వాదనతో నిన్న కాక మొన్న ప్రజల్లోకి వెళ్ళావ్... నంద్యాలలో ప్రజలు కోలుకోలేని దెబ్బ కొట్టారు... 14 రోజులు ఆడ పిల్లనైన నా మీద పగ పట్టి, ప్రచారం చేశావ్, చివరకు ఏమైంది ?" ఇది మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ జగన్ ను ఉద్దేశించి చెప్పిన మాటలు... చంద్రబాబు, మా ఎమ్మెల్యేలను, కోట్ల రూపాయలకు కొన్నాడు... వీళ్ళు సిగ్గు లేకుండా అమ్ముడుపోయారు, అని జగన్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాసిన లేఖ పై అఖిల ప్రియ స్పందిచారు...
నిన్న కాక మొన్న మా చేతిలో ఓడిపాయవు, ఇదే వాదన ప్రజల్లో వినిపించావ్, అమ్ముడు పోయాము అన్నావ్, చివరకు ప్రజలు అభివృద్ధికి వోట్ వెయ్యలేదా అని అఖిల ప్రియ అన్నారు... రాజీనామాకు తాము సిద్ధమే అని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేము రెడీ అంటూ, జగన్ కు చాలెంజ్ చేశారు... స్పీకర్ దగ్గర మా రాజీనామలు ఉన్నాయని, ఏ నిర్ణయం తీసుకున్నా మేము రెడీ అన్నారు... మేము, అభివృద్ధిని నమ్ముకుని, చంద్రబాబు వెంట వచ్చాం.. నీ శాడిజం తట్టుకోలేక మేము పార్టీ మారం... మాకు డబ్బులకి లొంగాల్సిన అవసరం ఉందో లేదో, మా ఆళ్లగడ్డ ప్రజలని వచ్చి అడుగు అంటూ జగన్ కు చాలెంజ్ చేశారు... నువ్వు మాకు ఎంత మర్యాద ఇచ్చావో, మాకు తెలుసు అని, భుమా నాగిరెడ్డి చనిపోయిన తరువాత నువ్వు చూపించిన శాడిజం ఇంకా గుర్తుంది అంటూ నిప్పులు చెరిగారు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలను బహిష్కరించడంపై అఖిలప్రియ స్పందించారు... ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ మంచి వేదిక అన్నారు... ఇప్పుడు బహిష్కరణ ద్వారా వైసిపి మంచి అవకాశం కోల్పోయిందన్నారు... ఈయనకు ప్రజలు అంటే, పోరాటాలు అంటే ఎంత భయమో ఇక్కడే తెలుస్తుంది అన్నారు... అది చేతకాక, ఎప్పుడూ తప్పించుకోవటానికి చూస్తూ ఉంటారు అని అన్నారు... ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటే, ఈ సారి ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అన్నారు...